Deputy CM Mahmood Ali
-
ఎస్సీ, ఎస్టీలకు అండగా ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన కార్యాలయాన్ని బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్ 3వ అంతస్తులో శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, శాసన మండలి ప్రభుత్వ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, సమాచారహక్కు ప్రధాన కమిషనర్ రాజాసదారాం, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు, కార్పొరేషన్ చైర్మ న్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కమిషన్ ఉందా అనే అనుమానం ఉండేదన్నారు. తెలంగాణ వస్తే వారికి పరిపాలించుకొనే స్తోమత ఉందా అని సమైక్యరాష్ట్ర పాలకులు ఎద్దేవా చేశారని, అన్ని అవరోధాల ను అధిగమించి అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కమిషన్ చైర్మన్‌గా అవకాశం ఇవ్వడంతో ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, 2003లోనే కమిషన్ ఏర్పాటైనా ఎక్కడా పనిచేయలేదన్నారు. గతంలో సమైక్యపాలకులకు మాత్రమే కమిషన్‌లో అవకాశం ఇచ్చారని, తెలంగాణ దళితులకు అడుగడుగునా అన్యాయం జరిగిందన్నారు. కమిషన్ ద్వారా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ముందుంటామన్నారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా కమిషన్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
‘డిప్యూటీ సీఎంను తొలగించాలి’
హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ. లక్ష కోట్లు ఇచ్చాం అనగానే ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఖండించిన సీఎం కేసీఆర్ లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందంటున్న ఎందుకు మౌనం వహిస్తున్నారని.. బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 24 గంటల్లో భూ కుంభకోణం పై వివరణ ఇవ్వాలి. డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి ఈ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిగే వరకు ఆయనను పదవి నుంచి దూరం పెట్టాలి. సీఎం మౌనంగా ఉన్నారంటే భూ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లే. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పై అమెరికాలో పలు కేసులు ఉన్నాయి.. సీఎం కేసీఆర్ కు ప్రసాద్ మధ్య ఉన్న బంధం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. -
మైనారిటీ గురుకులాలకు రూ.100 కోట్లు
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడి సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాల భవన నిర్మాణాలకు కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి శుక్రవారం ఫోన్ చేసి చెప్పినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఇటీవల చెన్నైలో జరిగిన దక్ష ణాది రాష్ట్రాల మైనారిటీ వ్యవహారాల సమీక్షా సమావేశం సందర్భంగా తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 120 మైనారిటీ గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.1200 కోట్లు నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం అలీ కేంద్రాన్ని కోరారు. సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించడంతో మొదటి విడతగా ఏడు మైనారిటీ గురుకుల పాఠశాల భవనాల నిర్మాణాలకు కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసింది. -
సింధు, గోపీలను నేనలా అనలేదు
హైదరాబాద్: 'సింధు- గోపీచంద్ లపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు' అంటూ కొద్ది రోజులుగా ప్రచారం అవుతోన్న వార్తలపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఎంతగానో అభిమానించే మీడియానే తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ లో భారత్ కు రజత పతకాన్ని సాధించిపెట్టిన సింధు దేశానికి గర్వకారణమని, అటు వంటి సింధును తయారుచేసిన కోచ్ పుల్లెల గోపీచంద్ గర్వించదగిన వ్యక్తి అని ఆయన అన్నారు. శుక్రవారం బషీర్ బాగ్ లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను మాట్లాడినట్లుగా మీడియాలో ప్రసారం అవుతోన్న వార్తలను ఆయన ఖండించారు. రియో నుంచి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సింధు- గోపీచంద్ లకు అద్భుత స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లిద్దరినీ గచ్చిబౌలి స్టేడియంలో సన్మానించింది. ఆ సందర్భంగా.. 'ఎంత ఖర్చయినాసరే, సింధూకు విదేశీ కోచ్ ను నియమించి మరింత ప్రోత్సహిస్తాం'అని డిప్యూటీ సీఎం అన్నట్లు వార్తలు వినవచ్చాయి. అయితే నిజానికి తాను అలా అనలేదని, గోపీచంద్ మరో అకాడమీని స్థాపించే ఆలోచనలో ఉంటే గనుక సహకరిస్తామని మాత్రమే అన్నట్లు మహమూద్ అలీ వివరణ ఇచ్చారు. 'నీటి ఒప్పందాల కోసం ఇటీవల ముంబై వెళ్లినప్పుడు కూడా అక్కడి మీడియా ఇదే విషయంపై నన్ను పదే పదే ప్రశ్నించడం నన్ను బాధ పెట్టింది. అప్పుడు సీఎం కేసీఆర్ నా పక్కనే ఉన్నారు. వార్తలు రాసేటప్పుడు సరైన ఆధారాలతో రాస్తే సమాజానికి మేలు కలుగుతుందని కేసీఆర్ చురకలు వేయడంతో విలేకరులు వెనక్కి తగ్గారు'అని మహమూద్ అలీ చెప్పారు. సింధుకుగానీ, గోపించద్కుగానీ అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అలీ తెలిపారు. -
‘ప్రతిపక్షాలు నాటకాలాడుతున్నాయి'
యాదాద్రి : అభివృద్ధిని అడ్డుకోవడానికి యత్నిస్తున్న ప్రతిపక్షాలు నాటకాలు ఆడుతున్నాయని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. సోమవారం నల్లగొండ జిల్లా యాదాద్రిలో నిర్మించనున్న రెవెన్యూ భవన సముదాయానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లన్న సాగర్‌ను నిర్మించి తీరుతామని.. ముంపు గ్రామ ప్రజలకు 123 జీవో ప్రకారం నష్టపరిహారం చెల్లించడంతో పాటు, ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్ట్‌ల ద్వారా మల్లన్న సాగర్‌కు నీళ్లు మల్లించి 70 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. -
'హైదరాబాద్ ముత్యాలకు ప్రసిద్ధి'
హైదరాబాద్: చారిత్రక హైదరాబాద్ నగరం ముత్యాలకు ప్రసిద్ధిగాంచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం నగరంలోని రసిక్ జెమ్స్ అండ్ జ్యుయెలర్స్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మేలైన ముత్యాలను వినియోగదారులకు అందించడం ద్వారా నగర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. -
సీమాంధ్ర ఏజెంటు జగ్గారెడ్డి
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పటాన్చెరు రూరల్: సీమాంధ్ర పాలకులు చంద్రబాబునాయడు, వెంకయ్యనాయుడుల ఏజెంటుగా వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిని ఓడించాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని పాటి చౌరస్తాలోని ఎస్వీఆర్ గార్డెన్లో టీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ద్రోహి అయిన జగ్గారెడ్డిని మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించాలన్నారు. తెలంగాణలో ఉద్యమాలు నడుస్తుంటే అడ్డుకున్న జగ్గారెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారన్నారు. ఎమ్మెల్యేలు, బాబూమోహన్, గ్యాదరి కిశోర్, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, భాను ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. చాగన్ల నరేంద్రనాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు జిల్లా ప్రజలకు చేసిందేమీలేదన్నారు. అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు వరకు మెట్రో రైలు, సంగారెడ్డి వరకు ఎంఎంటీఎస్ తీసుకవ స్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పనగేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.