'38 లక్షల పెన్షన్లు ఇస్తున్న ఘనత మాది'
వరంగల్: వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పట్టణంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో వచ్చిన 4 లక్షల మెజార్టీ తగ్గించడం కోసమే విపక్షాలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఆయన విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. 38 లక్షల మంది పేద ప్రజలకు పెన్షన్లు ఇస్తున్న ఘనత మా ప్రభుత్వానిదేనని కేటీఆర్ పేర్కొన్నారు.