ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే అందుకు తగ్గ తరగతి గదులు లేక అవస్థలు పడుతున్నారు. కళాశాల ప్రారంభించినప్పటి నుంచి తరగతి గదులు లేక అవస్థలు పడుతున్నామని కళాశాల ప్రిన్సిపల్ ఎస్. రమ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతు ఈ కళాశాలలో 450 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అందుకు సరిపడు గదులు లేవని చెప్పారు.
ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయని అందుకే మధ్యాహ్న సమయంలో ఇంటర్ కళాశాల నడుస్తోందన్నారు. గదులు ఇవ్వమంటే ఇక్కడ జెడ్పీ పాఠశాల హెచ్‌ఎం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కళాశాలకు క్రీడా మైదానంలోనే చివర ఎకరా స్థలంను కేటాయిస్తే నాబార్డు నిధులతో సొంత భవనాలు నిర్మించుకుంటామని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని కూడా కలిసినట్లు తెలిపారు.
సోమవారం మున్సిపల్ చైర్మన్ ముసలయ్యను కూడా లెక్చరర్లు కలిసినట్లు తెలిపారు. ఈ విషయంపై జెడ్పీ బాలుర పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు కళాశాల విద్యార్థులకు తమ గదులు ఇస్తే తమ విద్యార్థులను ఎక్కడ కూర్చోపెట్టుకోవాలని ప్రశ్నించారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకుంటేనే విద్యార్థులకు ఇబ్బందులు ఉండవని పలువురు పేర్కొంటున్నారు.
జెడ్పీ హైస్కూల్ X జూనియర్ కళాశాల
Published Tue, Jun 14 2016 9:34 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM
Advertisement
Advertisement