bullock cart
-
హెలికాప్టర్ వద్దన్నందుకు.. ఎడ్లబండిలో వచ్చి నామినేషన్
పాట్నా:ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలడంతో పాటు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా నామినేషన్ పర్వంలోనైతే అభ్యర్థులు తమ బలాబలాలను ప్రదర్శిస్తుంటారు.ఈ క్రమంలోనే ఆసక్తికర ఘటనలు, పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ఇదే తరహాలో బిహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన్ వేసేందుకు హెలికాప్టర్లో వస్తానని అధికారులను అనుమతి అడిగారు. హెలికాప్టర్లో వచ్చి నామినేషన్ వేసేందుకు స్వతంత్ర అభ్యర్థి అమ్రేష్రాయ్కి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన హెలికాప్టర్ నుంచి ఏకంగా ఎడ్లబండి రేంజ్‌కు వచ్చేశారు.ఎడ్లబండిలో ఊరేగింపుగా వచ్చి డ్యాన్సులతో హోరెత్తించి నామినేషన్ దాఖలు చేశారు. హెలికాప్టర్‌కు అనుమతివ్వనందుకే తాను ఎడ్లబండిలో వచ్చి నామినేషన్ వేశానని అమ్రేష్రాయ్ చెప్పారు. ఇదీ చదవండి.. పొలిటికల్ ఎంట్రీపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఊరేగింపులో రూ.కోట్ల విలువైన కార్లు.. అయినా ఎద్దుల బండి మీద వరుడు ఎంట్రీ!
ఇటీవల పెళ్లి వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు వధువు దగ్గర నుంచి వరుడు వరకు పాటించే ఆచారాలు ఎవరో ఒకరు చిత్రీకరించడంతో అవి నెట్టింట వైరల్‌గా మారడం షరా మామూలుగా మారింది. ఈ ట్రెండ్ కరోనా నుంచి కాస్త ఎక్కువ అయ్యిందనే చెప్పాలి. తాజాగా ఓ వరుడు ఊరేగింపులో రూ. కోట్లు విలువైన లగ్జరీ కార్లను ఉపయోగించాడు. అయితే కార్ల నుంచి కాకుండా మండపంలోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు ఆ వరడు! వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన భాజపా నేత భరత్ వఘాశియా తన కుమారుడి పెళ్లి ఊరేగింపులో రూ.కోట్ల విలువైన 100 విలాసవంతమైన కార్లను వినియోగించారు. అందులో అత్యంత ఖరీదైన కార్ల సరికొత్త మోడల్స్ అన్నీ కనిపించాయి. ఊరేగింపులో ఖరీదైన కార్లు రావడం చూసి పెళ్లికి వచ్చి బంధువులు, చుట్టూ ఉన్న ప్రజలు సైతం ఆశ్చర్యపోయారు. కానీ, ఆ వరుడు ఊరేగింపులో ఉన్న లగ్జరీ కార్లలో కాకుండా ఎద్దుల బండిపై వచ్చి ఊహించని షాకిచ్చాడు. కారణం ఏంటంటే.. గుజరాత్లో వరుడు ఎప్పుడూ ఎద్దుల బండిలో రావడం అనాదిగా వస్తున్న ఆచారం. గుజరాత్ సంస్కృతి ,సంప్రదాయాలతో పాటు ఆధునిక, సాంకేతికతతో నడిచే జీవనశైలిని ప్రదర్శించాలని వరుడు కోరుకున్నాడట. తన కుమారుడికి ఖరీదైన కార్లంటే ఇష్టమని, అందుకే ఊరేగింపులో రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల విలువైన కార్లను ఉపయోగించామని, అలాగే సంప్రదాయాన్నీ కొనసాగించినట్లు వరుడు తండ్రి తెలిపాడు. చదవండి వెరైటీ వంట: ప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు, ఈ బామ్మ ఎలా చేసిందో చూడండి! -
ఇదెక్కడి విడ్డూరం..! ఎద్దు మూత్రం పోసిందని కేసు పెట్టడమేంటి?
సాక్షి, ఖమ్మం: మనుషులే రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఓ ఎద్దు రోడ్డుపై మూత్రం పోసిందని అధికారులు కేసు పెట్టారు. యజమానికి కోర్టు రూ.100 ఫైన్ కూడా వేసింది. ఎద్దు ముత్రం పోస్తే ఫైన్ ఏంటని ఆలోచిస్తున్నారా? అవును నిజమే. ఈ విడ్డూరం భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే? సింగరేణి గనులకు పుట్టినిల్లు జిల్లాలోని ఇల్లందు పట్టణం. అక్కడే ఉండే సుందర్ లాల్ అనే ఓ రైతు తన ఎద్దుల బండిని కిరాయికి తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సింగరేణి జీఎం కార్యాలయానికి సమీపంలో నివస్తుండటంతో రోజూ ఆఫీసు ముందు నుంచి వెళ్తాడు. అయితే, ఒకరోజు జీఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసింది. దానిని గమనించిన అక్కడి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను అందించి ఎద్దుల యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు సుందర్ లాల్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ఎన్నడూ పోలీస్ స్టేషన్ ముఖం చూడని సుందర్ లాల్ భయం భయంగానే వెళ్లి ఏం జరిగిందని ఆరా తీయగా.. అసలు విషయం చెప్పారు. నీ ఎద్దు జీఎం ఆఫీసు ముందు మూత్రం పోసింది. గతంలోనూ నీ ఎద్దు ఇలానే చేసిందటా అని వెల్లడించారు. దీంతో సుందర్ లాల్ అవక్కయ్యాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారించిన న్యాయమూర్తి సుందర్‌లాల్‌కు రూ.100 జరిమానా విధించారు. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ రూ.100 ఇచ్చి ఫైన్ చెల్లించడం గమనార్హం. . అసలు విషయం వేరే ఉందా? రైతు సుందర్ లాల్‌ను ఇబ్బంది పెట్టడానికి వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ భూమికి సంబంధించి సింగరేణి నుంచి తనకు పరిహారం ఇవ్వాలని సుందర్ లాల్ డిమాండ్ చేస్తున్నారు. తన భూమిని బలవంతంగా తీసుకున్నారని, చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని సుందర్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. సాధారణంగా ఎద్దులు మూత్రం చేస్తుండగా నడవవని, తాను మూత్ర విసర్జన చేయమని చెప్పలేదన్నారు. సింగరేణి వల్ల తనకు అన్యాయం జరిగిందనే బ్యానర్లను ఎద్దుల బండికి కట్టి నగరంలో తిరుగుతున్నాడు సుందర్ లాల్. తమ సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు వాపోయాడు. తనకు న్యాయం చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టొద్దని ఆయన కూతురు విజ్ఞప్తి చేసిన ఓ వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హైదరాబాద్ పోలీస్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ! @CPHydCity @TelanganaDGP@shohumayunnagar @DCPCZHyd సాధారణ రైతు తన ఎడ్ల బండిని తోలుకుంటూ వెళ్తుంటే, ఎద్దు తమ ఆఫీస్ ముందు పాస్ పోసుకుందని, సింగరేణి యాజమాన్యం Brown మేనేజర్, ఆ రైతు మీద పోలీస్ కేసు నమోదు చేయించారట. తెలంగాణ (1/2) pic.twitter.com/pjlvgIHbuY — Vijay Gopal (@VijayGopal_) December 6, 2022 జీఎం ఏమన్నారంటే? సింగరేణి జీఎం ఎం షలీం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..‘2005లో జేకే-5 ఓపెన్ కాస్ట్ మైన్ కోసం భూములు తీసుకున్నాం. సుందర్ లాల్‌కు చెందిన కొంత భూమి అందులో ఉంది. పట్టాదారుకు భూసేకరణ అధికారులు నగదు చెల్లించారు. దీనిపై సుందర్ లాల్ కోర్టుల్లో కేసులు వేశారు. సుప్రీం కోర్టు సైతం ఆయన ఫిర్యాదును తోసిపుచ్చింది. అప్పటి నుంచి ఆఫీసు వద్ద ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. అధికారులు, పోలీసులు చెప్పినా వినకుండా అలానే ప్రవర్తిస్తున్నాడు.’ అని తెలిపారు జీఎం. మరోవైపు.. ఈ విషయం తెలిసిన జనాలు.. చేసే పనులు సరిగా చేయరు.. కానీ ఇలాంటి పనికి మాలిన విషయాల్లో అత్యుత్సాహం చూపడం ఏంటని చర్చించుకుంటున్నారు. #Telangana: Bull urinates at SCCL GM office, owner bookedhttps://t.co/16yO4iRn7n pic.twitter.com/NtR2fi4Are — TOI Hyderabad (@TOIHyderabad) December 6, 2022 ఇదీ చదవండి: సింగరేణి గనిలో కూలిన బండ -
ఎడ్ల బండ్లపై ఇసుక తరలింపు.. జాగ్రత్త సుమా!
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: సీతానగరం మండలంలో రాత్రిపూట ఎడ్ల బండ్లు(నాటుబళ్లు)తో ప్రయాణం చేస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై కె.నీలకంఠం హితవు పలికారు. ఈ మేరకు నాటుబళ్లతో రాత్రి పూట ప్రయాణం చేస్తున్న రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటుబళ్లతో ఇసుక తరలించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడం వల్ల బూర్జ, పెదంకలాం, లక్ష్మీపురం, చినభోగిలి, పెదభోగిలి, సీతానగరం, తామరఖండి అంటిపేట, వెంకటాపురం, నిడగల్లు, కాశీపేట, పణుకుపేట తదితర గ్రామాల్లో నాటుబళ్లు ఉన్న రైతులు సువర్ణముఖినదిలో రేవులనుంచి రాత్రిపూట ఇసుక తరలించి విక్రయాలు చేస్తున్నారన్నారు. రాత్రిపూట నాటుబళ్ల ప్రయాణం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాటుబళ్లు ఉన్న రైతులు బళ్లకు ‘రేడియం’ స్టిక్కర్లు విధిగా వాడాలని సూచించారు. రేడియం స్టిక్కర్లు అతికించడం వల్ల రాత్రిపూట ఎదురుగా రాక పోకలు చేస్తున్న భారీ వాహనాలకు నాటుబండి వస్తున్నట్లు తెలుస్తుంద న్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులున్న చోట భారీవాహనాల డ్రైవర్లు, నాటుబళ్లతో వెళ్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. -
బాజాభజంత్రీలతో పెళ్లి బృందం.. ఒక్కసారిగా షాక్.. కాడెద్దులు పరుగో పరుగు..
వెల్దుర్తి(కర్నూలు జిల్లా): బాజా భజంత్రీలతో వెళ్తున్న పెళ్లి బృందంపై కాడెద్దులు బండితో సహా పరుగుతీయడంతో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన రామళ్లకోటలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన సాలెవాళ్ల పెళ్లికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా పెళ్లి బృంద సభ్యులు గ్రామ సమీపాన గల పాలకొమ్ము, పుట్టమన్ను తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో బోయనపల్లెకు చెందిన రైతు తన ఎద్దులబండి (టైర్ల చక్రాలు కలిగిన బండి)లో వేరుశనగ కట్టె తీసుకువెళ్లేందుకు రామళ్లకోటకు వచ్చి వనం వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గల పంక్చర్ షాపు వద్ద టైర్లలో గాలి చెక్ చేసుకుంటున్నాడు. చదవండి: భర్త సంతకు తీసుకువెళ్లలేదని ఎంత పనిచేశావమ్మా.. ఆలయం పక్క నుంచి బాజాభజంత్రీలతో పెళ్లి బృందం ముందు వెళ్తుండగా కాడెద్దులు ఒక్కసారిగా బండితో సహా వెనుక నుంచి పరుగు లంఘించుకుంటూ వచ్చాయి. ఎదురుగా ఉన్న పెళ్లిబృందాన్ని ఢీకొట్టుకుంటూ దూసుకుని వెళ్లాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. కాడెద్దులు పరుగుపరుగున అరకిలోమీటరు దూరం వెళ్లిన తరువాత కాడి పట్టెలు తెగిపోయి బండి నుంచి విడిపోయాయి. అక్కడి నుంచి పొలాల వైపు పరుగుతీయడంతో వాటిని పట్టుకునేందుకు యజమానికి దాదాపు గంట సమయం పట్టింది. గాయపడిన ఇద్దరు మహిళలను చికిత్స కోసం వెల్దుర్తి ఆసుపత్రికి తరలించారు. -
మంచి మాస్టారికి.. మరపురాని సన్మానం
కేసముద్రం: అక్షరాలు దిద్దించి విజ్ఞానాన్ని పంచిన గురువులకు విద్యార్థుల మదిలో ఎల్లప్పుడూ ఉన్నత స్థానం ఉంటుంది. అమ్మ భాష తెలుగును బోధించే ఉపాధ్యాయుల పట్ల ఆదరాభిమానాలకు హద్దే ఉండదు. అందుకే తెలుగు మాస్టారంటే విద్యార్థులకు అంత ఇష్టం. అలాంటి ఉపాధ్యాయుడొకరికి విద్యార్థులు మరపురాని విధంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ‘మా దేవుడు మీరే మాస్టారు’ అంటూ గురువును విభిన్నంగా గౌరవించుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఓ ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేయనున్న సందర్భంగా ఆయనను మేళతాళాల మధ్య ఎడ్ల బండిపై ఊరేగించి విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని జెడ్పీఎస్‌ఎస్‌లో పంజాల సోమనర్సయ్య తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెలలో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రస్తుత, పూర్వ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులంతా కలిసి సోమవారం సన్మానం ఏర్పాటు చేశారు. సోమనర్సయ్య దంపతులను గ్రామపంచాయతీ నుంచి ఎడ్లబండిపై మేళతాళాల నడుమ ఊరేగింపుగా కిలోమీటర్ దూరంలోని పాఠశాల ఆవరణానికి తీసుకువచ్చి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ దార్ల రామమూర్తి, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు దికొండ యాకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: శభాష్.. తెలంగాణ పోలీస్!) -
ఎద్దుల బండిని తప్పించబోయి..
కోడుమూరు రూరల్: ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని తప్పించబోయి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని రామాపురం గ్రామం వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కోడుమూరుకు చెందిన చాకలి దస్తగిరి, బజారమ్మ పెద్ద కుమారుడు ధర్మతేజ (23) ఐటీఐ పూర్తి చేసి, ఎలక్ట్రీషియన్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. వెల్దుర్తిలో పని ముగించుకుని పట్టణానికి చెందిన స్నేహితుడు సతీష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై కోడుమూరు బయలుదేరాడు. మార్గమధ్యంలో రామాపురం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని తప్పించే క్రమంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడ్డారు. ప్రమాదంలో ధర్మతేజ తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతిచెందగా, సతీష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య జయలక్ష్మి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు వాసి మృతి.. కర్నూలు: స్థానిక బళ్లారి చౌరస్తా ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం హోసూరు గ్రామానికి చెందిన శివకుమార్(49) అక్కడికక్కడే మృతిచెందాడు. ఐచర్ వాహనంలో తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు వెళ్తూ మంగళవారం తెల్లవారుజామున కర్నూలు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ లారీని ఢీకొనడంతో ముందు భాగమంతా నుజ్జునుజ్జై అందులో శివకుమార్ ఇరుక్కుపోయి మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు. వాహనంలో ఇరుక్కుపోయిన శివకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఎడ్ల బండికి చలానా
న్యూఢిల్లీ: సవరించిన మోటారు వాహనాల చట్టం కింద నిబంధనల అతిక్రమణకు భారీ జరిమానాలు విధిస్తుండటం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. సోమవారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో భారీ చలాన్లపై ప్రజలు తీవ్ర ఆందోళన చేశారు. వారి నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఉత్తరాఖండ్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తుండటంతో ఆగ్రహం చెందిన డెహ్రాడూన్‌లోని చార్బా గ్రామ రైతులు రెండు మోటార్‌సైకిళ్లను తగులబెట్టారు. కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు తమపై భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు రైతులు ఆరోపించారు. చార్బా గ్రామానికి చెందిన రియాజ్ హసన్ అనే ఎడ్ల బండి యజమానికి పోలీసులు రూ. వెయ్యి చలానా విధించడంతో రైతుల్లో ఆగ్రహం మొదలైంది. అయితే వాహన చట్టంలో ఎడ్లబండికి చలానా విధించే నిబంధన లేదని తెలుసుకున్న పోలీసుల నాలిక్కరుచుకున్నారు. అనంతరం చలాన్ రద్దు చేసినప్పటికీ, రైతుల్లో ఈ విషయం తీవ్ర ఆవేదన కలిగించింది. భారీ చలాన్లపై రైతులు సోమవారం రోడ్డెక్కడంతో నిరసన హింసాత్మకంగా మారింది. -
అంతర్రాష్ట్ర వంతెనపై ఎడ్లబండి సవారీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచకు వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్లబండిపై సవారి చేస్తూ అంతర్రాష్ట్ర వంతెనపై ఓ రైతు కనిపించాడు. వంతెన పై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రయ్..రయ్ మంటు తిరుగుతుంటాయి. ఇలా ఎడ్లబండిపై రైతు ప్రత్యక్షమవడంతో పలువురు ఆశ్చర్యంగా తిలకించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వంతెన పై మధ్యలో ఎడ్లబండితో రైతు పలువురిని ఆకట్టుకున్నాడు. -
ప్రాణభిక్ష
మద్దికెర : నీటిలో మునిగిపోతున్న ఎద్దులను, రైతుకుటుంబాన్ని అయ్యప్పమాలదారులు కాపాడారు. మండలకేంద్రం మద్దికెరలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురిశాయి. దీంతో పొలంలో విత్తనం వేసేందుకు రైతు వెంకటేశులు కుటుంబంతో కలిసి ఎద్దుల బండిపై బయలుదేరాడు. మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద దాదాపు నాలుగు అడుగుల లోతు నీరు నిలిచి ఉంది. మరో మార్గం లేకపోవడంతో అలాగే ముందుకు సాగాడు. మధ్యలోకి వెళ్లిన తర్వాత ఎడ్లు ముందుకు పోలేక బండిని వదిలేశాయి. భయాందోళనకు గురైన రైతు గట్టిగా కేకలు వేయడంతో పక్కన మల్లప్ప దేవాలయంలో ఉన్న అయ్యప్పమాలదారులు భీమరాజు, ప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు వచ్చి బాధిత రైతుకుటుంబాన్ని, ఎడ్లను, బండిని బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలో అయ్యప్పభక్తులు లేకుంటే ప్రాణపాయం జరిగేదని రైతు వెంకటేశులు తెలిపాడు. అవగాహన లేకుండా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించడంతో వానాకాలంలో ఈ మార్గంగుండా వెళ్లాలంటే రైతులకు ఇబ్బందిగా మారింది. -
నీటి కోసం వెళ్లి..
