సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నాలుగో తేదీన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుందని తెలిపారు. కొత్త సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుందని తెలిపారు.
అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపుపై ధీమాతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడంపై ఇది అత్యాశ లేక అతి నమ్మకమా? అని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్ని రోజులు సచివాలయం వైపు కూడా చూడని కేసీఆర్.. ఎన్నికల ఫలితాలు రాకముందే సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయడమేంటని సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు.. ఈరోజు(శుక్రవారం) ప్రగతిభవన్‌లో కేసీఆర్.. బీఆర్‌ఎస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని వారితో చెప్పినట్టు సమాచారం. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. దీంతో, రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment