‘ప్రతిపక్షాలు నాటకాలాడుతున్నాయి' | deputy cm Mahmood Ali slams oppositions over mallanna sagar | Sakshi
Sakshi News home page

‘ప్రతిపక్షాలు నాటకాలాడుతున్నాయి'

Published Mon, Jul 25 2016 2:29 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

‘ప్రతిపక్షాలు నాటకాలాడుతున్నాయి'

‘ప్రతిపక్షాలు నాటకాలాడుతున్నాయి'

యాదాద్రి : అభివృద్ధిని అడ్డుకోవడానికి యత్నిస్తున్న ప్రతిపక్షాలు నాటకాలు ఆడుతున్నాయని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. సోమవారం నల్లగొండ జిల్లా యాదాద్రిలో నిర్మించనున్న రెవెన్యూ భవన సముదాయానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లన్న సాగర్‌ను నిర్మించి తీరుతామని.. ముంపు గ్రామ ప్రజలకు 123 జీవో ప్రకారం నష్టపరిహారం చెల్లించడంతో పాటు, ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్ట్‌ల ద్వారా మల్లన్న సాగర్‌కు నీళ్లు మల్లించి 70 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement