
సాక్షి, అమరావతి: ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావడంతో గంట ముందుగానే 8 గంటలకు విద్యార్దులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్దులను 8.30 గంటల నుంచి పరీక్ష హాల్ లోకి అనుమతించారు. విద్యార్దులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతించలేదు. విద్యార్దులను తనిఖే చేసి లోపలికి అనుమతించారు. మొదటి పరీక్ష కావడంతో విద్యార్థులతో పాటు తల్లితండ్రులు వారి వెంట వచ్చారు.
ఈ విద్యా సంవత్సరంలో 10,58,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్‌కు 44,581 మంది ఉన్నారు. రెండో ఏడాది విద్యార్థులు జనరల్ 4,71,021 మంది, ఒకేషనల్‌కు 42,328 మంది ఉన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు పరీక్షల విభాగం కంట్రోలర్ (సీవోఈ) సుబ్బారావు తెలిపారు.
అన్ని సెంటర్‌లు, పరీక్ష గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని, సెంటర్ సూపరింటెండెంట్లకు బోర్డు నుంచే ప్రత్యేక ఫోన్ సిమ్ కార్డులను ఇచ్చామని చెప్పారు. ప్రశ్న పత్రాలు ట్యాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూ ఆర్ కోడ్, వాటర్ మార్కులో కోడ్ నంబర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.

Comments
Please login to add a commentAdd a comment