చిప్పగిరి: దౌల్తాపురం గ్రామంలో ఏర్పడిన నీటి ఎద్దడితో ప్రజల కష్టాలు పడుతుండటంతో పాటు ప్రమాదానికి గురవుతున్నారు. గ్రామానికి చెందిన రామగోవిందు గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో నీటికోసం ఓ వ్యవసాయ బోరు వద్దకు ఎద్దులబండిని కట్టుకొని ఖాళీ డుమ్ములతో వ్యవసాయ తోట వద్దకు వెళ్లాడు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో ఒక్కసారిగా ఎద్దులబండి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎద్దులబండి చక్రాలు రామగోవిందు వీపుపై వెళ్లడంతో స్పృహ తప్పిపడిపోయాడు. గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాయపడిన రామగోవిందును అక్కడి నుంచి చికిత్స కోసం గుంతకల్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. -
‘బండెడు’ కష్టాలు
-
ఎడ్ల బళ్లపై టూర్
-
ఇసుక కోసం ఎడ్లబండ్లా!
సొంత అవసరాలకు ఎడ్లబండ్లలోనే ఇసుక తీసుకెళ్లాలన్న షరతుపై ప్రజల్లో ఆగ్రహం ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడా కనిపించని ఎడ్లబండ్లు ఇప్పుడు ఇసుకకోసం వాటిని తయారు చేయించుకోవాలా? ఎడ్లను ఎక్కడ తెచ్చుకోవాలని మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఇల్లు కట్టుకోవడం, మరుగుదొడ్డి నిర్మాణం లాంటి సొంత అవసరాలకు రేవులనుంచి ఇసుకను తెచ్చుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన తాజా షరతుపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సొంత అవసరాల కోసం ఎడ్లబండ్లలోనే ఇసుకను తీసుకెళ్లాలన్న ఈ షరతు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకను తెచ్చుకునేందుకు ఇప్పుడు ఉన్నట్టుండి ఎడ్లబండ్లను కొనుక్కోవాలా? అని గ్రామీణ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇసుకకోసం ఎడ్లబండ్లను తయారు చేయించుకోవాలా? బండ్లు లాగేందుకు ఎడ్లను ఎక్కడ తెచ్చుకోవాలి? వాటికి పశుగ్రాసం ఎక్కడ తేవాలి? ఎడ్లను ఇప్పటికిప్పుడు పుట్టిస్తారా? అంటూ పేద, మధ్య తరగతి ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ సర్కారు ఇసుక ధరను భారీగా పెంచిన నేపథ్యంలో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, బలహీన వర్గాలవారు ఇసుక కొనలేక ఇళ్ల నిర్మాణాల స్వస్తి చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానికులు సొంత వినియోగంకోసం అధికారుల నుంచి పర్మిట్లు తీసుకుని.. సీనరేజి ఫీజు చెల్లించి వాగులు, వంకలు లాంటి థర్డ్ ఆర్డర్ క్వారీల(రేవుల) నుంచి ఇసుకను తీసుకెళ్లే వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం తాజాగా రూపొందించిన ఇసుక పాలసీలో పేర్కొంది. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ వెసులుబాటు ఉంది. టీడీపీ వచ్చాక డ్వాక్రా సంఘాలకు ఇసుక విక్రయ బాధ్యతలు అప్పగించినప్పుడు దీన్ని తొలగించింది. విమర్శల నేపథ్యంలో కొత్త పాలసీ లో ఈ వెసులుబాటును మళ్లీ కల్పించిన ప్రభుత్వం ఎడ్లబండ్లలోనే ఇసుక తీసుకెళ్లాలనే మెలిక పెట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘ఇది ఒక చేత్తో నీటి చెంబిచ్చి నోటితో కాకుండా ముక్కుతోనే తాగాలని ముల్లుకర్ర పట్టుకుని చెప్పినట్టుగా ఉంది’ అని ప్రజలతోపాటు వివిధ శాఖల అధికారులూ అంటుండడం గమనార్హం. ఎడ్లబండ్లు ఎక్కడున్నాయ్? ప్రస్తుతం పల్లెల్లో ఎడ్లబండ్లు బాగా తగ్గిపోయాయి. అత్యధిక రైతుల ఇళ్లల్లో దాదాపుగా ఎడ్లు, ఎడ్లబండ్లు లేనేలేవు. దుక్కి దున్నడం మొదలు ఎరువు తోలడం, వ్యవసాయ ఉత్పత్తులను ఇళ్లకు తరలించడం లాంటి అన్ని పనులకు రైతులు ట్రాక్టర్లనే వినియోగిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వమూ వ్యవసాయానికి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, యాంత్రీకరణ పెంచుకోవాలని చెబుతోంది. ఇదేబాటలో రైతులు కూడా ఎడ్లకు, ఎడ్లబండ్లకు స్వస్తి చెప్పి అన్ని అవసరాలకు ట్రాక్టర్లనే వాడుతున్నారు. దీంతో ఎడ్లబండ్లు, ఎడ్లు దాదాపుగా కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లు వాడాలని నిబంధన పెట్టడం వెనుక అంతరార్థమేమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక అవసరాలకు సైతం తక్కువ వ్యయంతో ఎవరూ ఇసుక తీసుకెళ్లేందుకు ఆస్కారం లేకుండా చేయడం.. క్యూబిక్ మీటరు ఇసుకను తప్పనిసరిగా రూ.500కు కొనేలా చేయడమే దీని వెనకున్న పరమార్థమని అధికారులే చెబుతున్నారు. -
ఎడ్లబండిని ఢీకొని ఇంజినీర్ మృతి
పుల్కల్ (మెదక్) : జీవనోపాధి కోసం వచ్చిన ఒక సివిల్ ఇంజినీర్ ప్రమాదవశాత్తు ఎద్దుల బండిని ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి మండల పరిధిలోని పెద్దారెడ్డిపేటలో చోటుచేసుకుంది. నల్ల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలం రామన్నగూడెంకు చెందిన గుడుమల్ల సైదులు(37) మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి శివారులోని సింగూర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న వాటర్ గ్రిడ్ పథకంలో ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ వద్ద సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. కాగా, ఆయన పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం సింగూర్‌కు వెళ్లి తిరిగి 7.30 గంటల ప్రాంతంలో తన బైక్‌పై వస్తుండగా పెద్దారెడ్డిపేటలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఎడ్ల (దున్నపోతుల) బండిని ఢీకొట్టి తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. సైదులుకు తల్లి, భార్య యశోదతో పాటు ఇద్దరు కుమారులున్నారు. -
ఎడ్లబండిపై అసెంబ్లీకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు
-
ఇనుప చక్రంతో రోడ్డెక్కితే రంగు పడుద్ది
కేజ్‌వీల్ ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు ఇక జప్తు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు {పభుత్వ ఆదేశం తీవ్రంగా దెబ్బతింటున్న రోడ్లు కొత్త రోడ్ల నిర్మాణం నేపథ్యంలో కఠినంగా వ్యవహరించనున్న సర్కార్ హైదరాబాద్: ఇనుప పట్టాతో ఉన్న ఎడ్ల బండి రోడ్డెక్కితే ఇక ఎడ్లు, బండి రెండూ పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు త్వరలో స్పష్టమైన ఆదేశాలు అందనున్నాయి. పొలం పనులకు వాడే కేజ్ వీల్స్ (ఇనుప చట్రాల చక్రాలు) ఉన్న వాహనాల వల్ల రోడ్లు పాడవుతుండటంతో నేరుగా రోడ్లపై తిరగకూడదనే నిబంధనను కఠినతరం చేసే క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 వేల కోట్ల వ్యయంతో కొత్తగా రోడ్లు నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు కఠినంగా వ్యవహరించనుంది. మంగళవారం మధ్యాహ్నం రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ ఉన్నతాధికారులతో దీనిపై చర్చించారు. ఐదేళ్లు మనాల్సిన రోడ్లు రెండేళ్లకే నాశనం కేజ్ వీల్స్ బిగించిన ట్రాక్టర్లు, ఇనుప పట్టాలున్న ఎడ్ల బండ్ల మూలంగా ఐదేళ్లు మనాల్సిన రోడ్లు కాస్తా రెండేళ్లకే పూర్తిగా దెబ్బతింటున్నాయి. దీంతో వాటి మరమ్మతుకు కొత్త రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చు చేయాల్సి వస్తోంది. అసలే కాంట్రాక్టర్లు అంతంతమాత్రం నాణ్యతప్రమాణాలను పాటిస్తుండటంతో రోడ్లు ఎక్కువకాలం మన్నటం లేదు. ఎడ్లబండ్లకూ టైర్లు... రైతులు వ్యవసాయ పనుల సమయంలో మాత్రమే ఎడ్లబండ్లకు కేజ్ వీల్స్ ఏర్పాటు చేసి ఆ తర్వాత వాటిని తొలగించి సాధారణ టైర్లను బిగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక చెరుకు పంట ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో చెరుకు తరలించే సమయంలో ఎడ్లబండ్లు భారీగా రోడ్లెక్కుతున్నాయి. దీనిపై రైతుల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. ఒకసారి చెప్పినా మళ్లీ ఆ వాహనం రోడ్డెక్కితే సీజ్ చేయాలని ఆదేశాలివ్వనుంది. వెంటనే ఇది అమలులోకి రాబోతోంది. -
ఎలుగుబంటి దాడిలో వృద్ధుడి మృతి
వేమనపల్లి: వంట చెరకు కోసం అడవికి వెళ్లిన వృద్ధుడిపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలంలోని జాజులపేట గ్రామానికి చెందిన కోండ్ర ముత్తయ్య(65) శుక్రవారం ఎడ్లబండితో అటవీ ప్రాంతానికి వంట చెరకు కోసం వెళ్లాడు. ఒక చోట బండి నిలిపి, ఎండిన కట్టెలు జమచేస్తున్నాడు. అటుగా వచ్చిన పిల్లల ఎలుగుబంటి ముత్తయ్యపై పైశాచికంగా దాడి చేసింది. ముత్తయ్య ప్రతిగా గొడ్డలితో దాడిచేసినా ఎలుగుబంటి వదిలిపెట్టలేదు. రాత్రి వరకూ ముత్తయ్య రాకపోయేసరికి కుటుంబ సభ్యులు శనివారం అటవీ ప్రాంతంలో గాలించారు. కల్వలగెర్రె ప్రాంతంలోని ఒర్రెలో ముత్తయ్య శవమై కనిపించాడు. -
ఎడ్లబండికి బ్రేకులొచ్చాయి !
