‘జబర్దస్త్‌’ బృందం సభ్యుల సందడి   | Jabardasth team members participate in junior college farewell party | Sakshi
Sakshi News home page

‘జబర్దస్త్‌’ బృందం సభ్యుల సందడి  

Published Sat, Feb 10 2018 3:51 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Jabardasth team members participate in junior college farewell party - Sakshi

విద్యార్థినులతో కలిసి నృత్యం చేస్తున్న జబర్దస్త్‌ బృందం సభ్యులు

సిరికొండ(నిజామాబాద్‌ రూరల్‌): మండల కేంద్రంలోని కామధేను జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో జబర్దస్త్‌ బృందం సభ్యులు వినోద్‌(వినోదిని), జీవన్‌లు సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించని కామెడీ షోతో ఆహూతులను అలరింపజేసింది. విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు. వారి కామెడీకి, నృత్యాలకు విద్యార్థులు ఈలలు, చప్పట్లతో కేకలు పెట్టారు. వారితో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు ఎగబడ్డారు. అనంతరం వారు మాట్లాడుతూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ బాశెట్టి లింబాద్రి, ఎంపీడీవో చందర్, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తోట రాజన్న, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బాజిరెడ్డి రమాకాంత్, రావుట్ల ఎంపీటీసీ సభ్యుడు ఎర్రన్న, సర్పంచ్‌లు సంజీవ్, రాజేశ్వర్, జాగృతి మండల కన్వీ నర్‌ కుందేళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement