
వందే పదివేలు
వందే వెయ్యివరహాలు
పెళ్లి కూతురు రిచ్‌గా ఉంది. ఆ రిచ్‌నెస్ పెళ్లి కళ వల్ల వచ్చింది. ఆ పెళ్లి కళ వందనోట్ల వల్ల వచ్చింది. దేశంలో ఇప్పుడు వంద నోట్లను మించిన నిధులూ నిక్షేపాలూ లేవు. మణులూ మాణిక్యాలూ లేవు. సిరులూ సంపదలూ లేవు.
ఈ పెళ్లి కూతురుది గుజరాత్‌లోని అహ్మదాబాద్. స్త్రీ ధనంగా అత్తింటివారు ఇచ్చిన 2,500 రూపాయల కొత్త నోట్లతో లైఫ్‌ని లీడ్ చేయబోతోంది. ఇటీవల అక్కడ జరిగిన సామూహిక కల్యాణోత్సవాలలో వంద నోటే పెళ్లిపెద్ద అయింది.