నందికొట్కూరు జట్టు విజయకేతనం
Published Mon, Feb 20 2017 10:40 PM | Last Updated on Mon, Aug 20 2018 8:09 PM
కడప స్పోర్ట్స్: సాక్షి ఎరీనా స్కూల్ ఫెస్ట్‌లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లీగ్‌మ్యాచ్‌లో సోమవారం నందికొట్కూరు జట్టు విజేతగా నిలిచింది. కడప నగరంలో మధ్యాహ్నం నిర్వహించిన మ్యాచ్‌లో కనకమహాలక్ష్మి విద్యామందిర్(కడప), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (నందికొట్కూరు) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన నందికొట్కూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 12 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని దాదావలి 16 పరుగులు, అశోక్ 15 పరుగులు చేశారు. కనక మహాలక్ష్మి విద్యామందిర్ జట్టు బౌలర్‌లు పవన్ 4, షరీఫ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కనక మహాలక్ష్మి విద్యామందిర్ జట్టు 11.1 ఓవర్‌లో 63 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో నందికొట్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Advertisement
Advertisement