ఇదేందయ్యా ఇది..! డెస్టినేషన్‌ వెడ్డింగ్‌.. వేరే లెవల్‌! | Gujarat couple gets married in snow at Himachal Pradesh's Spiti Valley: Watch video | Sakshi
Sakshi News home page

ఇదేందయ్యా ఇది..! డెస్టినేషన్‌ వెడ్డింగ్‌.. వేరే లెవల్‌!

Published Thu, Feb 29 2024 6:07 PM | Last Updated on Thu, Feb 29 2024 6:26 PM

Gujarat couple gets married in snow Himachal Pradesh Spiti Valley check video - Sakshi

ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట. అచ్చం..మురారీ సినిమాలోలాగ, అదీ కాదంటే తమ అభిమాన హీరో హీరోయిన్ల పెళ్లిలా..ఎవరైనా ఇలాంటి పెళ్లి సందడి కోరు కుంటారు. కానీ గుజరాత్‌కు చెందిన జంట మాత్రం వెరైటీ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  అదేంటో చూసేయండి మరి..!

అందిరిలా మేమూ చేసుకుంటే ‘కిక్‌’ ఏంటి అనుకున్నారేమో ఈ జంట మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలికి గజ గజ వణికిపోతూ  మూడు ముళ్ల ముచ్చటను తీర్చుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుతో కప్పి ఉండే స్పితి లోయలో వివాహం చేసుకున్నారు. ఒక పక్క మంచు పూలవర్షమే అక్షితలుగా  చలికి  వణికి పోతూ మంచులో ముచ్చటగా  పెళ్లి చేసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అంతేనా ఈ పెళ్లి ఫోటోషూట్‌,  కెమెరామెన్లు, బంధువులు, పంతుళ్లు ఇలా అందరికీ హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. పెళ్లికి సంబంధించిన వీడియోలను హిమాచల్ ప్రభుత్వ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ అజయ్ బన్యాల్,  గో హిమాచల్  ట్విటర్‌ ఖాతాలో షేర్  అయ్యాయి. కుండలినీ యోగాతో అల్జీమర్స్‌కు చెక్‌: తాజా పరిశోధన
 
లవర్‌ మాట కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడట అబ్బాయి. స్పితిలోని మురాంగ్‌లో జరిగిన అపూర్వ వివాహం జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి  అనే మాట ఇది వేరే లెవల్‌ అంటూ నెటిజన్లు కమెంట్‌ చేశారు. అంతేనా 'ఓవర్‌యాక్టింగ్'  అని ఒకరు,  "షాదీ అండ్‌ హనీమూన్ డన్‌’’ అటూ మరొకరు కమెంట్‌ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేసి, మీకే మనిపించిందో కమెండ్‌ చేయండి. అంతలోనే ఎంత విషాదం : మాజీ మిస్‌ ఇండియా కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement