stranding
-
సౌదీలో చిక్కి.. చాటుకు నక్కి
జన్నారం: తెలియని దేశంలో చేయని తప్పుకు శిక్షలు అనుభవిస్తున్నారు. తినడానికి తిండి లేక.. ఉండడానికి నీడ లేక ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటున్నారు. ఏదో సంపాదిస్తామనే ఆశతో వెళ్లిన వారికి నిరాశే మిగిలింది. ఇక్కడే ఉండి కలో గంజో తాగే బదులు దూరదేశాలకు భ్రమలకు గురై వెళ్తూ నానా తంటాలు పడుతున్నారు. మా గోస చూడండి మమ్మల్ని దేశానికి వచ్చేలా చూడంటంటూ వాట్సప్‌ల్లో సందేశాలు పెడుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటిౖకైనా ప్రభుత్వం స్పందించి వారిని స్వదేశానికి వచ్చేందుకు చర్యలు చేపట్టాలని బాధితులు, కుటుంబీకులు కోరుతున్నారు. ‘అన్నా.... ఆరు నెలల సంది కంపెనీ అకామా ఇవ్వక పనిలోకి తీసుకుంటలేదు. ఇంటికి పంపుతలేదు. ఆరు నెలల సంది చాలా ఇబ్బందిలో ఉన్నాం. తిండికి ఉండేందుకు గోస అయితంది. బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి మాది. బయటకు పోతే పోలీసోల్లు పట్టుకుని జైళ్లవేస్తరని భయమవుతోంది. మా బాధలు పట్టించుకోండ్రి, సర్కారు దృష్టికి తీసుకెళ్లి మమ్ములను ఇంటికి చేర్చండి అన్నా’ అని సిరిసిల్ల జిల్లా వర్దనపెల్లికి చెందిన బోర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి తమ వాట్సప్ ద్వారా గల్ఫ్‌వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులను వేడుకుంటున్నారు. ఇలా సౌదీలో గత ఆరు నెలలుగా ఇబ్బందులకు గురవుతున్న 14 మంది కార్మికులు వాట్సప్ ద్వారా తమ బాధలను పంపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ముగ్గురు, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 14 మంది కార్మికులు ఉపాధి కోసం సౌదీ వెళ్లారు. అక్కడ ఆల్కుదిరి కంపెనీలో కార్మికులుగా చేరారు. ఇదివరకు రెండు మార్లు అకామ వచ్చింది. మూడోసారి అకామా ఇవ్వలేదు. జీతాలు కూడా కంపెనీ సరిగ్గా ఇవ్వలేదు. దీంతో తాము ఇంటికి వెళ్తాము అని రాజీనామా పత్రాలను కంపెనీకి ఇచ్చారు. కంపెనీ వారిని తమ ఇళ్లకు పంపాలని కోరారు. కాని కంపెనీ ఏ మాత్రం పట్టింపులేనట్లుగా వారికి పాస్‌పోర్టులు ఇచ్చి పంపించింది. జీతాలు ఇవ్వకపోవడంతో చేతిలో డబ్బులు లేవు. అకామ లేకుండా బయటకు వెళితే పోలీసులు జైళ్లో వేస్తారు. పని లేదు, ఇంటికి వెళ్లేందుకు డబ్బులు లేవు. తినేందుకు తిండి లేదు. ఉండేందుకు స్థలం లేదు. అక్కడ, ఇక్కడ అడుక్కుని తింటున్నారు. నాన్న చిత్రవధ అనుభవిస్తున్నాం. మా కుటుంబీకులు విషయం తెలిసిన నుంచి ఏడుస్తున్నారు. చాలా బాధనిపిస్తుంది. అని కార్మికులు తమ బాధలను వెళ్లగక్కారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి తమను స్వగ్రామాలకు చేర్చాలని కోరుతున్నారు. చిక్కుకుంది వీరే.. ఉపాధి కోసం సౌదీ వెళ్లి అక్కడి కంపెనీలు పట్టింపు లేకుండా ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 14 మంది అక్కడే చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. వారిలో కాసారం జైరాం( నిర్మల్ జిల్లా), నర్సింహుల పోశయ్య(మెదక్), మలేస్ చంద్రయ్య(మెదక్), బోర్ల శ్రీనివాస్(సిరిసిల్ల), కాసల రవి(కామారెడ్డి), బట్టనల్ల గణేశ్(నిజామాబద్), దుమల్ల గంగయ్య(కామారెడ్డి), సర్ల సాయిలు(కరీంనగర్), కొంబర్తుల అర్జయ్య(పశ్చిమగోదావరి), షేక్ రఫీ(జన్నారం, మంచిర్యాల జిల్లా), చిట్యాల రమేశ్( నిర్మల్), రాజేశంగౌడ్(జగిత్యాల), మాధవరావు(తూర్పు గోదావరి), మల్లేశం(కోరుట్ల) ఉన్నారు. తిండికి గోసైతంది మూడు నెలల నుంచి పని లేదు. పైసలు లేవు. తిండికి గోసైతంది. నీళ్లు కొనాల్సి వస్తోంది. చాలా బాధ అనిపిస్తుంది. గోస పడుతున్నం. ఉండటం, తినడానికి తిప్పలు పడుతున్నాం. మా బాధలను తెలుసుకుని మా కుటుంబీకులు ఏడుస్తున్నారు. చాలా బాధనిపిస్తుంది. మమ్ములను ఇంటికి చేర్చండి. కాసారం జైరాం, గులిమడ, నిర్మల్ జిల్లా ప్రభుత్వం పట్టించుకోవాలి సౌదీలో అకామ లేక నానా ఇబ్బందులు పడుతూ నాకు వీడియోలు పంపారు. ఈ వీడియోలను సంబంధిత అధికారులకు పంపాను. ఉపాధి లేక అప్పులు చేసి బయట దేశాలకు వెళ్లి నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు మానసికంగా కుంగిపోయి మృతి చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి. వారిని పట్టించుకుని స్వగ్రామాలకు తీసుకురావాలి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తాను. – పాట్కూరి బసంతరెడ్డి, గల్ఫ్‌వెల్ఫేర్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షుడు -
రిక్త‘హస్తమే’!
నిజాంసాగర్: అభయహస్తం పింఛన్లు రాక అవ్వలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కళ్లల్లో వొత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. స్వయం సహాయక సం ఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు వృద్ధాప్యం పొందిన తర్వాత ‘ఆసరా’ కోసం 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద రోజుకు రుపాయి చొప్పున ఏడాదికి రూ.365 చొప్పున మహిళలు చెల్లించారు. అభయహస్తంలో చేరిన మహిళలకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.500 చొప్పున పింఛన్ వచ్చేలా ఈ పథకాన్ని రూపొం దించారు. అప్పటి నుంచి ప్రతి నెలా డబ్బులు పొందిన వృద్ధులకు కొన్ని నెల ల నుంచి మాత్రం అందడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచడంతో పాటు, ప్రతి నెలా ఇస్తోంది. అదే అభియహస్తం పింఛన్‌దారులకు మాత్రం మొండిచేయి చూపుతోంది. ఆసరా కరువు..! స్వయం సహాయక సంఘాల మహిళలకు అభయహస్తం డబ్బులు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న డబ్బులను కూడా మంజూరు చేస్తున్నట్ల ప్రకటించి, నిధులు విడుదల చేశారు. నిధులు విడుదలై 20 రోజులు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరలేదు. సీఎం ప్రకటనతో హర్షం వ్యక్తం చేసిన అవ్వలు.. ఇంకా డబ్బు చేతికందకపోవడంతో నిరాశ చెందుతున్నారు. డబ్బుల కోసం ఎదురుచూపు.. ఈ పథకం కింద కామారెడ్డి జిల్లాలో 3,479 మంది మహిళలకు గాను రూ.1.56 కోట్లను మంజూరు చేశారు. కొన్ని నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న డబ్బులను ఆయా మండలాల కార్యాలయాల ఖాతాల్లో జమచేశారు. పింఛన్ డబ్బులు వచ్చి 20 రోజులు కావస్తున్నా లబ్ధిదారులకు మాత్రం అందలేదు. అభయహస్తం పింఛన్ డబ్బుల కోసం మహిళలు ఐకేపీ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో లబ్దిదారుకు రూ.4,500 నుంచి రూ.6 వేల వరకు రావాల్సి ఉంది. ఆయా గ్రామాల వారీగా ఉన్న అభయహస్తం పింఛన్‌దారులకు సంబంధించిన నిధులు వచ్చినా అధికారులు డబ్బుల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఖాతాలకు చేరని డబ్బులు ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసినా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, బిచ్కుం ద, జుక్కల్ మండలాల్లో అభయహస్తం పథకం కింద 2,442 మంది లబ్ధిదారులున్నారు. ఆయా మండలాల్లోని లబ్ధిదారులకు అభయహస్తం పింఛన్లు అందకపోవడంతో లబ్ధిదారులు డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. గతంలో లబ్ధిదారులకు బయోమెట్రిక్ ద్వారా అందించారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో నేరుగా అందించాల్సి ఉన్నా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల కోసం అధికారులు తాత్సారం చేస్తున్నారు. -
అదనపు విధులతో అవస్థలు
► రెండురకాల పనులతో అంగన్వాడీలకు ఇబ్బందులు లక్ష్మణచాంద : మండలంలోని వివిధ గ్రామాలలోని అంగన్ వాడీ కేంద్రాలలో ఆయాలు లేకపోవడంతో కార్యకర్తలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.మండలంలో17 గ్రామ పంచాయతీలు 23 గ్రామాలు ఉండగా వాటిలో మొత్తం 44 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేవలం 28 అంగన్ వాడి కేంద్రాలకు మాత్రమే ఆయాలు ఉన్నారు. మిగతా 16 అంగన్ వాడీ కేంద్రాలకు ఆయాలు లేరు. దీంతో ఆయాలు లేని అంగన్ వాడీ కేంద్రాలలో కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చామన్ పెల్లి, కూచన్ పెల్లి, బోరిగాం, నర్సాపూర్, కనకాపూర్, కాశిగూడా, ధర్మారం, రాచాపూర్, లక్ష్మణచాంద1,4,5, మొదలగు గ్రామాలలో ఆయాలు లేకపోవడంతో కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రకాల విధులతో ఇబ్బందులు మండలంలోని 12 గ్రామాల అంగన్ వాడీ కేంద్రాలకు ఆయాలు లేరు. దీంతో విధులు నిర్వహించటం తలనొప్పిగా తయారైంది. కేంద్రాలలో ప్రీ ప్రైమరి స్కూల్ కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాల్సిన అంగన్ వాడీ కార్యకర్తలు ఆయాలు లేకపోవడంతో వంటచేయడం , వడ్డించటం, పౌష్టికాహారం పంపిణిచేయడం, చిన్నారులను కేంద్రాలకు తీసుకురావండం, వారిని మళ్లీఇంటికి పంపించడం, కేంద్రాలను శుభ్రం చేయడం వంటి ఆయా విధులు కూడా నిర్వహిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురవుతున్న సమస్యలు అంగన్ వాడీ కేంద్రాలలో ఆయాలు లేక పోవడంతో ఆయలు చేసే కార్యక్రమాలను కార్యకర్తలు చేయడంతో ప్రీ స్కూల్ కార్యక్రమాల సంబంధించిన షెడ్యూల్ నిర్వహణలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రీ స్కూల్ కార్యక్రమాలతో పాటు 15 రకాల రికార్డులు రాయటం, సెక్టార్ సమావేశాలకు, ప్రాజెక్టు సమావేశాలకు హాజరు కావలసిన అవసరం ఉంటుంది. ఇట్టి సమావేశాలకు హాజరైన సందర్భాలలో అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రభుత్వ పథకాల ప్రచారంలో అసలే చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న వీరు చేస్తున్న పనులు చాలనట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ప్రచారంలోను, సర్వేలలోను భాగస్వాములను చేయటంతో మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా మారింది. ఇన్ని రకాల విధులు నిర్వహిస్తున్న కారణంగా చిన్నారుల ప్రీ విద్యపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇవే కాకుండా చిన్నారులకు వేసే టీకాలు ఇప్పించడం, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సలహాల కోసం నిర్వహించే ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం వంటి విధులు కూడా నిర్వహిస్తున్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మండలంలో ఖాళీగా ఉన్న ఆయాల పోస్టులను భర్తీ చేయాలని అంగన్ వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. -
బార్బీ మాత!
కొత్తగా పుట్టిన బిడ్డకు.. కొత్తగా తల్లి అయిన అమ్మాయికి ఉన్నన్ని ‘కష్టాలు’ ఉండవు. కొత్త బిడ్డ చీకూచింతా లేకుండా రోజంతా కొత్త తల్లిని అంటుకునే ఉంటుంది. కొత్త తల్లే పాపం.. బిడ్డతో నానా అవస్థలు పడుతుంటుంది. చివరికి పాలు పట్టడం కూడా - అలవాటయ్యే వరకు - ఆ అమ్మాయికి అవస్థే. బిడ్డ ఆకలితో ఏడిస్తే నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఈ ‘కొత్త అమ్మ’ పాలు పట్టవలసి వస్తుంది. అయితే దాన్ని అవస్థ అనుకోదు. పరిసరాలను చూసుకోదు. పాలు పట్టేస్తుంది అంతే. కానర్ కెండాల్ అనే అమెరికా అమ్మాయి కూడా ఇలాగే తన నెలల బిడ్డకు పాలు పట్టింది. కెండాల్ ఆ రోజు ‘టీజీఐ ఫ్రైడేస్’ అనే రెస్టారెంట్లో కూర్చొని ఉంది. వెయిటర్ కోసం చూస్తూ ఉంది. ఈలోపు ఆమె చేతుల్లోని బిడ్డ ఏడుపు మొదలుపెట్టాడు. ఎంతకూ ఆపడం లేదు. డైపర్ చూసింది. అది డ్రైగానే ఉంది. వాడు పాలకోసం ఏడుస్తున్నాడని అర్థం చేసుకుంది. వెంటనే తన టాప్‌ని ఓ వైపు మెడ కిందికి లాగి, వాడి నోటికి చనుబాలు అందించింది. ఏడుపు మాయం! తల్లి మనసు నెమ్మదించింది. తన ఆకలి మరిచిపోయింది. వెయిటర్ తెచ్చిపెట్టిందేదో ఇంత తినేసి వచ్చేసింది. తర్వాత కొద్ది రోజులకు ఇంటర్నెట్లో తన ఫొటో చూసి షాక్ తింది కెండాల్. ఆ రోజు రెస్టారెంట్‌తో తన కొడుక్కి పాలు పడుతున్నప్పటి ఫొటో అది! ఎవరో ఫొటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు! కెండాల్ భయపడిపోయింది. గుర్తు తెలియని ఆ వ్యక్తి ఎవరో ఫొటో కింద కామెంట్స్ కూడా రాశారు. ‘‘బిడ్డ ఆకలి తీర్చడానికి మీరు పాలు పట్టారు. నేను అర్థం చేసుకోగలను. తప్పనిసరి పరిస్థితుల్లోనే మీరు అలా చేసి ఉంటారు. కానీ, మీ బ్రెస్ట్ కనిపించకుండా పైన ఏదైనా కప్పుకోవచ్చు కదా. దీనికి మీ సమాధానం ఏమిటి?’’ అని ఉంది అందులో! ఆ కామెంట్‌కి కెండాల్ రిప్లయ్ ఇచ్చారు. ఆ రిప్లయ్ కూడా ఒక అమ్మాయి ఇచ్చినట్టుగా గడుసుగా కాకుండా, ఒక తల్లి ఇచ్చినట్టుగా ‘తొందరపడి ఎవర్నీ అనేయకూడదు’ అని ఉగ్గుపాలతో చెప్పినట్టుగా ఉంది! ‘‘తలపై గుడ్డ కప్పితే, దాన్ని తీసేవరకు నా బిడ్డ పాలు తాగడు. అందుకే నేను బ్రెస్ట్‌పై క్లాత్ కప్పలేదు’’ అని తన రిప్లయ్‌లో వివరణ ఇచ్చింది కెండాల్. వివరణతో పాటే ఆ వ్యక్తి ‘చూపు’ను సరిచేసే ప్రయత్నం చేశారు. ‘‘బ్రెస్ట్ ఉన్నది బిడ్డలకు పాలు పట్టడానికే. వాటిల్లో మీకు ఇంకేదైనా భావం కనిపిస్తే అది మీ దృష్టి లోపం’’ అని రాసింది. ఇది జరిగి ఏడాదిన్నర అయింది. అప్పటి నుంచీ ‘పబ్లిక్ బ్రెస్ట్ ఫీడింగ్’పై ఎక్కడ చర్చ జరిగినా కానర్ కెండాల్ అనుభవం ఒక ఉదాహరణగా ముందుకు వస్తోంది. ఇప్పుడు తాజాగా బెట్టీ స్ట్రాన్ అనే ఆస్ట్రేలియా యువతి... బిడ్డకు పాలు పడుతున్న బార్బీడాల్ను డిజైన్ చేసి మార్కెట్లోకి విడుదల చేయడంతో కానర్ కెండాల్ వంటి కొత్త తల్లుల మనోభావాలకు ఒక బలమై సమర్థింపు లభించినట్లయింది. ‘‘బిడ్డకు తల్లి బహిరంగంగా స్తన్యం పట్టడంపై మన సమాజంలో ఉన్న సంకోచాలను, అభ్యంతరాలను పోగొట్టడానికి నేను చేసిన ఈ ప్రయత్నం ఫలిస్తుందనే అనుకుంటున్నాను’’ అని స్ట్రాన్ అంటున్నారు. బ్రిస్బేన్‌లో ఉంటున్న ఈ ఇద్దరు పిల్లల తల్లి తన బార్బీకి ‘మామ్స్ వరల్డ్‌వైడ్ బార్బీ’ అని పేరు పెట్టారు. బార్బీల రూపురేఖల్ని మార్చే అభిరుచి ఉన్న స్ట్రాన్ గతంలో ప్రెగ్నెంట్ బార్బీని కూడా డిజైన్ చేశారు. గర్భధారణ, స్తన్యం పట్టడం... ప్రకృతికి నిండుదనాన్నిచ్చే స్త్రీ సహజ ధర్మాలు. ఈ ధర్మాలపై నిర్ణయాలకు గానీ, తీర్మానాలకు గానీ హక్కు కూడా పూర్తిగా స్త్రీలదే. -
సరి కొత్త తిప్పలు
రూ.వంద నోట్లు నిండుకున్నాయ్! రూ.2 వేల నోట్లే ఉన్నాయ్! విశాఖపట్నం : పక్షం రోజుల నుంచి అవస్థలు పడుతున్న నగర వాసులకు సరికొత్త తిప్పలు మొదలవుతున్నారుు. రద్దరుున పెద్దనోట్ల మార్పిడికి బ్యాంకుల చుట్టూ క్యూ కడుతున్నారు. బ్యాంకుల్లో రూ.500, వెరుు్య నోట్లను మార్చుకునే వారికి రూ.100, 50, 20 నోట్లతో పాటు కొత్తగా వచ్చిన రూ.2 వేల నోట్లు ఇస్తున్నారు. రూ.2 వేల నోట్లకు చిల్లర దొరక్క మార్చుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. దీంతో కొత్త నోట్లను చాలామంది ఆభరణంలా భద్రంగా దాచుకుంటున్నారు. ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. నగరంలోని అనేక బ్యాంకుల్లో రూ. వంద నోట్లు నిండుకున్నారుు. రూ.2 వేల కొత్త నోట్లు మాత్రం పుష్కలంగా ఉన్నారుు. శుక్రవారం నుంచి ఖాతాదార్లకు ఈ నోట్లే అవసరాలు తీర్చనున్నారుు. ఇష్టం ఉన్నా, లేకపోరుునా బ్యాంకుల నుంచి సొమ్ము తీసుకోవాలంటే రూ.2 వేల నోట్లే గతి అయ్యే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం పరిస్థితులను బట్టి రూ.వంద, 50 నోట్లు రావడానికి మూడు, నాలుగు రోజులు పట్టవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. పెద్ద నోట్ల మార్పిడి చేసుకున్న వారికి బ్యాంకు అధికారులు సగం చిన్న నోట్లు, మిగిలిన సగానికి రూ.2 వేల నోటు ఇస్తూ వచ్చారు. అలా ఇచ్చిన రూ.2 వేల నోటు మారకం కష్టతరంగా మారింది. ఈ తరుణంలో కొన్నాళ్ల పాటు వాటినే తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం సామాన్యులకు మరింత అవస్థలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పలు బ్యాంకులు డబ్బుల్లేవంటూ చేతులెత్తేస్తున్నారుు. డబ్బు కొరతతో సతమతమవుతున్న నేపథ్యంలో కొత్తగా రూ.2 వేల నోట్లు గుదిబండలా మారడం నగర వాసులకు నగదు కష్టాలు మరింతగా తెచ్చిపెట్టనున్నారుు. -
ఇదేనా ‘ఆదర్శం’?
- అధ్వానంగా మోడల్ స్కూల్ - ఫ్లోరింగ్ లేక దుమ్ముతో ఇబ్బందులు - కరెంటు లేక వృథాగా కంప్యూటర్లు - ఐదేళ్లయినా అసంపూర్తిగానే - నిధులు లేక నిలిచిన పనులు - నేడు కమిషనర్ వద్ద సమస్యలపై సమావేశం నర్సాపూర్: జక్కపల్లి ఆదర్శ పాఠశాల నిర్వహణ అధ్వానంగా మారింది. ఐదేళ్లయినా భవనం పనులు పూర్తికాలేదు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లోరింగ్ లేని గదుల్లో తరగతులు కొనసాగించడంతో విద్యార్థులు దుమ్ముతో అవస్థలు పడుతున్నారు. మండలంలోని జక్కపల్లి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు ఉంది. ఇందులో సుమారు 555 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆదర్శ పాఠశాల భవన నిర్మాణానికి రూ.3.2 కోట్లు మంజూరయ్యాయి. 2011 జూన్‌లో ఈ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం హాస్టల్ భవనానికి రూ.1.28 కోట్లు మంజూరు కావడంతో అప్పటి మంత్రి సునీతారెడ్డి 24 ఆగస్టు 2012 శంకుస్థాపన చేశారు. ఐదేళ్లయినా నిర్మాణం పూర్తి కాలేదు. అసంపూర్తి భవనంలోనే రెండేళ్లుగా తరగతులు నిర్వహిస్తున్నారు. మొదటి అంతస్తులో ఫ్లోరింగ్ పనులు కాలేదు. కిటికీలకు తలుపులు బిగించాల్సి ఉంది. కరెంటు వైరింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు ఉన్నంత వరకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఆపై పనులు నిలిపివేశారు. అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు మొదటి అంతస్తులోని గదులు, వరండాలో ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ చేయనందున దుమ్ము లేచి పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకొందరు ఎలర్జీ సమస్యతో సతమతమవుతున్నారు. విద్యుత్ సరఫరా లేక కంప్యూటర్లు, కంప్యూటర్ ల్యాబ్ నిరుపయోగంగా ఉన్నాయి. బస్సులు లేక ఇబ్బందులు... జక్కపల్లి పాఠశాలకు విద్యార్థులు ఆయా గ్రామాలతోపాటు నర్సాపూర్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. నర్సాపూర్ నుంచి ఉదయం రెండు బస్సులనే అధికారులు నడుపుతున్నారు. బస్సుల కోసం గతంలో నర్సాపూర్‌లో రాస్తారోకో చేసినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గతంలోనే ఉన్నతాధికారులకు నివేదించినట్టు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు. నేడు కమిషనర్ వద్ద సమావేశం.. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు విద్యా శాఖ కమిషనరేట్‌లో జిల్లాల వారీగా సమీక్షలు జరుగుతన్నాయి. శనివారం మెదక్ జిల్లాలోని 24 ఆదర్శ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై సమీక్ష జరగనుంది. రాష్ట్ర కమిషనర్ కిషన్, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు కార్పొరేషన్ మెదక్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనిల్‌కుమార్‌తోపాటు కింది స్థాయి అధికారులు , ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొననున్నారు. -
వెతలు
♦ జీతాలు పెరగక ఎన్ఎంఆర్ ఉద్యోగుల అవస్థలు చివరగా 2013లో పెంపు ♦ ఈ ఉత్తర్వులు రెండేళ్లకే పరిమితం ♦ తాజా ఉత్తర్వుల కోసం 15 నెలలుగా నిరీక్షణ సత్వరం పెంచాలని విజ్ఞప్తి ♦ పట్టించుకోని అధికారులు సంగారెడ్డి టౌన్: వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే దినసరి వేతన జీవుల జీతాలు పెరగక అవస్థలు పడుతున్నారు. జీతాలు పెంచుతూ 2013లో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు రెండేళ్లకే పరిమితం. గడువు ముగిసి 15 నెలలు దాటినా తాజా ఉత్తర్వులు రావడం లేదు. ప్రస్తుత ధరలను సమీక్షించి అందుకు అనుగుణంగా కొత్తగా వేతనాలు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎన్ఎంఆర్ ఉద్యోగులు కోరుతున్నారు. ఇందుకోసం కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జీతాల పెంపుకోసం ఎదురు చూపులతో కాలం గడుపుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో దినసరి వేతనంతో పనిచేస్తోన్న నాన్ మస్టర్ రోల్ స్టాఫ్ (ఎన్ఎంఆర్) ఉద్యోగులు జీతాలు పెరగక ఇబ్బందులు పడుతున్నారు. జీతాల పెంపునకు సంబంధించిన అప్పటి కలెక్టర్, డిప్యూటీ లేబర్ కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా లాభం లేకపోయింది. నాటి ధరలకు అనుగుణంగా 2013లో అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నిత్యావసర ధరలు రెండేళ్లలో పదింతలు పెరిగాయని, జీతాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపు ఉత్తుర్వుల కోసం గత 15 నెలలుగా ఎదురు చూస్తున్నామన్నారు. ప్రభుత్వం శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచారని, తమ జీతాలు కూడా పెంచాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. పాత ఉత్తర్వులు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లాలో మొత్తం ఎంతమంది ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఉన్నారో తమ వద్ద సమాచారం అందుబాటులో లేదని చెప్పడం గమనార్హం. చివరిసారిగా 2013 నవంబరులో ఉత్తర్వులు... ఎన్ఎంఆర్ ఉద్యోగులకు సంబంధించిన కమిటీకి కలెక్టర్ చైర్మన్, కన్వీనర్‌గా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. డిసెంబర్ 2011లో ఈ ఉద్యోగుల జీతాలు పెంచారు. ఆపై రెండేళ్లకోసారి అప్పటి నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాలు పెంచుతూ 19 నవంబర్ 2013న అప్పటి కలెక్టర్ ఆదేశాలతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఉత్తర్వులు నం.సి/1393/2013 విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు మార్చి 2015 వరకు అమలులో ఉంటుందని అందులో సూచించారు. ఆ ఉత్తర్వుల గడువు అయిపోయి 15 నెలలుగడిచింది. దాంతో సదరు ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. 2013లో నిర్ణయించిన రోజువారి వేతనాలు.. అన్‌స్కిల్డ్ ఉద్యోగులైన మజ్దూర్, చౌకీదార్, అటెండర్, స్వీపర్, క్యాజువల్ లేబర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 245, పట్టణ ప్రాంతంలో రూ. 255గా నిర్ణయించారు. సెమీ స్కిల్డ్ ఉద్యోగుల రికార్డ్ అసిస్టెంట్, మిల్క్ రికార్డర్, మిల్క్ మ్యాన్, మిల్కర్, ఇతరులకు గ్రామీణ ప్రాంతంలో రూ. 295, పట్టణం ప్రాంతంలో 305, స్కిల్డ్ ఉద్యోగులైన కార్పెంటర్, క్లర్క్, టైపిస్ట్, స్టెనో, ఎలక్ట్రిషియన్, డ్రైవర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 330, పట్టణ ప్రాంతాల్లో రూ. 345గా నిర్ణయించారు. ఇప్పటికీ ఇవే వేతనాలను చెల్లిస్తున్నారు. పాత ఉత్తర్వులే అమల్లో.. ఇప్పటికీ పాత ఉత్తర్వులే కొనసాగుతున్నాయి. ఈ ఉత్తర్వులు 2013లో జారీ అయ్యాయి. జిల్లాలో ఎంతమంది ఎన్ఎంఆర్ ఉద్యోగులు పనిచేస్తున్నారో పూర్తి వివరాలు మా దగ్గర ఉండవు. - కోటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్మిక కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం... గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాలం చెల్లింది. 15 నెలలు దాటినా కొత్తగా ఉత్తర్వులు జారీ కాలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్తగా జీతాలు నిర్ణయించాలని పలుమార్లు అధికారులకు విన్నవించాం. కార్మిక శాఖ అధికారులను చాలాసార్లు కలిసాం. అయినా పట్టించుకోవడం లేదు. - శివకుమార్, ఎన్ఎంఆర్ ఉద్యోగి -
తిప్పి.. తిప్పి చంపేస్తారు
నిమ్స్ ట్రామా సెంటర్లో అవస్థలు అందుబాటులో లేని స్కానింగ్ పరికరాలు టెస్టుల పేరుతో క్షతగాత్రులను తిప్పుతున్న వైద్యులు గగ్గోలు పెడుతున్న రోగులు సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌కు వస్తున్న క్షతగాత్రులకు ప్రాణాలతో ఉండగానే నరకం కనిపిస్తోంది. గాయపడిన వారితో పాటు వారి వెంట ఉండే బంధువులకు సైతం ఈ పాట్లు తప్ప డం లేదు. ప్రమాదంలో గాయపడి ఇక్కడి అత్యవసర విభాగానికి చేరుకోగానే శరీరంలో ఏయే భాగాల్లో గాయాలయ్యాయో తెలుసుకునేందుకు వైద్యులు సీటీస్కాన్, ఎంఆర్ఐ స్కాన్ తీస్తారు. పొత్తికడుపులో తగిలి న దెబ్బలను గుర్తించేందుకు అల్ట్రాసౌండ్ టెస్టుకు సిఫా ర్సు చేస్తారు. కానీ ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లో సకాలంలో ఈ సేవలు అందక క్షతగాత్రులు మృత్యవాత పడుతున్నారు. అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన ఈ ట్రామా సెంటర్లో సీటీస్కాన్, ఎంఆర్ఐ, ఆల్ట్రా సౌండ్ యంత్ర పరికరాలు అందుబాటులో లేవు. అత్యవసర సెంటర్లో ఉండాల్సిన పరికరాలు పాత భవనంలో ఉన్నాయి. దీంతో వచ్చిన క్షతగాత్రులను ఇటూ అటూ తిప్పుతున్నారు. ఆస్పత్రి అత్యవసర విభాగానికి రోజూ 70-80 కేసులు వస్తుంటాయి. వీరిలో వివిధ రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారే ఎక్కువ. గాయాల తీవ్రతను గుర్తించాకే వైద్యం చేస్తారు. అందుకోసం బాధితులకు సీటీస్కాన్, ఎంఆర్ఐ విధిగా చేస్తారు. బతికుండగానే నరకం.. నిమ్స్ ట్రామా సెంటర్లో ఉండాల్సిన సీటీ, ఎంఆర్ఐ, ఆల్ట్రా సౌండ్ మిషన్లు పాత భవనంలోని రేడియాలజీ విభాగంలో ఉన్నాయి. తీసుకొచ్చిన క్షతగాత్రులను టెస్టుల కోసం ట్రామా సెంటర్ నుంచి పాత భవనానికి పంపుతున్నారు. అసలే విరిగి వేలాడుతున్న ఎముకలు, ఆపై భరించలేనినొప్పితో బాధపడుతున్నవారు అత్యవసర విభాగం నుంచి పాత భవనంలోని రేడియాలజీ విభాగానికి పదేపదే తరలించాల్సి రావడంతో గగ్గోలు పెడుతున్నారు. వారితో పాటు వెంట వచ్చిన బంధువులు సైతం తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా హెడ్, స్పైన్ ఇంజ్యురీతో బాధపడుతున్న బాధితులు చిత్రవధ అనుభవిస్తున్నారు. పుష్కలంగా నిధులున్నా.. స్వయం ప్రతిపత్తి కలిగిన నిమ్స్‌కు నిధులకు కొదవ లేదు. ప్రభుత్వం ఏటా బడ్జెట్లో భారీగానే కేటాయిస్తోంది. దీనికి తోడు రోగుల నుంచి కోట్ల రూపాయాల ఆదాయం సమకూరుతోంది. ఈ నిధులు ఖర్చు చేసి ట్రామా సెంటర్లోని బాధితుల కోసం సీటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ మిషన్లు కొనుగోలు చేయవచ్చు. ఎంఆర్ఐ మిషన్‌కు రూ.13 కోట్ల వరకు ఖర్చు అవుతుండగా సింగరేణి యాజమాన్యం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. టెండర్ కాల్‌ఫర్ చేసే సమయంలో డెరైక్టర్ ఇందుకు నిరాకరించడంతో దాతలనుంచి వచ్చిన విరాళాలు కూడా వెనక్కు వెళ్లిపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే రూ.27 కోట్ల విలువైన యంత్రాలకు టెండర్ పిలిచామని, మరో రూ.36 కోట్లతో మరిన్ని వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నట్లు నిమ్స్ యాజమాన్యం చెబుతుండడం కొసమెరుపు. -
జెడ్పీ హైస్కూల్ X జూనియర్ కళాశాల
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే అందుకు తగ్గ తరగతి గదులు లేక అవస్థలు పడుతున్నారు. కళాశాల ప్రారంభించినప్పటి నుంచి తరగతి గదులు లేక అవస్థలు పడుతున్నామని కళాశాల ప్రిన్సిపల్ ఎస్. రమ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతు ఈ కళాశాలలో 450 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అందుకు సరిపడు గదులు లేవని చెప్పారు. ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయని అందుకే మధ్యాహ్న సమయంలో ఇంటర్ కళాశాల నడుస్తోందన్నారు. గదులు ఇవ్వమంటే ఇక్కడ జెడ్పీ పాఠశాల హెచ్ఎం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కళాశాలకు క్రీడా మైదానంలోనే చివర ఎకరా స్థలంను కేటాయిస్తే నాబార్డు నిధులతో సొంత భవనాలు నిర్మించుకుంటామని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని కూడా కలిసినట్లు తెలిపారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ ముసలయ్యను కూడా లెక్చరర్లు కలిసినట్లు తెలిపారు. ఈ విషయంపై జెడ్పీ బాలుర పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు కళాశాల విద్యార్థులకు తమ గదులు ఇస్తే తమ విద్యార్థులను ఎక్కడ కూర్చోపెట్టుకోవాలని ప్రశ్నించారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకుంటేనే విద్యార్థులకు ఇబ్బందులు ఉండవని పలువురు పేర్కొంటున్నారు. -
చిరునామా చెప్పారూ!
నగరంలో గందరగోళంగా ఇంటి నెంబర్లు గుర్తించేందుకు కష్టాలు నిత్యం ఎంతోమందికి అవస్థలు సిటీబ్యూరో: సురేష్ కొత్తగా నగరంలోకి వచ్చాడు. బంజారాహిల్స్‌లో ఉంటున్న అతని మిత్రుడు ఇచ్చిన చిరునామా ఆధారంగా ఇంటి నెంబర్ కనుక్కొనేందుకు బయలుదేరాడు. ఉదయం 8 గంటలకు వెతకడం ప్రారంభిస్తే...11 గంటలైనా చిరునామా కనుక్కోలేకపోయాడు. ఇంటి నెంబర్ గుర్తించలేకపోయాడు. చివరికి తన మిత్రుడు ఆఫీస్‌కు ఒక పూట సెలవు పెట్టి...స్వయంగా వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఒక్క సురేష్ మాత్రమే కాదు... నిత్యం ఎంతోమందికి ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. పూర్తి చిరునామా కాగితం చేతిలో ఉన్నా.. మనం చేరాల్సిన ఇల్లు ఎక్కడ ఉందో తెలియక గంటలు గంటలు తిరగాల్సిన పరిస్థితి. ఒక ఇంటి నెంబరును చూసి.. తర్వాతి నెంబరు గల ఇల్లు పక్కనే ఉంటుందనుకుంటే పొరపాటే. గజిబిజి గల్లీలు... క్రమపద్ధతిలో లేని వీధి నెంబర్లు... గందరగోళంగా కాలనీలు... వరుస క్రమంలో లేని ఇళ్ల నెంబర్లు.. ఒక్క డోర్ నెంబరులోనే ఎన్నో బై (/) సంఖ్యలతో ఇళ్లు. వీటిలో అసలు చిరునామా కనుక్కోవడానికి నిత్యం ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాటి నెంబర్ల వ్యవస్థే నేటికీ కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో లక్షల సంఖ్యలో ఇళ్లు పెరిగాయి. దాంతో అప్పటికే ఉన్న ఇంటి నెంబరుకు ‘బై’ (/) గుర్తును చేర్చి... వరుసగా నెంబర్లు రాసుకుంటూ పోవడమో లేక ఏ..బీ..సీ.. డీ.. ఈ..లుగా పొడిగిస్తూ పోవడమో చేశారు. ఫలితంగా చిరునామాలు కనుక్కోవడం పరీక్షగా మారింది. ప్రజలకు ఈ అవస్థలు తప్పించేందుకు... సులభంగా చిరునామాలు తెలుసుకునేందుకు వీలుగా పద్ధతి ప్రకారం ఉండేలా కొత్త ఇంటి నెంబర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ.. ముందుకు సాగడం లేదు. ప్రత్యేక విభాగం ఇళ్లు, రోడ్లు, వీధుల పేర్లు, నెంబర్లకోసం జీహెచ్ఎంసీలో ఒక విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డెరైక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఇది పని చేస్తుంది. గతంలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నయ్ నగరాల్లోని ఇంటినంబర్ల విధానాన్ని పరిశీలించి.. సులభంగా ఉండేలా లొకాలిటీల (ప్రాంతాలు) విధానంతో ఇంటి నెంబర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు నిబంధనలు రూపొందించారు. ఏళ్లకేళ్లు గడుస్తున్నాయే తప్ప ప్రజలు సులభంగా ఇంటి చిరునామా కనుక్కునే అవకాశం మాత్రం కలుగలేదు. కొత్త పద్ధతి ఇలా.. కొత్త ఇంటి నెంబర్ల విధానానికి నగరాన్ని ‘లొకాలిటీ’లు.. ప్రధాన రహదారులుగా విభజించారు. బాగా వాడుకలో ఉన్న ప్రాంతాల పేర్లనే ‘లొకాలిటీ’లకు వినియోగించాలని నిర్ణయించారు. వీటిలో వీధి నెంబర్లు .. ఇంటి నెంబర్లను నిర్ణయించారు. నిర్మాణ అనుమతులు ఉన్నదీ లేనిదీ... సంబంధం లేకుండా అన్ని ఇళ్లకూ.. ఖాలీ స్థలాలుంటే ఆవరణలకు (ప్రెమిసెస్) సైతం నెంబర్లు ఇవ్వాలని యోచించారు. అపార్టుమెంట్లు, వాణిజ్య కాంప్లెక్సుల్లో ఆవరణ నెంబర్/ఇంటి నెంబరు రెండూ కేటాయించే ప్రయత్నం చేశారు. తద్వారా చిరునామా కనుక్కోవడం సులభమవుతుందని భావించారు. కొత్త విధానంలో వీధి ప్రారంభంలోనే ఆ ప్రాంతంలోని ఇంటి నెంబర్లను సూచిస్తూ సైన్‌బోర్డులు ఉంటాయి. ప్రాంతం (లొకాలిటీ) పేరు, వీధి నెంబరు, అక్కడ ఎన్ని ఇళ్లు ఉన్నాయో వివరాలు ఉంటాయి. ఇంటి నెంబరు ప్లేటుపై లొకాలిటీ (ఉదా: బాగ్ లింగంపల్లి ), వీధి నెంబరు (ఉదా: 3), ఇంటి నెంబరు (ఉదా:15) ఉంటాయి. ఇదంతా ఒకటి, రెండు చోట్ల ప్రయోగాలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వంలోనైనా సమస్య తీరేనా? నాలుగేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇళ్ల నెంబర్ల కార్యక్రమాన్ని అప్పటి మున్సిపల్ మంత్రి మహీధర్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి ప్రభుత్వంతో పాటు రాష్ట్రం కూడా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నగరానికి సంబంధించిన వివిధ అంశాలపై దృష్టి సారించినప్పటికీ... ఇంటి నెంబర్లపై మాత్రం ఇంతవరకూ శ్రద్ధ చూపలేదు. దాంతో పరిస్థితిలో మార్పులేకుండాపోయింది. కాంట్రాక్ట్ ఇచ్చినా... జీహెచ్ఎంసీ సిబ్బందితో పని కాకపోవడంతో కాప్రా, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కూకట్పల్లి సర్కిళ్ల బాధ్యతలను కాంట్రాక్టుకు ఇచ్చారు. అయినా అదే పరిస్థితి. శివార్లలో కాప్రా, మల్కాజిగిరి సర్కిళ్లలో సర్వే పూర్తయింది. ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి సర్కిళ్లలో లొకాలిటీ ప్రణాళికల పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే ప్రణాళికబద్ధ నగరమైన చండీగఢ్‌లా ఉంటుందని భావిస్తున్నారు. కానీ.. ఎప్పటికో మరి.. ?! టెండర్లకు సిద్ధం? శివార్లలోని శేరిలింగంపల్లి-1, శేరిలింగంపల్లి-2, పటాన్చెరు-ఆర్సీపురం, కుత్బుల్లాపూర్, అల్వాల్సర్కిళ్లలో సర్వే లొకాలిటీ ప్రణాళిక పనులను కాంట్రాక్టు ఏజెన్సీలకు ఇచ్చారు. ప్రణాళికలు ఇంకా పూర్తి కాలేదు. కోర్ ఏరియాలోని ఖైరతాబాద్, మెహదీపట్నం (సర్కిల్7) సర్కిళ్ల సర్వే సైతం కాంట్రాక్టుకు ఇవ్వాలని యోచిస్తున్నారు. సిబ్బంది కొరత జీహెచ్ఎంసీలో తగినంతమంది సర్వేయర్లు, ఇతర సిబ్బంది లేరు. దాంతో పనులు పూర్తి కాలేదు. రెండు సర్కిళ్లలో(సర్కిల్-9, సర్కిల్-8) మాత్రం ఇంటి నెంబర్ ప్లేట్లు బిగించారు. నాలుగు, ఐదు సర్కిళ్లలో సర్వే పూర్తయింది. -
నీటి కోసం కోటి కష్టాలు
అన్నదాతల అరణ్య రోదన నోళ్లు తెరచిన పంట పొలాలు పైరు కాపాడుకునేందుకు అవస్థలు ఆయిల్ ఇంజిన్లు, పైపులకు పెరిగిన డిమాండ్ బోర్లు, బావుల తవ్వకంలో రైతు తలమునకలు రేయింబవళ్లు కాలువలపైనే రైతుల జాగారం కూటి కోసం కోటి విద్యలన్నారు పెద్దలు. ఇప్పుడు సాగునీటి కోసమూ రైతన్నలకు అవస్థలు తప్పడం లేదు. నోళ్లు తెరచినట్టు నెర్రెలిచ్చిన పంట పొలాల దప్పిక తీర్చేందుకు, ఎండుముఖం పట్టిన పైరుకు జీవం పోసేందుకు అన్నదాత చేయని ప్రయత్నం లేదు. అరకొరగా కురిసిన వర్షాలకు నాట్లు వేసుకున్న రైతులు ఆ పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. చినుకు జాడ లేక.. మెట్ట పైర్లు సైతం ఎండుముఖం పట్టాయి.. పంట కాపాడుకునేందుకు అన్నదాతలు ప్రత్యామ్నాయ మార్గాలు అణ్వేషిస్తున్నారు. అప్పులు చేసి మరీ ఆ దిశగా అడుగులేస్తున్నారు. బోర్లు, బావులు తవ్విస్తున్నారు. ఆయిల్ ఇంజిన్లు, పైపులు అద్దెకు తెచ్చుకుని కొందరు, కొనుగోలు చేసి మరికొందరు కాల్వలు, కుంటల్లో అడుగంటిన నీటిని పొలానికి మళ్లించేందుకు ప్రయాసపడుతున్నారు. - సాక్షి నెట్వర్క -
సుగర్ పెరుగుతోంది..
వ్యాట్ పోటుతో కొనుగోళ్ల స్తంభన గణనీయంగా పడిపోయిన ధర గోదాముల్లో భారీగా పంచదార నిల్వలు సహకార చక్కెర కర్మాగారాలు నష్టాలతో అవస్థలు పడుతున్నాయి. టన్నుల కొద్దీ పేరుకుపోయిన పంచదార నిల్వలు భారంగా మారాయి. వాటిని వదిలించుకునే మార్గం లేక జిల్లాలోని సుగర్ ఫ్యాక్టరీలు సతమతమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మోపిన వ్యాట్, ఎగుమతి సుంకాలు పంచదార కొనుగోళ్లకు గుదిబండగా మారాయి. విశాఖపట్నం: యూపీఏ ప్రభుత్వంలో అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు క్వింటాలు పంచదార ధర రూ.3 వేలకు పైనే ఉండేది. పంచదార ఉత్పత్తి వ్యయం రూ.3 వేలవుతోంది. ఇతర ఆదాయ వనరులతో సుగర్ ఫ్యాక్టరీలు ఆర్థికంగా లాభపడ్డాయి. కానీ ఏడాది నుంచి పరిస్థితి తారుమారయ్యింది. క్వింటాలు పంచదార రూ.2200లకు పడిపోయింది. ఇప్పుడది మరింతగా దిగజారి రూ.2050లు పలుకుతోంది. అంటే ఏడాది క్రితంతో పోల్చుకుంటే క్వింటాలు వద్ద రూ.వెయ్యి చొప్పున జిల్లాలోని నాలుగు చక్కెర కర్మాగారాలకు రూ.80 కోట్ల నష్టం వాటిల్లుతోందన్న మాట! దీంతో రైతులకు నెలల తరబడి బకాయిలు తీర్చలేని పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి కర్మాగారం యాజమాన్యాలు తమ వద్ద ఉన్న పంచదార నిల్వలపై అప్పు తెచ్చి రైతుల బకాయిలు చెల్లిస్తుంటాయి. పంచదార అమ్మకం జరిగాక అప్పులు తీరుస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం నిల్వలు అమ్ముదామంటే కొనేవారే కరువయ్యారు. జిల్లాలోని గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో 4.65 లక్షల క్వింటాళ్లు, ఏటికొప్పాకలో 1.40 లక్షలు, తాండవలో 1.60 లక్షలు, తుంపాలలో 20 వేల క్వింటాళ్ల వెరసి దాదాపు ఎనిమిది లక్షల క్వింటాళ్ల పంచదార నిల్వలున్నాయి. ఎందుకిలా? రాష్ట్ర ప్రభుత్వం పంచదార కొనుగోళ్లపై వ్యాట్, కొత్తగా ఎగుమతి సుంకాలను విధిస్తోంది. దీంతో క్వింటాలుపై వ్యాట్ చార్జి కింద రూ.150లు, ఎగుమతి సుంకం కింద రూ.60-70లు చొప్పున కొనుగోలుదారుడు ప్రభుత్వానికి అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పొరుగున ఉన్న కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఈ బాదుడు లేదు. దీంతో బడా వర్తకులు మన పంచదారను కాదని ఆయా రాష్ట్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. స్థానికంగా కొనుగోలు చేసే వారు కూడా తక్కువ ధరకే దొరికే పొరుగు రాష్ట్రాల పంచదార వైపే ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా జిల్లాలోని ఫ్యాక్టరీల్లో నిల్వలు కొండల్లా పేరుకుపోతున్నాయి. చక్కెర కర్మాగారాలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో చాలా సుగర్ ఫ్యాక్టరీలు నష్టాల్లో చిక్కుకుని మూతపడ్డాయి. మరికొన్ని ఆ దిశగా పయనిస్తున్నాయి. ఎప్పుడూ లాభాల్లో నడిచే గోవాడ ఫ్యాక్టరీ కూడా ఆర్థిక సంక్షోభంలో పడింది. మరోవైపు రైతులకు గత సీజను బకాయిలతో పాటు రాయితీపై ఇచ్చే ఎరువులను కూడా కర్మాగారాలు రైతులకు అందించలేక పోతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజనులో పెట్టుబడులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం చెరకు రైతులకు రూ.6 వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ సొమ్మును రైతుల ఖాతాల్లో నేరుగా వేయనుంది. ఇది కొంతవరకు రైతులకు ఊరటినిచ్చే అంశం. ప్రభుత్వం ఆదుకోవాలి.. సంక్షోభంలో ఉన్న చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం ఆదుకోవాలి. చక్కె ర ధర పెంచాలి. మార్కెట్ ధరను స్థిరీకరించాలి. క్వింటాలుకు కనీసం రూ.3 వేలు చేయాలి. వ్యాట్ రద్దు చేస్తే కొనుగోలుదార్లు ముందుకొస్తారు. దాంతో నిల్వలు క్లియర్ అవుతాయి. లేదంటే సుగర్ ఫ్యాక్టరీల మనుగడకు ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఆర్థిక సాయం అందించాలి. -వి.వి.రమణారావు, ఎమ్.డి., గోవాడ సుగర్స్. -
సామాన్య భక్తుల అవస్థలు
తిరుమల: రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమలలో భక్తులు అవస్థలు పడ్డారు. రాంబగీచా వద్ద ఉదయం 11 గంటలకే కట్టడి చేశారు. దీంతో అటు ఇటు వెళ్లలేక వందలాది మంది భక్తులు ఒకే చోటకిక్కిరిసిపోయారు. మధ్యాహ్నం 3గంటలకు రాష్ర్టపతి తిరుగుప్రయాణం అవగానే వదిలారు. దీంతో భక్తులు ఒక్కసారిగా కిందా మీదా పడిలేచి అవస్థ పడ్డారు. అలాగే ఆలయప్రాంతంలోకి భక్తులను అనుమతించకపోవటంతో అఖిలాండం మెట్లపైనే భక్తులు నిరీక్షించారు. ఎండదాటిగా భక్తులు ఇబ్బంది పడ్డారు. అంగప్రదక్షిణం టికెట్ల కోసం తోపులాట తిరుమలలో బుధవారం అంగప్రదక్షిణం టికెట్ల కోసం భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఇక్కడి విజయాబ్యాంకు ద్వా రా రోజూ బయోమెట్రిక్ పద్ధతిలో 750 టికెట్లు ఇస్తారు. ఇందుకోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాష్ట్రప తి పర్యటన సందర్భంగా భద్రతా విధు ల్లో ఎక్కువ మంది సిబ్బంది లేరు. దీనివ ల్ల భక్తుల మధ్యతోపులాట జరిగింది. -
అవస్థల కేంద్రాలు
అంగన్వాడీ కేంద్రాలు అవస్థలకు ఆవాసాలుగా వర్థిల్లుతున్నాయి. తిండిపెట్టేవి అన్న వాదన అతిశయోక్తి కాదు. అదీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. జిల్లావ్యాప్తంగా 25 సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టుల పరిధిలో 3587 ప్రధాన, 1365 మినీ అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. శిథిలావస్థలో భవనాలు.. కార్యకర్తలు, ఆయాలకు చాలీచాలని జీతాలు. ఓటరు నమోదు బాధ్యతలు అప్పగించి వారితో వెట్టిచాకిరీ...నిత్యావసరాలకు నోచుకోని కిశోరబాలికలు..ప్రతి నెలా సక్రమంగా అందని పౌష్టికాహారం. ఇలా అన్నింటా సమస్యలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఈ కేంద్రాల పరిస్థితిని పరిశీలించడానికి సోమవారం విజిట్‌కు వెళ్లిన ‘సాక్షి’కి కఠిన వాస్తవాలెన్నో కనిపించాయి. వెంకోజీపాలెం(విశాఖపట్నం): జిల్లా మహిళా,శిశు అభివద్ధిసంస్థ ఆధ్వర్యంలోని అంగన్వాడీ కేంద్రాలు అవస్థలతో అల్లాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 25 సమగ్ర శిశు అభివద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టుల పరిధిలో 3587 ప్రధాన, 1365 మినీ అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలకు సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలలో ఇందిరమ్మ అమతహస్తం పథకం కింద లబ్ధిదారులకు మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలుజరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ భోజనాలలో నాణ్యత నామమాత్రం. ముఖ్యంగా పాడేరు నియోజకవర్గంలో భోజనాలకు బదులుగా టేక్‌హోమ్ రేషన్ కింద పాతవిధానంలోనే సరకులు అందజేసి చేతులు దులుపుకుంటున్నారు. పలుకేంద్రాలకు 15 రోజులుగా గుడ్లు సరఫరా కాలేదు. పలు కేంద్రాల భవనాలు శిథిలావస్థలో ఉండడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. యలమంచిలి పరిధిలో మధ్యాహ్న భోజనాల తరువాత కేంద్రాలు మూతపడుతున్నాయి. కార్యకర్తలకు అదనపు విధుల భారంతో ఆయాలే వాటిని చూసుకోవాల్సి వస్తోంది. నర్సీపట్నం పరిధిలో రోజూ పిల్లల హాజరు తక్కువగానే ఉంటోంది. అద్దెభవనాలలో పారిశుధ్యం అధ్వానంగా ఉంటోంది. జిల్లాలోని సిబ్బంది చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు. దీనికితోడు ఓటర్లనమోదు, పల్స్‌పోలియో, బోదకాలు నివారణ మాత్రల పంపిణీ వంటి అదనపు బాధ్యతలు తడిసిమోపెడవుతున్నాయి. దీంతో కార్యకర్తలు అంకితభావంతో పనిచేయలేని పరిస్థితి నెలకొంది. పని ఒత్తిడి కారణంగా కార్యకర్తలు రోజూ సక్రమంగా పిల్లలకు పాఠాలు బోధించలేకపోతున్నారు. జిల్లాలో 389 కార్యకర్త,ఆయా పోస్టులు ఖాళీగా ఉండడంతో కొన్ని సింగిల్హ్యాండ్తోనే నిర్వహిస్తున్నారు. ఇలా ఇవి చాలావరకు తిండిపెట్టే కేంద్రాలుగానే వర్థిల్లుతున్నాయనడంలో అతిశయోక్తి కాదు. పలు గ్రామీణ నియోజకవర్గాల పరిధిలో కార్యకర్తలే ఆహార దినుసుల రవాణా ఖర్చులు భరించాల్సి రావడంతో తూకంలో యథేచ్ఛగా అవకవకలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం విద్యుత్ బిల్లులకు నిధులివ్వకపోవడంతో కార్యకర్తల చేతిచమురు వదులుతోంది.గ్రామీణ అంగన్వాడీలలో పరిశుభ్రత గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. -
రైళ్లన్నీ లేటే!
ఉసూరన్న ప్రయాణి కులు శివారు స్టేషన్లలోరైళ్లు దిగి ఇక్కట్లు పట్టాలు తప్పిన రైలింజన్ 3 గంటల పాటు స్తంభించిన రైళ్లు వరుసగా మూడు రోజుల సెలవులు ముగిసి పోయాయి. సోమవారం నాటికి గమ్యస్థానాలకు చేరాలన్న ఆత్రుతతో ఆదివారం ప్రయాణికులంతా రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. ప్లాట్ఫారాలన్నీ కిటకిటలాడాయి. విశాఖ స్టేషన్లో షంటింగ్ చేసే రైలింజన్ పట్టాలు తప్పటంతో విశాఖ నుంచి తుని వరకు అన్ని స్టేషన్లలో బళ్లన్నీ మూడు గంటలకు పైగా నిలిచిపోయాయి. ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. విశాఖపట్నం: విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు బయల్దేరాల్సిన కేప్-హౌరా ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం నుంచి కదిలినట్టే కదిలి ఆగిపోయింది. అంతకు ముందు పావు గంట నుంచి మరికొద్దిసేపట్లో ఈ రైలు బయల్దేరబోతోందంటూ అనౌన్స్ చేశారు. ఆ ఒక్క రైలే కాదు. 12.05 గంటల నుంచీ ఏ ఒక్క రైలు కూడా కదల్లేదు. అదే వేళకు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం మీదకు చేరుకుంటుందంటూ ప్రకటించిన విజయవాడ-విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ కోసం వందలాది మంది ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకూ పెళ్లిళ్ల హడావిడితో కిక్కిరిసిపోయిన ఈ రైల్లో సీటు సంగతి ఎలా ఉన్నా నిలబడేందుకైనా కాసింత చోటుంటుందేమోనని ఎదురు చూసే వారంతా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ కోసం నిరీక్షిస్తున్నారు. కానీ 12.30 దాటినా ఆ రైలు రాలేదు. అదిగో వస్తుంది..ఇదిగో వస్తుందంటూ గంట చూశారు. 12 గంటలకు రావాల్సిన ఈ రైలు మధ్యాహ్నం 2.55 గంటలకు వచ్చింది. తిరిగి 3.35 గంటలకు బయల్దేరింది. ఈ ఒక్క రైలే కాదు. దాదాపు అన్ని రైళ్ల పరిస్థితీ అంతే. దీంతో గంటల తరబడి విశాఖ స్టేషన్లో ప్రయాణికులు నిరీక్షించారు. ఉసూరుమంటూ ఎక్కడి వారు అక్కడే చతికిలబడ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లన్నీ శివారు స్టేషన్లలో ఆగిపోతుంటే అక్కడే ప్రయాణికులు దిగేసి వెళ్లిపోయారు. కానీ విశాఖ స్టేషన్లో ఉన్న ప్రయాణికులు మాత్రం గంటల తరబడి నిరీక్షించక తప్పలేదు. రైళ్ల ఆలస్యంతో దూర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు మాత్రం రిజర్వేషన్లను రద్దు చేసుకున్నారు. విశాఖకు చేరుకునే రైళ్లతో బాటు ఇక్కడ నుంచి బయల్దేరే రైళ్లన్నీ మూడు గంటలు ఆలస్యంగా ఉన్నాయి. ర త్నాచల్, ప్రశాంతి, బొకారో, హౌరా మెయిల్, మద్రాస్ మెయిల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, గోదావరి, విశాఖ, వంటి రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఘోర ప్రమాదం తప్పిందిలా! విశాఖ స్టేషన్లో షంటింగ్ చేసే రైలింజన్ (డీజిల్) పట్టాలు తప్పింది. ప్రయాణికులతో వెళ్లే రైలు పట్టాలు తప్పితే ఘోర ప్రమాదం జరిగేది. విశాఖ స్టేషన్ నుంచి యార్డుకు వెళ్లే పాయింట్ వద్ద పట్టాలు త ప్పింది. దీనిని సర్దుబాటు చేసేందుకు బోలెడంత సమయం పట్టేదని రైల్వే వర్గాలు తెలిపాయి. విశాఖ స్టేషన్లో ఇంజన్లను మార్పు చేయడం, అదనపు బోగీలను యార్డు నుంచి తీసుకొచ్చి రైళ్లకు జోడించడం వంటి పనులను పట్టాలు తప్పిన ఈ ఇంజన్ చేస్తుంటుంది. దాదాపు ఎనిమిది ప్లాట్‌ఫారాలపై షంటింగ్ చేయడం ఈ ఇంజన్ ప్రత్యేకత. దీంట్లో డీజిల్ అయిపోతుందని గుర్తించి ట్యాంకు నింపుకునేందుకు యార్డుకు వెళుతూ సరిగ్గా ప్రధాన లైన్ నుంచి యార్డు మార్గానికి మలుపు తిరిగే పాయింట్ వద్ద పట్టాలు తప్పింది. ట్రాక్ ఓ వైపు విరిగిపోయి ఇంజన్‌కు ముందు వున్న రెండు వైపులా చక్రాలు భూమిలో కూరుకుపోయాయి. సంఘటన విషయం తెలిసిన వెంటనే డీఆర్ఎం అనిల్‌కుమార్‌తో బాటు ఇంజినీరింగ్ అధికారులంతా సంఘటన స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి మూడు గంటల్లోనే రైళ్లు పరుగులు పెట్టేలా చర్యలు తీసుకున్నారు. -
పింఛన్‌దారుల అవస్థలు
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :జిల్లాలోని మున్సిపాలిటీల్లో పింఛన్ల పంపిణీ ప్రహసనంగా మారింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఐదో తేదీ వరకు పంపిణీ కావాల్సి ఉండగా ఇప్పటివరకు 55 శాతం మాత్రమే పంపిణీ చేశారు. దీంతో పంపిణీ కేంద్రాల వద్ద పింఛన్‌దారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కొక్కరు ఐదారు రోజులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు అవస్థలు పడుతున్నారు. పండుగ పూట తొందరగా డబ్బులు వస్తే ఆసరా ఉంటాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. అధికారుల నిర్లక్ష్యంతో దసరా పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పింఛన్‌దారులు పేర్కొంటున్నారు. కాగా, మున్సిపాలిటీ సిబ్బంది పింఛన్ డబ్బులను వార్డుల్లో పంపిణీ చేసేవారు. ప్రతినెలా ఐదో తారీఖు వరకు ఒక్కో వార్డులో ఒక్కో సిబ్బంది వెళ్లి పంపిణీ సజావుగా చేసేవారు. సిబ్బందికి భారం పడుతుందని, బోగస్ పింఛన్‌దారులను ఏరివేయాలని ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు మేలో అప్పగించింది. ఈ సంస్థ నిర్వాహకులు స్మార్ట కార్డు అందజేసి, వేలి ముద్రలు తీసుకుని వాటి ఆధారంగానే పింఛన్ పంపిణీ మొదలెట్టారు. కానీ సిబ్బంది తక్కువగా ఉండటం, సాంకేతిక సమస్యలతో పింఛన్ అందడం లేదు. పంపిణీ 55 శాతమే.. మంచిర్యాల పురపాలక సంఘంలో 5వేల పైచిలుకు పింఛన్‌దారులు ఉండగా రూ. 17 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే రూ. 9 లక్షలు మాత్రమే పంపిణీ చేశా రు. కాగజ్‌నగర్ పురపాలక సంఘంలో 4 వేల పైచిలుకు లబ్ధిదారులు ఉండగా రూ. 12.50 లక్షలు పంపిణీ చేయాల్సి ఉండగా రూ.6లక్షలు పంచారు. బెల్లంపల్లిలో 4 వేల మంది లబ్ధిదారులకు రూ.11.50 లక్షలు పంచాల్సి ఉండగా రూ.7 లక్షలు, మందమర్రిలో 3,800 మందికి రూ.11.50 లక్షలు పంచాల్సి ఉండగా రూ. 6.50 లక్షలు పంపిణీ చేశారు. అలాగే ఆదిలాబాద్ పురపాలక సంఘంలో సుమారు 6 వేల మంది పింఛన్‌దారులు ఉండగా రూ.17 లక్షలలో రూ.10.50 లక్షలు, నిర్మల్‌లో 7వేల మంది పింఛన్‌దారులు ఉండగా రూ.20 లక్షలకు రూ.12 లక్షలు పంపిణీ చేశారు. భైంసాలో 4 వేల మంది పింఛన్‌దారులకు రూ.8లక్షలు పంచాల్సి ఉండగా రూ.5లక్షలు పంపి ణీ చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా గణాంకాలు పరిశీలిస్తే 55 శాతం మందికి మాత్రమే పింఛన్ అందినట్లు స్పష్టమవుతోంది. కాగా, కాంట్రాక్ట సంస్థ మేనేజర్ అమ్జద్‌ఖాన్‌ను అడుగగా 18వ తేదీలో పింఛన్లు మొత్తం పంపిణీ చేస్తామని తెలిపారు. పింఛన్ కోసం వచ్చి వృద్ధురాలు మృతి కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : కాగజ్‌నగర్ రైల్వేస్టే„షన్లో పింఛన్ కోసం వచ్చి వృద్ధురాలు మృతిచెందిన సంఘటన శుక్రవారం వేకువజామున చోటు చేసుకుంది. జీఆర్పీ ఇన్చార్జి రశీ ద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్ ప ట్టణానికి చెందిన కోట గాలమ్మ కుటుంబం ప్ర స్తుతం దండేపల్లి మండలం తాళ్లపేటలో ఉం టోంది. గాలమ్మ ప్రతినెలా కాగజ్‌నగర్‌కు వ చ్చి వృద్ధాప్య పింఛన్ తీసుకుంటోంది. ఈనెల పింఛన్ తీసుకోవడానికి గురువా రం కాగజ్‌నగర్‌కు వచ్చింది. పింఛన్ తీసుకున్న అనంతరం బంధువుల ఇంటికి వెళ్లింది. సాయంత్రం భాగ్యనగర్ ఎక్సప్రెస్లో వెళ్లేందుకు సిద్ధమైంది. రైలు వెళ్లిపోవడంతో రాత్రి కాగజ్‌నగర్ రైల్వేస్టే„షన్లో నిద్రించింది. శుక్రవారం వేకువజామున రైల్వే సిబ్బంది లేపగా మృతిచెంది ఉంది. స్టేషన్‌మాస్టర్ మల్లయ్య ఫిర్యా దు మేరకు జీఆర్పీ బెల్లంపల్లి ఔట్‌పోస్టు ఇన్చార్జి నందగోపాల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యంతో మృతిచెంది ఉంటుందని సిబ్బంది తెలిపారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా.. నా పేరు రాజుబాయి. మాది నిర్మల్ మండలం పింజారిగుట్ట. ప్రభుత్వం ఇచ్చే రూ.200 పింఛన్ డబ్బుల కోసం నాలుగు రోజులుగా తిరుగుతున్నా. రోజూ ఆటోలో వస్తున్నా. రావడానికి పోవడానికే ఇప్పటివరకు రూ.50 ఖర్చయ్యాయి. తిండి తిప్పలు ఉండటం లేదు. ఇక్కడ వసతులు లేక అవస్థలు పడుతున్నాము. ఇప్పటివరకు పింఛన్ తీసుకోలేదు. అరిగోస పెడుతున్నారు.. పింఛన్ల కోసం అరిగోస పెడుతున్నారు. ప్రతినెలా పింఛన్ కోసం తండ్లాడుతున్నాను. ఎప్పుడిస్తారనేది దేవునికే తెలియాలి. మేము మాత్రం నడవరాకున్నా అష్ట కష్టాలు పడి పింఛన్లు ఇచ్చే చోటుకు వెళ్తాము. గంటల తరబడి నిరీక్షించిన తర్వాత రేపు రండి అంటూ ఇంటికి పంపిస్తారు. కనీసం పండుగ పూట అయినా ముందుగా ఇస్తే సంతోషించే వాళ్లం. - సత్యనారాయణ, పింఛన్‌దారుడు, హమాలీవాడ, మంచిర్యాల