oil engines
-
నీటి కోసం కోటి కష్టాలు
అన్నదాతల అరణ్య రోదన నోళ్లు తెరచిన పంట పొలాలు పైరు కాపాడుకునేందుకు అవస్థలు ఆయిల్ ఇంజిన్లు, పైపులకు పెరిగిన డిమాండ్ బోర్లు, బావుల తవ్వకంలో రైతు తలమునకలు రేయింబవళ్లు కాలువలపైనే రైతుల జాగారం కూటి కోసం కోటి విద్యలన్నారు పెద్దలు. ఇప్పుడు సాగునీటి కోసమూ రైతన్నలకు అవస్థలు తప్పడం లేదు. నోళ్లు తెరచినట్టు నెర్రెలిచ్చిన పంట పొలాల దప్పిక తీర్చేందుకు, ఎండుముఖం పట్టిన పైరుకు జీవం పోసేందుకు అన్నదాత చేయని ప్రయత్నం లేదు. అరకొరగా కురిసిన వర్షాలకు నాట్లు వేసుకున్న రైతులు ఆ పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. చినుకు జాడ లేక.. మెట్ట పైర్లు సైతం ఎండుముఖం పట్టాయి.. పంట కాపాడుకునేందుకు అన్నదాతలు ప్రత్యామ్నాయ మార్గాలు అణ్వేషిస్తున్నారు. అప్పులు చేసి మరీ ఆ దిశగా అడుగులేస్తున్నారు. బోర్లు, బావులు తవ్విస్తున్నారు. ఆయిల్ ఇంజిన్లు, పైపులు అద్దెకు తెచ్చుకుని కొందరు, కొనుగోలు చేసి మరికొందరు కాల్వలు, కుంటల్లో అడుగంటిన నీటిని పొలానికి మళ్లించేందుకు ప్రయాసపడుతున్నారు. - సాక్షి నెట్వర్క -
ఆయిల్ ఇంజన్లు, సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఖమ్మం(అశ్వారావుపేట): ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆదివారం ఆశ్వారావుపేట మండలపరిషత్ కార్యాలయంలో 29 ఆయిల్ ఇంజన్లు, 9 సైకిళ్లు, ఒక కుట్టుమిషన్ పంపిణీ చేశారు. వీటిని భద్రాచలం ఐటీడీఏ ద్వారా అశ్వారావుపేట, దమ్మపేటలోని 9 గ్రామాలకు చెందిన గిరిజనుల(కొండ రెడ్లు)కు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అందజేశారు. -
శివారులు ఎడారులు
శివారు ప్రాంతాలకు చేరని సాగునీరు ఎండిపోతున్న నారుమడులు ఆయిల్ ఇంజిన్లతో నీరుతోడినా ప్రయోజనం శూన్యం శివారులో నారుమడులే పోయని గ్రామాలెన్నో ఎకరాకు రూ.5వేలు అదనపు ఖర్చులు ఆందోళనలో అన్నదాత సారూ.. మీరే మా సమస్య పరిష్కరించాలి. నీరు అందక నాట్లు వేయలేకపోతున్నాం. అక్కడక్కడా నాట్లు వేసిన పొలాలు నెర్రెలిస్తున్నాయి. పంటలు పండించుకునేందుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించాలి. లేకపోతే పంటలు పండక ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. ఇదీ ఆదివారం 14వ నంబరు పంటకాలువను పరిశీలించేందుకు వచ్చిన ఇరిగేషన్ ఎస్ఈ కె.శ్రీనివాసరావు ఎదుట కోడూరు మండలం ఊటగుండం రైతుల ఆవేదన... మచిలీపట్నం/చల్లపల్లి : ఒక్క ఊటగుండం రైతులు మాత్రమే కాదు.. శివారు ప్రాంతాల్లోని అన్నదాతలందరి పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ఒకవైపు సాగునీరు విడుదల చేశామని పాలకులు చెబుతున్నా.. సెప్టెంబరు నెల వచ్చినా శివారు ప్రాంతాలకు మాత్రం చుక్క నీరు చేరలేదు. దీంతో పచ్చగా కళకళలాడ్సిన వేలాది ఎకరాల పొలాలు నెర్రెలిచ్చి ఎడారులుగా మారుతున్నాయి. పాలకుల పర్యవేక్షణాలేమి, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఎగువన ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నిండినా, కాలువలకు కొసరి కొసరి సాగునీటిని విడుదల చేస్తూ నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాలువలకు ఎంత నీరు విడుదల చేస్తే శివారు భూములకు సక్రమంగా నీరు అందుతుందనే విషయాన్ని అంచనా వేయలేని నీటిపారుదల శాఖ అధికారుల వైఖరి తమకు శాపంగా మారిందని మండిపడుతున్నారు. కరుణించని వరుణుడు ఈ ఏడాది వరుణుడు కూడా కరుణించకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. సెప్టెంబరు 7వ తేదీలోపు జిల్లాలో 554.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 420.0 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. కంకిపాడు, పామర్రు, గూడూరు, కలిదిండి, మొవ్వ మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే నమోదైంది. 40 శాతం నీరు కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేస్తే, మిగిలిన 60శాతం వర్షంపై ఆధారపడి సాగు చేయాల్సి ఉందని, వర్షం లేకపోవటంతో సాగునీటిని సక్రమంగా అందించలేకపోతున్నామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. శివారులో ఎండుతున్న నారుమడులు కాలువ చివరన ఉన్న కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి తదితర మండలాల్లో ఇప్పటికీ వరినాట్లు వేస్తూనే ఉన్నారు. కోడూరు మండలంలోని ఊటగుండం, రామకృష్ణాపురం, ఇరాలి, హంసలదీవి, ఉల్లిపాలెం, సాలెంపాలెం, నారేపాలెం, విశ్వనాథపల్లి, వి.కొత్తపాలెం, మందపాకల, పోటుమీద, నాగాయలంక మండలం ఏడిమొగ, టి.కొత్తపాలెం, గణపేశ్వరం, పర్రచివర తదితర గ్రామాలకు ఇంకా సాగునీరు చేరలేదు. దీంతో ఆ ప్రాంతాలకు చెందిన రైతులు నారుమడులు కూడా పోసుకోలేదు. మచిలీపట్నం మండలంలో 25 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. గత పది రోజులుగా 9/3, 9/4, 9/5, 9/6, 9/7 కాలువలకు చుక్కనీరు రావటం లేదు. దీంతో తుమ్మలచెరువు, వాడపాలెం, చిన్నాపురం, నెలకుర్రు, కానూరు, తాళ్లపాలెం తదితర గ్రామాల్లో వరినాట్లు పూర్తి చేసిన పొలాలు, నారుమడులు ఎండిపోతున్నాయి. కోన, పాతేరు తదితర గ్రామాలకు సాగునీరు చేరకపోవటంతో నారుమడులు పోసుకోలేదు. బంటుమిల్లి మండలం కంచడం, బర్రిపాడు, ముంజులూరు తదితర గ్రామాల్లో వరినాట్లు జరుగుతున్నాయి. ఈ మండలంలో 18 వేల ఎకరాల్లో వరిసాగు ఉండగా, 10వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తి చేశారు. కృత్తివెన్ను మండలం 10వేల ఎకరాలు సాగు ఉండగా అన్ని గ్రామాల్లో వరినాట్లు వేస్తున్నారు. బంటుమిల్లి చానల్‌కు గత నాలుగైదు రోజులుగా సాగునీటి విడుదలను గణనీయంగా తగ్గించటంతో రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. నాట్లు వేయకముందే వంతులవారీ పద్ధతిలో సాగునీటి అందిస్తామని ప్రకటించిన నీటిపారుదల శాఖ అధికారులు శివారు ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేయకుండా తమను ఇక్కట్ల పాలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆయిల్ ఇంజిన్లే దిక్కు దివిసీమలోని పలు ప్రాంతాల్లో పంటకాలువల ద్వారా సరిగా సాగునీరు అందక పోవడంతో ఆయిల్ ఇంజిన్లతో తోడుకుని నాట్లు వేసుకుంటున్నారు. కొన్నిచోట్ల మండుతున్న ఎండల వల్ల ఉదయం తోడిన నీరు సాయంత్రానికి ఎండిపోతుండటంతో రెండుసార్లు దమ్ము చేయాల్సి వస్తోంది. దీనివల్ల ఎకరాకు అదనంగా రూ.5వేలు ఖర్చు అవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట కాలువలకు సక్రమంగా సాగునీరు అందిస్తే తమకు ఈ దుస్థితి ఉండదని రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దివిసీమలో 1.05లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయాల్సి ఉండగా నీటి కొరత వల్ల ఇప్పటి వరకు 45వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తిచేశారు. నారు ముదురుతోంది దివిసీమలోని పలు ప్రాంతాల్లో వేసిన నారు ముదిరిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా 25 నుంచి 30రోజుల మధ్య నారును ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల వేసిన నారు 35 నుంచి 40 రోజులు దాటిపోతున్నా పొలాలకు సాగునీరందకపోవడంతో ఏమిచేయాలో రైతులకు దిక్కుతోచడంలేదు. ఎండలు పెరుగుతుండటంతో నారుమళ్లకు రోజూ ఆయిల్ ఇంజిన్లతో నీటిని తోడటానికి రైతులు అదనపు భారాన్ని మోస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాట్లు పూర్తయ్యే వరకు సాగునీటిని సక్రమంగా అందించాలని రైతులు కోరుతున్నారు. దమ్ము చేసిన పొలం ఎండిపోయింది పక్క రైతును బతిమిలాడుకుని ఆయిల్ ఇంజిన్‌తో నీరు తోడాను. నాట్లు వేసేందుకు దమ్ము చేయించాను. మరుసటి రోజు నాటేయడానికి వెళితే పొలంలో చుక్కనీరులేదు. ఎండిపోయి మట్టి బయటపడింది. మళ్లీ దమ్ము చేయిద్దామనుకుంటే నీరందడంలేదు. ఏమిచేయాలో తెలియడంలేదు. - శీలం వెంకటేశ్వరరావు, పిట్లలంక, కోడూరు మండలం ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు సాగునీటి కోసం ఈ ఏడాది పడుతున్న ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు. నీటి ఎద్దడిని గ్రహించి వెదజల్లే పద్ధతిన సాగుచేశాను. నీరందక మొక్కలు ఎండిపోయి చనిపోయాయి. నారు తెచ్చి నాట్లు వేద్దామనుకున్నా పొలాలు తడవడానికి నీరు లభించడం లేదు. ఈ ఏడాది సాగునీటికి ఖర్చుపెట్టినట్టు నాజీవితంలో ఎప్పుడూ పెట్టలేదు. - గుమ్మడి భీమారావు, పుచ్చగడ్డ, చల్లపల్లి మండలం -
ఓ రైతు సాహసం
వర్షపాతం సాధారణం కంటే దారుణంగా ఉన్నా, చినుకు రాలకపోతే నారు బతకదని తెలిసినా ఆ రైతు సాహసం చేస్తున్నాడు. మిర్చి సాగుకు ఉపక్రమిస్తున్నాడు. ఆయిల్ ఇంజన్ల సాయంతో నీరుతోడి పోస్తున్నాడు. ఖర్చుకు వెనకాడకుండా మిరప నారు కొనుగోలు చేసి మరీ నాటుతున్నాడు. వరుణుడు కరుణించపోతే పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలు కాకతప్పదని తెలిసినా ధైర్యం చేసి ముందడుగు వేస్తున్నాడు. ప్రత్తిపాడు : ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో ఎక్కువ మంది రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపారు.దీనికి భిన్నంగా మండలంలోని కోయవారిపాలెంకు చెందిన రైతు పొనకల సాంబయ్య మాత్రం ఐదు ఎకరాల్లో మిర్చి సాగుకు నడుం బిగించాడు. చెరువులు, కుంటల్లోని నీటిని ఆయిల్ ఇంజన్ల సాయంతో తోడి సాగు చేపట్టాడు. మిర్చి పంటపై మమకారంతో సాంబయ్య కొండంత తెగువ చూపుతున్నాడని తోటి రైతులు అంటున్నారు. మిరప నారు స్థానికంగా అందుబాటులో లేనప్పటికీ పాములపాడు నుంచి కట్ట రూ. 30 నుంచి రూ.40లకు కొనుగోలు చేసి నాటుతున్నాడు.ఈ విధానంలో ఎకరాకు సుమారు 80 కట్టల(పదిహేను వేల మొక్కలు) వరకు నారు పట్టే అవకాశం ఉంది. ఇలా నారు కొనుగోలుకు రూ. 3200, రవాణాకు మరో ఐదు వందల వరకు ఖర్చు చేస్తున్నాడు. ఎకరా మిర్చి నారు నాటేం దుకు కూలీలకు మూడు వేలు (అది కూడా కాంట్రక్ట్ ఇస్తేనే) చెల్లిస్తున్నాడు. ఆయిల్ ఇంజన్ల ద్వారా సుమారు రెండు మూడు వందల మీటర్లు పైపు వేసి దగ్గర లో ఉన్న పంటకాలువలు, చెరువులు, కుంటల నుంచి నీరు తోడుతున్నాడు. దీనికి మరో ఐదు వందల వరకు ఖర్చు పెడుతున్నట్టు చెబుతున్నాడు. మొత్తం మీద ఎకరాకు దాదాపు రూ. ఐదువేలపైగానే ఖర్చు చేస్తున్నాడు. ఇంత చేసినా వానలు కురిస్తేనే నాటిన నారైనా బతికేదని చెబుతున్న రైతు వరుణుడిపై భారం వేస్తున్నాడు. నీరు పెట్టి నారును బతికించుకునే పరిస్థితి ఉండదని, వానలు కురవకపోతే ఇప్పుడు చేసిన ఖర్చంతా మట్టిలో పోసినట్టేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. సాధారణ వర్షపాతం.. గత మూడు నెలల్లో మండలంలో కురిసిన వర్షపాతాన్ని పరిశీలిస్తే జూలై మినహా మి గిలిన రెండు నెలలు సాధారణం కంటే దారుణంగా ఉంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 89 మి.మీ కాగా 5.2 మి.మీ కురిసింది. జూలైలో సాధారణ వర్షపాతం 138 మి.మీ కాగా 144 మి.మీ నమోదైంది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 135 మి.మీ కాగా, కురిసింది 92.6 మి.మీ. దీంతో రైతులు మిర్చి పంటకు దూరమయ్యారు. -
నారుమళ్లు...పశువులపాలు
నీరులేక ఎండిపోతున్న వైనం ఎకరాకు రూ.4వేలు నష్టం కౌలు రైతు పరిస్థితి మరీ దయనీయం తూర్పుకృష్ణాలో కరువు కష్టాలే! చల్లపల్లి : వరుణుడు కరుణించకపోయినా ఆయిల్ ఇంజన్లు, గుల్లపంపుతో నీరు తోడి పోసి కంటికి రెప్పలా కాపాడుకున్న నారుమళ్లను రైతులే పశువుల పరం చేస్తున్నారు. రెక్కలు, ముక్కలు చేసుకుని ఎంతో కష్టపడి పోసుకున్న నారుమడిని తమ కళ్లముందే పశువులు మేస్తుండటంతో తీవ్ర ఆవేదనకు గురౌతున్నారు. ఒకప్పుడు సాగులో ముందుండే తూర్పుకృష్ణాలోని మొవ్వ, పామర్రు, దివిసీమలోని ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి ప్రాంతాల్లో ఈ దుస్థితి ఎదురవ్వడం రైతులను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 6.34లక్షల ఎకరాల్లో వరిసాగు చేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. సకాలంలో సాగునీరందక పోయినా విద్యుత్ బోర్లు, ఆయిల్ ఇంజన్లతో వర్షపునీరు, తాగునీటికి వదిలిన నీటిని తోడుకుని ఎన్నో ఇబ్బందులు పడి నారుమళ్లు పోశారు. అనంతర కాలంలో వానలు లేకపోవడం, ఎండలు మండిపోవడంతో నారుమళ్లు ఎండిపోయాయి. ఘంటసాల, మొవ్వ, చల్లపల్లి మండలాల్లో నారుమళ్లను కాపాడుకునేందుకు కూలీలతో నీళ్లపోత పోయించారు. ఎకరం పొలానికి నారుమడి పోసేందుకు వర్షాభావ పరిస్థితుల వల్ల రూ.3,000 నుంచి రూ.4,000 ఖర్చుపెట్టారు. అయితే ఆగస్టు నెల సగం రోజులు పూర్తవుతున్నా వర్షాల్లేక సాగునీరందకపోవడంతో ఈ ప్రాంతాల్లో చాలాచోట్ల నారుమళ్లు ఎండిపోయి భూములు నోళ్లు తెరిచాయి. చేసేదిలేక రైతులు నారుమళ్లలో పశువులను తోలుతున్నారు. ఇప్పటికే నెలరోజులు అదును తప్పడంతో మళ్లీ నారుమళ్లు పోసినా సమయం చాలదని, ఎక్కడైనా నారు దొరికితే నాట్లు వేస్తాం లేదంటే ఖాళీగా వదిలేస్తామని ఘంటసాల, చల్లపల్లి మండలాలకు చెందిన కొంతమంది రైతులు చెబుతున్నారు. మరోవైపు మొవ్వ, పామర్రు, ఉయ్యూరు, గుడివాడ ప్రాంతాల్లో బోర్ల ఆధారంగా పోసిన నారుమళ్లకు 50 నుంచి 60రోజులు గడిచింది. సాగునీరు లేకపోవడం వల్ల పొలాలు తడవక ఈ ప్రాంతాల్లో చాలాచోట్ల నాట్లు వేయలేదు. ఎక్కువ కాలం ఉన్న ఈ నారుమళ్లు నాట్లు వేసేందుకు ఉపయోగపడకుండా పోతుండడంతో ఈ ప్రాంత రైతులకు దిక్కుతోచడం లేదు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయం... దివిసీమతో పాటు తూర్పు కృష్ణాలో ఈ ఏడాది ఎకరం పొలానికి 12 బస్తాల నుంచి 20 బస్తాల కౌలు ఇచ్చేందుకు రైతులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల పొలాలు ఇవ్వరేమోనని భయపడిన కొంతమంది కౌలు రైతులు బయట అందినకాడికి అప్పులు తెచ్చి ముందుగానే కౌలు చెల్లించారు. పోసిన నారుమళ్లకు నీరందక ఎండిపోతుండటంతో కౌలు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాట్లు వేయలేమని రైతులు చేతులెత్తేస్తున్నారు. రెండోపంట మినుము, మొక్కజొన్నపై ఆశపెట్టుకుని పెద్ద మొత్తంలో కౌలుకు తీసుకుని సాగుచేసేందుకు ప్రయత్నించిన కౌలురైతులు నారుమళ్లు ఎండిపోయి చనిపోవడంతో రెండోపంటకు సమయం చాలక కౌలుకు తీసుకున్న పొలాలను వదిలేస్తున్నారు. ఇకముందు సాగునీరందినా నాట్లు వేసే పరిస్థితిలేక పోవడంతో ఈ ఏడాది వేలాది ఎకరాల్లో నాట్లు పడే అవకాశం లేదు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా తూర్పుకృష్ణాలో కరువు తాండవించే పరిస్థితులు కనబడుతున్నాయి. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చేసేది లేక పశువులకు మేపుతున్నాం ఎకరం పొలంలో వరినాట్లు వేసేందుకు నారుమడి పోశాము. సాగునీరు అందకపోవడంతో ఆయిల్ ఇంజన్‌తో మడిపోశాం. ఎండలు మండిపోవడం, సాగునీరందకపోవడంతో నారుమడి ఎండిపోయి చనిపోయింది. చేసేదిలేక పశువులకు మేపుతున్నాం. కంటి పాపలా కాపాడుకున్న నారుమడిని పశువులకు మేపుతుంటే కడుపు తరుక్కుపోతుంది. - కోరుకొండ ధనలక్ష్మీ, రైతు, రామానగరం, చల్లపల్లి సాగు వదిలేయాల్సిందే... ఎకరానికి ఇరవై వేలు కాడికి నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నాను. ఆయిల్ ఇంజన్లతో నారుమళ్లు పోశాను. తరువాత రెండుసార్లు తడుపులు చేశాను. అయినా నారుమడి ఎండిపోయి చనిపోయింది. నాటేయడానికి పనికిరాదు. ప్రస్తుత పరిస్థితుల్లో నారు ఎక్కడా దొరకదు. ఈ ఏడాది వదిలేయడం తప్ప ఏమీ చేయలేం. - గుమ్మడి భీమారావు, పుచ్చగడ్డ, చల్లపల్లి మండలం -
సందిగ్ధం..!
వెదజల్లాలా.. నారుపోయాలా.. తేల్చుకోలేని రైతాంగం కుళ్లిపోతున్న వెదజల్లిన విత్తనాలు నారుమళ్లకు సాగునీరు కరువు చల్లపల్లి : ఎన్నడూలేని విధంగా ఈసారి రైతులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సాగునీటి విడుదలపై అయోమయం నెలకొంది. మరోవైపు వర్షాలు కూడా కురవడం లేదు. ఖరీఫ్ సీజన్ దాటిపోతోందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగుకు ఏ పద్ధతిని ఎంచుకోవాలో తెలియక అన్నదాతలు సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు వెదజల్లే పద్ధతిన సాగు చేయగా తడి, పొడి కలయిక వల్ల విత్తనాలు కుళ్లిపోతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో నారుమడులు పోసేందుకు సాగునీరందక పడరాని పాట్లు పడుతున్నారు. సాగునీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయశాఖాధికారులు సరైన సూచనలు, సలహాలను అందించక పోవడం వల్ల రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. అయోమయం.. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 85వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతిని అనుసరించగా, 13,200 ఎకరాల్లో వరి నారుమళ్లు పోసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, పెడన, పామర్రు మండలాల్లో వెదజల్లే పద్ధతిన విత్తనాలు చల్లారు. కొన్నిచోట్ల సరిగా నీరందకపోవడంతో సగం తడి, సగం పొడిగా ఉన్న విత్తనాలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. మరికొన్నిచోట్ల సాగునీరందక పోవడంతో విత్తనాలు సరిగా మొలవక మళ్లీ నారుమళ్లు పోసుకుంటున్నారు. దీనివల్ల ఎకరాలకు రూ.2వేల నుంచి రూ.3వేల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సగం సాగుపనులు మాత్రమే చేశారు. గత ఏడాది ఇప్పటికి 35శాతం సాగుపనులు జరగ్గా, ప్రస్తుతం 15 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. కలవరపెడుతున్న నీటిఎద్దడి నారుమళ్లు పోసుకునేందుకు సన్నద్ధమవుతున్న రైతులను సాగునీటి ఎద్దడి కలవర పెడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ ఇంజిన్లతో నారుమళ్లు పోసిన రైతులు నారు చేతికొచ్చింది. పొలాలు తడిపేందుకు సాగునీరు లేకపోవడంతో ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ పద్ధతిన సాగుచేస్తే ప్రయోజనమో వ్యవసాయ శాఖాధికారులు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వరుణుడిపైనే భారం ఈ నెల 8, 9, 10 తేదీల్లో జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఈనెల 11న అల్పపీడనం ఏర్పడినప్పటికీ మూడు రోజులు మబ్బులతో ఊరించి చినుకురాలకుండానే ముఖం చాటేశాయి. ఈ నెల 20వ తేదీకి జిల్లాలో 205.4 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, 116.5 మి.మీ మాత్రమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 46 శాతం తక్కువగా నమోదైంది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తన ద్రోణి, అల్పపీడనం ఏర్పడ్డాయని, వీటివల్ల వర్షాలు పడతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పట్లో పంటకాలువలకు సాగునీరు విడులయ్యే పరిస్థితి లేకపోవడంతో వరుణుడిపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. -
దిగజారిన ధాన్యం ధరలు
కొడవలూరు, న్యూస్‌లైన్ : ఎడగారు సీజ న్లో వరి సాగు చేసిన రైతులు ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం తో ఆందోళన చెందుతున్నారు. మండలంలో సుమారు 2 వేల ఎకరాల్లో ఎడగారు వరి సాగు చేపట్టారు. ఈ దఫా కా లువల ద్వారా సాగునీటిని విడుదల చే యకపోవడంతో రైతులు మోటార్లు, ఆ యిల్ ఇంజన్లు ఉపయోగించి అష్టకష్టాలు పడి వరి సాగు చేశారు. గత సీజన్లో ఆ శించిన మేర దిగుబడులు రావడం, ధా న్యం ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు వ రి సాగుపై మక్కువ చూపారు. ప్రస్తుత సీజన్లో ధాన్యం ధరలు దిగజారడంతో పెట్టుబడులు కూడా వచ్చే ప రిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. దీనికి తోడు వాతావరణంలో మార్పులు కారణంగా ధాన్యం దిగుబ డులు తగ్గాయి. వ్యవసాయ ఖర్చులు తడిసి మోపడయ్యాయి. ఎకరాకు సుమారుగా రూ.15 నుంచి 18 వేలు ఖర్చయ్యా యి. ఈ సీజన్లో రైతులు నెల్లూరు జిల కర వరి రకాన్ని ఎక్కువగా సాగు చేశారు. ఎకరాకు రెండు పుట్లుకు మించి ధాన్యం దిగుబడి రావడం లేదు. గత సీజన్లో అయితే ఎకరాకుల నాలుగు పుట్లుకు మించి దిగుబడి లభించింది.ప్రస్తుతం పుట్టి ధాన్యం ధర రూ.10,500 పలుకుతోంది. గత సీజన్లో పుట్టి ధాన్యం రూ.13 వేల వరకు వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. ఎడగారులో దిగుబడి తగ్గి.. ధర తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ మార్పులతో ఆందోళన వరికోత యంత్రాల ద్వారా కోసిన ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు అయినకాడికి తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాతావరణంలో మార్పులు కారణంగా మబ్బులు ఏర్పడి అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యాన్ని ఆర బెట్టుకునే అవకాశం లేకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.