సరి కొత్త తిప్పలు
రూ.వంద నోట్లు నిండుకున్నాయ్!
రూ.2 వేల నోట్లే ఉన్నాయ్!
విశాఖపట్నం : పక్షం రోజుల నుంచి అవస్థలు పడుతున్న నగర వాసులకు సరికొత్త తిప్పలు మొదలవుతున్నారుు. రద్దరుున పెద్దనోట్ల మార్పిడికి బ్యాంకుల చుట్టూ క్యూ కడుతున్నారు. బ్యాంకుల్లో రూ.500, వెరుు్య నోట్లను మార్చుకునే వారికి రూ.100, 50, 20 నోట్లతో పాటు కొత్తగా వచ్చిన రూ.2 వేల నోట్లు ఇస్తున్నారు. రూ.2 వేల నోట్లకు చిల్లర దొరక్క మార్చుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. దీంతో కొత్త నోట్లను చాలామంది ఆభరణంలా భద్రంగా దాచుకుంటున్నారు. ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. నగరంలోని అనేక బ్యాంకుల్లో రూ. వంద నోట్లు నిండుకున్నారుు. రూ.2 వేల కొత్త నోట్లు మాత్రం పుష్కలంగా ఉన్నారుు. శుక్రవారం నుంచి ఖాతాదార్లకు ఈ నోట్లే అవసరాలు తీర్చనున్నారుు. ఇష్టం ఉన్నా, లేకపోరుునా బ్యాంకుల నుంచి సొమ్ము తీసుకోవాలంటే రూ.2 వేల నోట్లే గతి అయ్యే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం పరిస్థితులను బట్టి రూ.వంద, 50 నోట్లు రావడానికి మూడు, నాలుగు రోజులు పట్టవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
పెద్ద నోట్ల మార్పిడి చేసుకున్న వారికి బ్యాంకు అధికారులు సగం చిన్న నోట్లు, మిగిలిన సగానికి రూ.2 వేల నోటు ఇస్తూ వచ్చారు. అలా ఇచ్చిన రూ.2 వేల నోటు మారకం కష్టతరంగా మారింది. ఈ తరుణంలో కొన్నాళ్ల పాటు వాటినే తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం సామాన్యులకు మరింత అవస్థలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పలు బ్యాంకులు డబ్బుల్లేవంటూ చేతులెత్తేస్తున్నారుు. డబ్బు కొరతతో సతమతమవుతున్న నేపథ్యంలో కొత్తగా రూ.2 వేల నోట్లు గుదిబండలా మారడం నగర వాసులకు నగదు కష్టాలు మరింతగా తెచ్చిపెట్టనున్నారుు.