ఇటీవల పెళ్లి వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు వధువు దగ్గర నుంచి వరుడు వరకు పాటించే ఆచారాలు ఎవరో ఒకరు చిత్రీకరించడంతో అవి నెట్టింట వైరల్‌గా మారడం షరా మామూలుగా మారింది. ఈ ట్రెండ్ కరోనా నుంచి కాస్త ఎక్కువ అయ్యిందనే చెప్పాలి. తాజాగా ఓ వరుడు ఊరేగింపులో రూ. కోట్లు విలువైన లగ్జరీ కార్లను ఉపయోగించాడు. అయితే కార్ల నుంచి కాకుండా మండపంలోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు ఆ వరడు!
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన భాజపా నేత భరత్ వఘాశియా తన కుమారుడి పెళ్లి ఊరేగింపులో రూ.కోట్ల విలువైన 100 విలాసవంతమైన కార్లను వినియోగించారు. అందులో అత్యంత ఖరీదైన కార్ల సరికొత్త మోడల్స్ అన్నీ కనిపించాయి. ఊరేగింపులో ఖరీదైన కార్లు రావడం చూసి పెళ్లికి వచ్చి బంధువులు, చుట్టూ ఉన్న ప్రజలు సైతం ఆశ్చర్యపోయారు. కానీ, ఆ వరుడు ఊరేగింపులో ఉన్న లగ్జరీ కార్లలో కాకుండా ఎద్దుల బండిపై వచ్చి ఊహించని షాకిచ్చాడు. కారణం ఏంటంటే.. గుజరాత్‌లో వరుడు ఎప్పుడూ ఎద్దుల బండిలో రావడం అనాదిగా వస్తున్న ఆచారం. గుజరాత్ సంస్కృతి ,సంప్రదాయాలతో పాటు ఆధునిక, సాంకేతికతతో నడిచే జీవనశైలిని ప్రదర్శించాలని వరుడు కోరుకున్నాడట. తన కుమారుడికి ఖరీదైన కార్లంటే ఇష్టమని, అందుకే ఊరేగింపులో రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల విలువైన కార్లను ఉపయోగించామని, అలాగే సంప్రదాయాన్నీ కొనసాగించినట్లు వరుడు తండ్రి తెలిపాడు.
చదవండి వెరైటీ వంట: ప్లాస్టిక్ కవర్‌లో చేపల పులుసు, ఈ బామ్మ ఎలా చేసిందో చూడండి!
Comments
Please login to add a commentAdd a comment