23లోగా కళాశాలల వివరాలు పంపాలి
Published Thu, Jul 21 2016 9:55 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
ఆదిలాబాద్ టౌన్ : 2016–17 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం లాగిన్ అవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఆర్‌ఐవో కార్యాలయంలో ఈ నెల 23లోగా సమర్పించాలని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షకుడు నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వివరాలను ఇంటర్ బోర్డుకు పంపాల్సి ఉంటుందని, వివరాలు సమర్పించని వారికి అడ్మిషన్ లాగిన్ ఇవ్వబోమని తెలిపారు. కళాశాలల్లో సీసీ కెమెరాలను అమర్చాలని తెలిపారు. అక్టోబర్‌లో బోర్డు ప్రతినిధులు ప్రతి కళాశాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement