తదుపరి విచారణ వరకు స్టే ఇచ్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ అధీనంలోని సంస్థల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. గురుకుల సరీ్వస్ నిబంధనలకు విరుద్ధంగా జూలై 6న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హేమలత సహా మరికొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గురుకుల సిబ్బందిని తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ సరీ్వస్ నిబంధనల పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం 2022లో ఉత్తర్వులు ఇచి్చందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించిందని, స్టే ఉండగా బదిలీ మార్గదర్శకాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని గురుకులాల కార్యదర్శిని ఆదేశిస్తూ, బదిలీ మార్గదర్శకాలను 18 వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment