డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాల భవన నిర్మాణాలకు కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి శుక్రవారం ఫోన్ చేసి చెప్పినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఇటీవల చెన్నైలో జరిగిన దక్ష ణాది రాష్ట్రాల మైనారిటీ వ్యవహారాల సమీక్షా సమావేశం సందర్భంగా తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 120 మైనారిటీ గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.1200 కోట్లు నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం అలీ కేంద్రాన్ని కోరారు. సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించడంతో మొదటి విడతగా ఏడు మైనారిటీ గురుకుల పాఠశాల భవనాల నిర్మాణాలకు కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసింది.
మైనారిటీ గురుకులాలకు రూ.100 కోట్లు
Published Sat, Oct 1 2016 2:31 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
Advertisement