![Minister Koppula Eshwar Says Minority Gurukulas Gets Junior College Status - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/12/Koppula-Eshwar.jpg.webp?itok=N1VLG6ij)
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 71 మైనారిటీ గురుకుల విద్యాలయాలను జూనియర్ కళాశాలలుగా స్థాయి పెంచనున్నట్టు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శాసనసభలో బుధవారం షకీల్ అహ్మద్, విద్యాసాగరరావు, స్టీఫెన్‌సన్, గాదరి కిషోర్‌కుమార్, హరిప్రియ, సురేందర్, బాల్క సుమన్ తదితరులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా వివరాలు వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని తరహాలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకులాలను అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీటిల్లో ఒక్కో విద్యార్థిపై సగటున రూ.50,686 చొప్పున ఖర్చు చేస్తున్నామన్నారు. కొన్ని గురుకులాలు అద్దె భవనాల్లో ఉన్నా.. వసతులపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూస్తున్నామన్నారు. భవిష్యత్తులో వీలైనన్ని సొంత భవనాలు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment