హిమ శిఖరాల్లో పెళ్లి సందడి!..వణికించే చలిలో ఫోజులిస్తున్న జంట! | Bride Emerges Huge Ice Cube At Wedding In Snowy In Switzerland | Sakshi
Sakshi News home page

హిమ శిఖరాల్లో పెళ్లి సందడి!..వణికించే చలిలో ఫోజులిస్తున్న జంట!

Published Mon, May 20 2024 10:47 AM | Last Updated on Mon, May 20 2024 11:51 AM

Bride Emerges Huge Ice Cube At Wedding In Snowy In Switzerland

జీవితంలో ఒక్కసారి జరిగే మధురమైన ఘట్టం 'పెళ్లి'. అది తమ జీవితంలో మరుపురాని గుర్తులా ఉండేలా గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటోంది యువత. అందుకోసం తమ తాహతకు తగ్గా రేంజ్‌లో డీజే మ్యూజిక్‌లు లేదా అందమైన టూరిస్ట్‌ ప్రదేశాల్లోనూ చేసుకుంటారు. విభిన్నంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. అలానే ఇక్కడొక జంట ఏకంగా ఎముకలు కొరికే మంచు శిఖరాల్లో పెళ్లి జరగాలనుకుంది. అందుకని ఎక్కడకు వెళ్లారంటే..

ఈ జంట ఏకంగా స్విట్జర్లాండ్‌లో జెర్మాట్‌లోని ఆల్ఫైన్‌ శిఖరాల వద్ద గ్రాండ్‌గా వివాహ వేడుకను జరుపుకుంది. బంధువుల, స్నేహితు ఆశ్వీరాదల నడుమ ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యింది. గజగజ వణికించే చలిలో చక్కటి వయోలిన్‌ మ్యూజిక్‌, ఆ చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్లు మిల్కీ వైట్‌ పెళ్లి దుస్తులతో పైనుంచి భువిపైకి వచ్చిన దేవతాల్లా ఉన్నారు. 

అక్కడొక పెద్ద మంచు క్యూబ్‌ సెట్టింగ్‌లో వధువరులిద్దరు చక్కగా కెమరాలకు ఫోజలిలస్తూ నిలబడ్డారు. మంచు శిఖరాలే తమ పెళ్లికి సాక్ష్యంగా.. ఏకంగా రెండు వేలకు పైగా ఎత్తులో ఈ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టూ ఉన్న తెల్లటి మంచుకి తగ్గట్టూ పూల డెకరేషన్‌ ఓ రేంజ్‌లో అదరహో అన్నంతగా అద్భుతంగా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు ఈ వెడ్డింగ్‌ అడ్వెంచర్‌ అదిరిపోయింది బాస్‌, నిజజీవితంలో ఇలా మంచులో పెళ్లి చేసుకునే జంటను చూస్తానని అనుకోలేదంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement