మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 7 నెలలైందని, హామీల అమలు మాత్రం నీటిమూటగా మిగిలిపోయందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎంత వరకు వచ్చిందని, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భతి రూ.4,000 ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటర్లు ఇస్తామన్న హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు మాత్రం కొన్ని పోస్టులు కలుపుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై న అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి, నియామక పత్రాలు ఇచ్చి, నిరుద్యోగుల చెవులో పూలు పెట్టారన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు.
నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను పరామర్శించేందుకు గాంధీ హాస్పిటల్‌కు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాకేశ్ రెడ్డితోపాటు పలువురు విద్యార్థి ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment