
అదనపు సెక్యూరిటీ ఫీచర్‌తో కొత్త వంద నోట్లు
ముంబై : భారత రిజర్వ్ బ్యాంక్ అదనపు సెక్యూరిటీ ఫీచర్‌తో రూ.వంద నోట్లను జారీ చేసింది. కొత్త నెంబరింగ్ ప్యాటర్న్‌తో ఈ మహాత్మా గాంధీ 2005 సిరీస్ బ్యాంక్‌నోట్లను అందిస్తున్నామని ఆర్‌బీఐ తెలిపింది. నోటుపై రెండు చోట్ల ఉండే నంబర్ల ప్యానల్‌లో అంకెల సైజు ఎడమ నుంచి కుడివైపుకు పెరుగుతూ ఉంటుందని పేర్కొంది. మొదటి మూడు అంకెలు(అల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్) సైజు ఒకేలా ఉంటుందని వివరించింది. నోటును చూడగానే ఈ ఫీచర్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని, దీంతో ప్రజలు దొంగనోట్లను, అసలు నోట్లను సులభంగా గుర్తించవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.
ఒక్క నంబ రింగ్ ప్యాటర్న్ మినహా మిగిలిన అన్ని అంశాలు మహాత్మా గాంధీ సిరీస్ 2005 నోట్లలో ఒకే విధం గా ఉంటాయని ఆర్‌బీఐ వివరించింది. గతంలో ఈ సిరీస్‌లో జారీ చేసిన అన్ని నోట్లు చట్టబద్ధంగా చలామణిలో ఉంటాయని పేర్కొంది.