
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో గురువారం జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 5 గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అందులో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుంచి 10 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్‌టీ టవర్ నిర్మించాలని నిర్ణయించారు. అలాగే, కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికి 10 మంది వైద్యులను నియమిస్తున్నట్టు తెలిపారు. సరోజినీ దేవీ కంటి ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు ఇచ్చారు. వికారాబాద్‌లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం కేటాయించినట్టు స్పష్టం చేశారు.
తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల స్థలం కేటాయింపు. షాబాద్ బండల పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటుకు 45 ఎకరాల స్థలం కేటాయింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే, జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లో నివేదిక ఇచ్చి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: అక్కడ ముక్కోణపు పోటీ అనివార్యం
Comments
Please login to add a commentAdd a comment