సామాన్య భక్తుల అవస్థలు
తిరుమల: రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమలలో భక్తులు అవస్థలు పడ్డారు. రాంబగీచా వద్ద ఉదయం 11 గంటలకే కట్టడి చేశారు. దీంతో అటు ఇటు వెళ్లలేక వందలాది మంది భక్తులు ఒకే చోటకిక్కిరిసిపోయారు. మధ్యాహ్నం 3గంటలకు రాష్ర్టపతి తిరుగుప్రయాణం అవగానే వదిలారు. దీంతో భక్తులు ఒక్కసారిగా కిందా మీదా పడిలేచి అవస్థ పడ్డారు. అలాగే ఆలయప్రాంతంలోకి భక్తులను అనుమతించకపోవటంతో అఖిలాండం మెట్లపైనే భక్తులు నిరీక్షించారు. ఎండదాటిగా భక్తులు ఇబ్బంది పడ్డారు.
అంగప్రదక్షిణం టికెట్ల కోసం తోపులాట
తిరుమలలో బుధవారం అంగప్రదక్షిణం టికెట్ల కోసం భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఇక్కడి విజయాబ్యాంకు ద్వా రా రోజూ బయోమెట్రిక్ పద్ధతిలో 750 టికెట్లు ఇస్తారు. ఇందుకోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాష్ట్రప తి పర్యటన సందర్భంగా భద్రతా విధు ల్లో ఎక్కువ మంది సిబ్బంది లేరు. దీనివ ల్ల భక్తుల మధ్యతోపులాట జరిగింది.