జింఖానా, న్యూస్‌లైన్: బీఎఫ్‌ఐ ఐఎంజీ రిలయన్స్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో లయోలా అకాడమీ 53-37తో భవాన్స్ డిగ్రీ కాలేజిపై నెగ్గింది. సికింద్రాబాద్‌లోని వైఎంసీఏలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ప్రారంభం నుంచి హోరాహోరీగా త లపడ్డాయి. మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 25-22తో భవాన్స్ కాలేజి ముందంజలో నిలిచింది.
రెండో అర్ధ భాగంలో విజృంభించిన లయోలా అకాడమీ క్రీడాకారులు గణేశ్ (26), ఉదయ్ (11) ప్రత్యర్థిని ప్రతిఘటించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. చివరి నిమిషంలో ఆటగాళ్లు చాకచక్యంగా వ్యవహరించడంతో జట్టుకు విజయం చేకూరింది. భవాన్స్ ఆటగాళ్లు హేమంత్ (17), విష్ణు (8) రాణించారు. మరో మ్యాచ్‌లో ఏవీ కాలేజి 60-49తో సెయింట్ మార్టిన్స్ కాలేజిపై గెలిచింది. ఆట ప్రారంభం నుంచి ఏవీ కాలేజి క్రీడాకారులు దూకుడుగా ఆడారు. కొంత సేపటికి తేరుకున్న సెయింట్ మార్టిన్స్ ఆటగాళ్లు చెలరేగారు. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 29-27తో ఏవీ కాలేజి ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ రె ండో అర్ధ భాగంలోనూ ఏవీ కాలేజి ఆటగాళ్లు బాలాజీ (27), శాంసన్ (12), పవన్ (12) అదే జోరును కొనసాగించారు. అయితే మార్టిన్స్ జట్టు ఆటగాళ్లు జోనా (21), విశాల్ (14), సంతోష్ (9) చివరి వరకు శ్రమించినప్పటికీ విజయం దక్కలేదు.
ఇతర మ్యాచ్‌ల ఫలితాలుముఫకంజా: 39 (అలీం 12, అద్నాన్ 11, త్రిభువన్ 11); మల్లారెడ్డి: 29 (మానవ్ 10, చైతన్య 9).
బిట్స్ పిలాని: 40 (ఇషాన్ 16, స్వర్ణిమ్ 12); అవంతి: 28 (జశ్వంత్ 14, కాకు 10).
మహిళల విభాగం
ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల: 36 (ప్రీతి 18, భవ్య 9, అమిత 9); సెయింట్ మార్టిన్స్: 25 (సుశ్మిత 9, దివ్య 9).
కస్తూర్బా కాలేజి: 39 (కోమల్ 12, ప్రీతి 12, శ్వేత 9); గోకరాజు కాలేజి: 15 (సింధూష 11).
సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి: 22 (శ్రేయ 10, ఆషేక 7); బిట్స్‌పిలాని: 10 (రక్షిక 4).
సీవీఎస్‌ఆర్: 32 (ప్రత్యూష 11, శ్రేష్ఠ 8, స్పందన 8); సెయింట్ ఆన్స్: 20 (దివ్యా బాయి 12, కీర్తి 6).
లయోలా అకాడమీ గెలుపు
Published Fri, Jan 31 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement