రిక్త‘హస్తమే’! | To the extreme edge of pensions | Sakshi
Sakshi News home page

రిక్త‘హస్తమే’!

Published Wed, Jan 25 2017 10:17 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

రిక్త‘హస్తమే’!

రిక్త‘హస్తమే’!

నిజాంసాగర్‌: అభయహస్తం పింఛన్లు రాక అవ్వలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కళ్లల్లో వొత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. స్వయం సహాయక సం ఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు వృద్ధాప్యం పొందిన తర్వాత ‘ఆసరా’ కోసం 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద రోజుకు రుపాయి చొప్పున ఏడాదికి రూ.365 చొప్పున మహిళలు చెల్లించారు. అభయహస్తంలో చేరిన మహిళలకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.500 చొప్పున పింఛన్‌ వచ్చేలా ఈ పథకాన్ని రూపొం దించారు. అప్పటి నుంచి ప్రతి నెలా డబ్బులు పొందిన వృద్ధులకు కొన్ని నెల ల నుంచి మాత్రం అందడం లేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచడంతో పాటు, ప్రతి నెలా ఇస్తోంది. అదే అభియహస్తం పింఛన్‌దారులకు మాత్రం మొండిచేయి చూపుతోంది.

ఆసరా కరువు..!
స్వయం సహాయక సంఘాల మహిళలకు అభయహస్తం డబ్బులు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న డబ్బులను కూడా మంజూరు చేస్తున్నట్ల ప్రకటించి, నిధులు విడుదల చేశారు. నిధులు విడుదలై 20 రోజులు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరలేదు. సీఎం ప్రకటనతో హర్షం వ్యక్తం చేసిన అవ్వలు.. ఇంకా డబ్బు చేతికందకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

డబ్బుల కోసం ఎదురుచూపు..
ఈ పథకం కింద కామారెడ్డి జిల్లాలో 3,479 మంది మహిళలకు గాను రూ.1.56 కోట్లను మంజూరు చేశారు. కొన్ని నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న డబ్బులను ఆయా మండలాల కార్యాలయాల ఖాతాల్లో జమచేశారు. పింఛన్‌ డబ్బులు వచ్చి 20 రోజులు కావస్తున్నా లబ్ధిదారులకు మాత్రం అందలేదు. అభయహస్తం పింఛన్‌ డబ్బుల కోసం మహిళలు ఐకేపీ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో లబ్దిదారుకు రూ.4,500 నుంచి రూ.6 వేల వరకు రావాల్సి ఉంది. ఆయా గ్రామాల వారీగా ఉన్న అభయహస్తం పింఛన్‌దారులకు సంబంధించిన నిధులు వచ్చినా అధికారులు డబ్బుల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఖాతాలకు చేరని డబ్బులు
ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసినా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, బిచ్కుం ద, జుక్కల్‌ మండలాల్లో అభయహస్తం పథకం కింద 2,442 మంది లబ్ధిదారులున్నారు. ఆయా మండలాల్లోని లబ్ధిదారులకు అభయహస్తం పింఛన్లు అందకపోవడంతో లబ్ధిదారులు డబ్బుల కోసం నిరీక్షిస్తున్నారు. గతంలో లబ్ధిదారులకు బయోమెట్రిక్‌ ద్వారా అందించారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో నేరుగా అందించాల్సి ఉన్నా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల కోసం అధికారులు తాత్సారం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement