కూటి కోసం కోటి విద్యలన్నారు పెద్దలు. ఇప్పుడు సాగునీటి కోసమూ రైతన్నలకు అవస్థలు తప్పడం లేదు.
అన్నదాతల అరణ్య రోదన
నోళ్లు తెరచిన పంట పొలాలు
పైరు కాపాడుకునేందుకు అవస్థలు
ఆయిల్ ఇంజిన్లు, పైపులకు పెరిగిన డిమాండ్
బోర్లు, బావుల తవ్వకంలో రైతు తలమునకలు
రేయింబవళ్లు కాలువలపైనే రైతుల జాగారం
కూటి కోసం కోటి విద్యలన్నారు పెద్దలు. ఇప్పుడు సాగునీటి కోసమూ రైతన్నలకు అవస్థలు తప్పడం లేదు. నోళ్లు తెరచినట్టు నెర్రెలిచ్చిన పంట పొలాల దప్పిక తీర్చేందుకు, ఎండుముఖం పట్టిన పైరుకు జీవం పోసేందుకు అన్నదాత చేయని ప్రయత్నం లేదు. అరకొరగా కురిసిన వర్షాలకు నాట్లు వేసుకున్న రైతులు ఆ పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
చినుకు జాడ లేక.. మెట్ట పైర్లు సైతం ఎండుముఖం పట్టాయి.. పంట కాపాడుకునేందుకు అన్నదాతలు ప్రత్యామ్నాయ మార్గాలు అణ్వేషిస్తున్నారు. అప్పులు చేసి మరీ ఆ దిశగా అడుగులేస్తున్నారు. బోర్లు, బావులు తవ్విస్తున్నారు. ఆయిల్ ఇంజిన్లు, పైపులు అద్దెకు తెచ్చుకుని కొందరు, కొనుగోలు చేసి మరికొందరు కాల్వలు, కుంటల్లో అడుగంటిన నీటిని పొలానికి మళ్లించేందుకు ప్రయాసపడుతున్నారు.
- సాక్షి నెట్‌వర్‌క