మిరుదొడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్, కామర్స్ సబ్జెక్టులు బోధించేందుకు రిటైర్డ్ లెక్చరర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్ తెలిపారు.
మిరుదొడ్డి: మండల కేంద్రమైన మిరుదొడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్, కామర్స్ సబ్జెక్టులు బోధించేందుకు రిటైర్డ్ లెక్చరర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మిరుదొడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ ఎంపికైన లెక్చరర్లకు ప్రతి పీరియడ్‌కు రూ. 150లు చొప్పున గరిష్టంగా నెలకు రూ. 10 వేల వేతనం మించకుండా చెల్లిస్తామన్నారు. ఆసక్తి కలిగిన రిటైర్డ్ లెక్చరర్లు ఈ నెల 27వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.