ఆట అదరగొట్టారు | 'sakshi' erinavan Sports | Sakshi

ఆట అదరగొట్టారు

Feb 3 2016 1:04 AM | Updated on Aug 20 2018 8:09 PM

ఆట అదరగొట్టారు - Sakshi

ఆట అదరగొట్టారు

‘సాక్షి’ ఎరీనావన్ స్పోర్ట్స్‌లో యువత సత్తా చాటుతున్నారు.

‘సాక్షి’ ఎరీనావన్ స్పోర్ట్స్‌లో యువత సత్తా చాటుతున్నారు. బాస్కెట్‌బాల్, క్రికెట్ మ్యాచ్‌ల్లో ఉత్సాహంగా  పాల్గొనడంతో పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ వైఎంసీఏలో జరిగిన బాస్కెట్‌బాల్ మహిళలు, పురుషుల విభాగం ఫైనల్స్‌లో లయోలా అకాడమీ, సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజీలు విజేతలుగా నిలిచాయి. కేశవగిరిలోని అరోరా సైంటిఫిక్ టెక్నాలాజికల్ అండ్ రీసెర్చ్ అకాడమీ, ఘట్‌కేసర్ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీల్లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. నువ్వా, నేనా అన్నట్టుగా జట్లు తలపడ్డాయి. - సాక్షి, సిటీబ్యూరో
 
బాస్కెట్‌బాల్‌లో లయోలా అకాడమీ, సెయింట్ మార్టిన్స్ విజయం
సికింద్రాబాద్ వైఎంసీఏలో జరిగిన బాస్కెట్‌బాల్ ఫైనల్స్ ఆసక్తికరంగా సాగాయి. మహిళల విభాగంలో వీజేఐఈటీ(31 పాయింట్ల)పై లయోలా అకాడమీ (38 పాయింట్లు) విజయం సాధించి ట్రోఫీని దక్కించుకుంది. మానస 14 పాయింట్లు, మౌనిక తొమ్మిది పాయింట్లు సాధించి లయోలా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. వీజేఐఈటీలో నందిని 22 పాయింట్లు, పి.మౌనిక తొమ్మిది పాయింట్లు చేసినా జట్టును గట్టెక్కించలేకపోయారు. పురుషుల మ్యాచ్‌లో  సెయింట్ మార్టిన్స్ 32 పాయింట్లు చేసి గెలుపొందింది. లెండిల్ 12 పాయింట్లు, సంతోష్ రెడ్డి ఆరు పాయింట్లతో జట్టుకు విజయం అందించారు. వీబీఐటీ కేవలం 16 పాయింట్లు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement