minority gurukula
-
మైనారిటీ గురుకులాల్లో బదిలీల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ అధీనంలోని సంస్థల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. గురుకుల సరీ్వస్ నిబంధనలకు విరుద్ధంగా జూలై 6న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హేమలత సహా మరికొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గురుకుల సిబ్బందిని తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సరీ్వస్ నిబంధనల పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం 2022లో ఉత్తర్వులు ఇచి్చందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించిందని, స్టే ఉండగా బదిలీ మార్గదర్శకాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని గురుకులాల కార్యదర్శిని ఆదేశిస్తూ, బదిలీ మార్గదర్శకాలను 18 వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
‘మైనారిటీ గురుకులాలకు జూనియర్ కాలేజీ హోదా’
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 71 మైనారిటీ గురుకుల విద్యాలయాలను జూనియర్ కళాశాలలుగా స్థాయి పెంచనున్నట్టు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శాసనసభలో బుధవారం షకీల్ అహ్మద్, విద్యాసాగరరావు, స్టీఫెన్సన్, గాదరి కిషోర్‌కుమార్, హరిప్రియ, సురేందర్, బాల్క సుమన్ తదితరులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా వివరాలు వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని తరహాలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకులాలను అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీటిల్లో ఒక్కో విద్యార్థిపై సగటున రూ.50,686 చొప్పున ఖర్చు చేస్తున్నామన్నారు. కొన్ని గురుకులాలు అద్దె భవనాల్లో ఉన్నా.. వసతులపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూస్తున్నామన్నారు. భవిష్యత్తులో వీలైనన్ని సొంత భవనాలు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. -
మైనారిటీ గురుకులాలకు రూ.100 కోట్లు
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడి సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాల భవన నిర్మాణాలకు కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి శుక్రవారం ఫోన్ చేసి చెప్పినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఇటీవల చెన్నైలో జరిగిన దక్ష ణాది రాష్ట్రాల మైనారిటీ వ్యవహారాల సమీక్షా సమావేశం సందర్భంగా తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 120 మైనారిటీ గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.1200 కోట్లు నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం అలీ కేంద్రాన్ని కోరారు. సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించడంతో మొదటి విడతగా ఏడు మైనారిటీ గురుకుల పాఠశాల భవనాల నిర్మాణాలకు కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసింది.