One hundred notes
-
వందే పదివేలు
వందే వెయ్యివరహాలు పెళ్లి కూతురు రిచ్‌గా ఉంది. ఆ రిచ్‌నెస్ పెళ్లి కళ వల్ల వచ్చింది. ఆ పెళ్లి కళ వందనోట్ల వల్ల వచ్చింది. దేశంలో ఇప్పుడు వంద నోట్లను మించిన నిధులూ నిక్షేపాలూ లేవు. మణులూ మాణిక్యాలూ లేవు. సిరులూ సంపదలూ లేవు. ఈ పెళ్లి కూతురుది గుజరాత్‌లోని అహ్మదాబాద్. స్త్రీ ధనంగా అత్తింటివారు ఇచ్చిన 2,500 రూపాయల కొత్త నోట్లతో లైఫ్‌ని లీడ్ చేయబోతోంది. ఇటీవల అక్కడ జరిగిన సామూహిక కల్యాణోత్సవాలలో వంద నోటే పెళ్లిపెద్ద అయింది. -
సరి కొత్త తిప్పలు
రూ.వంద నోట్లు నిండుకున్నాయ్! రూ.2 వేల నోట్లే ఉన్నాయ్! విశాఖపట్నం : పక్షం రోజుల నుంచి అవస్థలు పడుతున్న నగర వాసులకు సరికొత్త తిప్పలు మొదలవుతున్నారుు. రద్దరుున పెద్దనోట్ల మార్పిడికి బ్యాంకుల చుట్టూ క్యూ కడుతున్నారు. బ్యాంకుల్లో రూ.500, వెరుు్య నోట్లను మార్చుకునే వారికి రూ.100, 50, 20 నోట్లతో పాటు కొత్తగా వచ్చిన రూ.2 వేల నోట్లు ఇస్తున్నారు. రూ.2 వేల నోట్లకు చిల్లర దొరక్క మార్చుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. దీంతో కొత్త నోట్లను చాలామంది ఆభరణంలా భద్రంగా దాచుకుంటున్నారు. ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. నగరంలోని అనేక బ్యాంకుల్లో రూ. వంద నోట్లు నిండుకున్నారుు. రూ.2 వేల కొత్త నోట్లు మాత్రం పుష్కలంగా ఉన్నారుు. శుక్రవారం నుంచి ఖాతాదార్లకు ఈ నోట్లే అవసరాలు తీర్చనున్నారుు. ఇష్టం ఉన్నా, లేకపోరుునా బ్యాంకుల నుంచి సొమ్ము తీసుకోవాలంటే రూ.2 వేల నోట్లే గతి అయ్యే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం పరిస్థితులను బట్టి రూ.వంద, 50 నోట్లు రావడానికి మూడు, నాలుగు రోజులు పట్టవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. పెద్ద నోట్ల మార్పిడి చేసుకున్న వారికి బ్యాంకు అధికారులు సగం చిన్న నోట్లు, మిగిలిన సగానికి రూ.2 వేల నోటు ఇస్తూ వచ్చారు. అలా ఇచ్చిన రూ.2 వేల నోటు మారకం కష్టతరంగా మారింది. ఈ తరుణంలో కొన్నాళ్ల పాటు వాటినే తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం సామాన్యులకు మరింత అవస్థలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పలు బ్యాంకులు డబ్బుల్లేవంటూ చేతులెత్తేస్తున్నారుు. డబ్బు కొరతతో సతమతమవుతున్న నేపథ్యంలో కొత్తగా రూ.2 వేల నోట్లు గుదిబండలా మారడం నగర వాసులకు నగదు కష్టాలు మరింతగా తెచ్చిపెట్టనున్నారుు. -
ఇంటింటా కరెన్సీ కష్టాలే.!
-
ఆ బ్యాంకుల్లో వంద నోట్లే రూ.2 కోట్లు
వంద నోట్ల కొరత రాకుండా ఆర్బీఐ ఏర్పాటు ఒక్క రోజులోనే కొత్త అకౌంట్ల యాక్టివేషన్ ఆంధ్రాబ్యాంక్ జోనల్ మేనేజర్ విజయలక్ష్మి సీతమ్మధార: బ్యాంకుల్లో వంద నోట్ల కొరత లేకుండా ఆర్బీఐ ఆదేశాలను అనుసరించి నగరంలోని ఏడు బ్యాంకుల్లో 14 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసినట్లు ఆంధ్రాబ్యాంక్ జోనల్ మేనేజర్ విజయలక్ష్మి తెలిపారు. ఆమె మంగళవారం సాక్షితో మాట్లాడారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్, ఐవోబీ, ఎస్బీహెచ్, యూనియన్ బ్యాంక్, యూకే బ్యాంక్, కెనరా బ్యాంకుల్లో ఒక్కో బ్యాంకుకు రూ.2 కోట్ల చొప్పున వంద రూపాయల నోట్లు డిపాజిట్ చేశామన్నారు. తమ జోన్ పరిధిలోని 76 బ్రాంచ్‌లలో రూ.వంద రూపాయలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఖాతాదారుల డిపాజిట్లు రూ.250 కోట్లు :తమ జోన్ పరిధిలో ఖాతాదారులు ఇప్పటివరకు రూ.250 కోట్లు డిపాజిట్ చేసినట్లు విజయలక్ష్మి చెప్పారు. ఆంధ్రాబ్యాంకులన్నీ బుధవారం నుంచి ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తాయని చెప్పారు. కొత్త అకౌంట్లు తెరిచేవారి కోసం హెల్పింగ్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఓపెన్ చేసిన మర్నాడే పాస్‌బుక్‌తో పాటు సీక్రెట్ కోడ్ , కిట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఖాతాదారులంతా డిపాజిట్లు, లావాదేవీలు చేసుకోవచ్చని చెప్పారు. చాలా రోజులుగా అకౌంట్లు వాడని వారు ఆధార్‌కార్డు తీసుకువస్తే వెంటనే యాక్టివేట్ చేస్తామని చెప్పారు. ఏటీఎంలలో రోజుకు రూ.10 లక్షలు వేస్తున్నామని, అరుునా అరుుపోతున్నాయని చెప్పారు. షాపింగ్‌మాల్స్‌తో పాటు అవకాశమున్న చోట డెబిట్‌కార్డు ఉపయోగించాలని సూచించారు. -
అదనపు సెక్యూరిటీ ఫీచర్‌తో కొత్త వంద నోట్లు
ముంబై : భారత రిజర్వ్ బ్యాంక్ అదనపు సెక్యూరిటీ ఫీచర్‌తో రూ.వంద నోట్లను జారీ చేసింది. కొత్త నెంబరింగ్ ప్యాటర్న్‌తో ఈ మహాత్మా గాంధీ 2005 సిరీస్ బ్యాంక్నోట్లను అందిస్తున్నామని ఆర్బీఐ తెలిపింది. నోటుపై రెండు చోట్ల ఉండే నంబర్ల ప్యానల్లో అంకెల సైజు ఎడమ నుంచి కుడివైపుకు పెరుగుతూ ఉంటుందని పేర్కొంది. మొదటి మూడు అంకెలు(అల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్) సైజు ఒకేలా ఉంటుందని వివరించింది. నోటును చూడగానే ఈ ఫీచర్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని, దీంతో ప్రజలు దొంగనోట్లను, అసలు నోట్లను సులభంగా గుర్తించవచ్చని ఆర్బీఐ పేర్కొంది. ఒక్క నంబ రింగ్ ప్యాటర్న్ మినహా మిగిలిన అన్ని అంశాలు మహాత్మా గాంధీ సిరీస్ 2005 నోట్లలో ఒకే విధం గా ఉంటాయని ఆర్బీఐ వివరించింది. గతంలో ఈ సిరీస్‌లో జారీ చేసిన అన్ని నోట్లు చట్టబద్ధంగా చలామణిలో ఉంటాయని పేర్కొంది.