రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఈనెల 29 నుంచి జూన్ 3వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటించిన ఇంటర్మీడియెట్ బోర్డు వచ్చే విద్యా సంవత్సరానికి (2014-15) అకడమిక్ కేలండర్‌ను కూడా జారీ చేసింది.
హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఈనెల 29 నుంచి జూన్ 3వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటించిన ఇంటర్మీడియెట్ బోర్డు వచ్చే విద్యా సంవత్సరానికి (2014-15) అకడమిక్ కేలండర్‌ను కూడా జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో చేపట్టబోయే విద్యా కార్యక్రమాలతో ఈ తాత్కాలిక కేలండర్‌ను రూపొందించినట్లు అందులో పేర్కొంది.
దీనిని జిల్లాల్లోని కాలేజీల ప్రిన్సిపాళ్లకు కూడా పంపించింది. కేలండర్‌లో పేర్కొన్న అంశాల మేరకు విద్యా కార్యక్రమాలను అమలు చేయాలని ప్రిన్సిపాళ్లను ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ ఆదేశించారు. జూన్ 2నే తరగతులను ప్రారంభించాలని మొదట నిర్ణయించినా, ఆ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అపాయింటెడ్ డే కావడం, 3వ తేదీన మంగళవారం కావడంతో 4 నుంచి తరగతులను ప్రారంభించేలా మార్పు చేశారు.
ఇవీ కేలండర్‌లోని ప్రధాన అంశాలు..
వచ్చే జూన్ 4న తరగతులు ప్రారంభం అవుతాయి. అప్పటినుంచి సెప్టెంబర్ 27 వరకు మొదటి విడత తరగతుల నిర్వహణ.
సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు ఆర్ధవార్షిక పరీక్షలు.
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు (మొదటి విడత సెలవులు). ్హ అక్టోబర్ 6న తిరిగి తరగతులు ప్రారంభం, అప్పటి
నుంచి 2015 మార్చి 27 వరకు రెండో విడత తరగతులు.
2015 జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు (రెండో విడత సెలవులు).
జనవరి 19న తిరిగి తరగతులు ప్రారంభం.
జనవరి 24 నుంచి 31 వరకు మొదటి దశ ప్రీఫైనల్ పరీక్షలు, హాజరు తక్కువ ఉన్న వారికి తరగతుల నిర్వహణ.
ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్ పరీక్షలు, హాజరు తక్కువ ఉన్న వారికి తరగతుల నిర్వహణ.
ఫిబ్రవరి 2వ వారంలో రెండో దశ ప్రీఫైనల్ పరీక్షలు. హాజరు తక్కువ ఉన్న వారికి తరగతుల నిర్వహణ.
మార్చి మొదటి వారంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం.
2014-15 విద్యా సంవత్సరపు చివరి పని దినం మార్చి 27.
2015 మార్చి 28 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు.
మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.
2015 జూన్ 1న తరగతులు ప్రారంభం (2015-16 విద్యాసంవత్సరం).