ప్రయోగం బైకు మోడల్లో సంతోష్ ఎద్దుల బండికి బ్రేకు కనిపెట్టాడు. బండి తోలే వ్యక్తి కూర్చునే దగ్గరే ఆ బ్రేకు ఉంటుంది. ఇది ఎద్దుకు, మనిషికి సులువుగా ఆపడానికే కాకుండా కాస్త ఏటవాలుగా ఉన్నచోట కూడా బండిని వెనక్కు రాకుండా ఆపుచేయడానికీ తోడ్పడుతుంది. వైఫల్యాలు ఉన్నాయంటే ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్థం. ఏదో ఒక ప్రయత్నం చేసేవారు ఆశాజీవులు. పని చేసి సాధించేవారు సమర్థులు. అందరికోసం కష్టపడి, తనతో పాటు అందరికీ పని సులువు చేసేవారు మార్గదర్శి. అవసరమే అన్నింటినీ నేర్పిస్తుందంటారు. ఆ మాటను నిజం చేసిన కుర్రాడు సంతోష్. ఊళ్లలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సైకిలు తొక్కాం, బైకుల్లో తిరిగాం.... కార్లు కూడా తెచ్చుకున్నాం. కానీ ఇంతకాలం... ‘అరె వీటన్నింటికీ ఉన్న బ్రేకులు అదే చక్రాల మీద నడిచే ఎద్దుల బండికి ఎందుకు లేవు’ అని ఎవరైనా ఆలోచించారా? లేదు... కానీ కర్ణాటకలోని బెల్గాంకు చెందిన సంతోష్ ఆలోచించాడు. ఉత్తినే ఆలోచించి కూర్చోలేదు, ఆలోచనకు రూపం తెచ్చి సక్సెస్ అయ్యాడు. ఇపుడు ఎద్దుల బండికీ బ్రేకులొచ్చాయి. చిత్రమేంటంటే సంతోష్ శాస్త్రవేత్త కాదు, ఓ చిన్న కుర్రాడు. అతి సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడు. ప్రతి పల్లెలో చిరు రైతు కుటుంబంలో పిల్లలకు చదువుతో పాటు పనిచేయడం తప్పదు. పైగా ఇష్టమైన కోర్సులు చదువుకునే అవకాశం కూడా ఉండదు. అంతెందుకు బస్సుకు టిక్కెట్లు లేక నడుచుకుంటూ వెళ్లి చదవుకునే వాళ్లింకా అక్కడక్కడా ఉన్నారు. సంతోష్ కూడా దాదాపు అలాంటి పరిస్థితిలో ఉన్న వాడే. ఉంటే బడిలో, లేకుంటే పొలంలో. రెండింటిపైన ఆసక్తి ఉంది. అందుకే దేనికీ తప్పేవాడు కాదు. కానీ, ఊరికే పొట్టకూటి కోసం మాత్రమే సంతోష్ పనిచేయకుండా కాస్త సునిశితంగా ఆలోచిస్తూ వచ్చాడు. వ్యవసాయ కుటుంబాల్లో చిన్న రైతులు పడే ఇబ్బందులు చూస్తూ పెరిగాడు. వాటికి ఒక్కోదానికి అతను పరిష్కారాలు కనుక్కుంటూ వచ్చాడు. ఎద్దుల బండిని ఆపాలంటే బండిని లాగే ఎద్దుల ముక్కులకు కట్టిన తాడును గట్టిగా లాగితే అవి నొప్పి కలిగి ఆగిపోతాయి. ఇది తోలే రైతుకు, లాగే ఎద్దుకు ఇద్దరికీ కష్టమే. బైకు మోడల్లో సంతోష్ దీనికి బ్రేకు కనిపెట్టాడు. బండి తోలే వ్యక్తి కూర్చునే దగ్గరే ఆ బ్రేకు ఉంటుంది. ఇది ఎద్దుకు, మనిషికి సులువుగా ఆపడానికే కాకుండా కాస్త ఏటవాలుగా ఉన్నచోట కూడా బండిని వెనక్కు రాకుండా ఆపుచేయడానికీ తోడ్పడుతుంది. అలాగే సరుకు నింపుతున్నపుడు, మిట్టలు ఎక్కుతున్నపుడు రకరకాలుగా ఉపయోగపడుతుంది. సంతోష్ మరో ఇన్వెన్షన్ క్యారెట్ క్లీనింగ్ మెషీన్. క్యారెట్ నేలలో పండే దుంప. దానికి మట్టి ఉంటుంది. అది క్లీన్ చేసే అమ్మాలి. క్వింటాలు క్యారెట్ శుభ్రం చేయాలంటే పన్నెండు మందికి గంట పడుతుంది. సంతోష్ కనిపెట్టిన యంత్రం వల్ల ఆ పనిని పది నిమిషాల్లో ఇద్దరు చేసేయొచ్చు. దీనికి కరెంటు అవసరం లేదు. ఖరీదు కూడా తక్కువే. దీనిని ఇప్పటికే బెల్గాం చుట్టుపక్కల రైతులు పెద్ద సంఖ్యలో కొన్నారు. వీటితో పాటు గ్యాసును వృథా చేయకుండా నీళ్లు వేడిచేసే విధానం కనిపెట్టాడు సంతోష్. అంటే గ్యాసు స్టౌతో వంట చేసుకుంటూనే అదే వేడిని నీటిని కాచడానికి కూడా వాడేస్తున్నాడు. దీనిని బెల్గాం హాస్టళ్లలో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. ఒకప్పుడు సంతోష్ అంటే ఎవరికీ తెలియదు, ఇపుడు బెల్గాం పరిసరాల్లో సంతోష్ అంటే తెలియని వారే లేరు. అతను నమ్మేది ఒకటే విషయం... సమస్య ఎప్పుడూ మనలోని శక్తిసామర్థ్యాలను వెలికితీయడానికే వస్తుంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుంటానంటాడు సంతోష్. ఇబ్బందులను మెట్లుగా మలచుకునే సంతోష్‌ను..భేష్ అని మెచ్చుకోవాల్సిందే. -
వర్ణం: దేశం, వేడుక వేరు... అలంకరణ ఒక్కటే!
మన వద్ద జట్కాలు వేరు, ఎద్దుల బళ్లు వేరు. ఈ రొమేనియా వ్యక్తిని చూడండి... ఎద్దుల బండిని గుర్రంతో లాగించేస్తున్నాడు. వారి బండి ఇదే. రొమేనియాలో ఇప్పటికీ గుర్రాలను రవాణాకు, వ్యవసాయంలో విరివిగా వాడతారు. ఈ చిత్రం... అక్కడ జరిగే ఉత్సవంలోనిది. వేడుకల్లో గుర్రాలను ఇలా అందంగా అలంకరిస్తారు. పక్కన ఇంకో గుర్రాన్ని చూశారా... దాని తోకకు జడ వేసి, రిబ్బను కూడా కట్టారు! ఈ ఉత్సవం అక్కడ ఒక సంప్రదాయం... చివర్లో ఈ గుర్రాలకు పవిత్ర జలంతో స్నానం చేయించడంతో వాటికి దీవెనలు అందుతాయని నమ్మకం. ఈ మొక్కకు ప్రేయర్ తెలుసు.. అందంగా ఉన్న ఈ మొక్కను చూశారా. ఇది ఇళ్లలో పెంచుకోవడానికి ఒక మంచి మొక్క అట. పగలంతా విశాలంగా ఉండే ఈ మొక్క ఆకులు సాయంత్రం కాగానే మనం దేవుడిని నమస్కరించేటపుడు చేతులు ఎలా పెడతామో అలా మారిపోతాయి. అందుకే దీనికి ప్రేయర్ ప్లాంట్ అని పేరొచ్చింది. బ్రెజిల్‌లోని దట్టమైన రెయిన్ ఫారెస్ట్‌లో పెరిగే మొక్క కావడం వల్ల ఇంట్లో ఎండ తగలని చోట పెట్టినా ఈ మొక్క బతుకుతుంది. మొక్కలకు ప్రాణంతో పాటు భక్తి కూడా ఉందా ఏంటి?! భద్రత.. శ్రద్ధ... ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో జపాన్ ప్రభుత్వం తన ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఫిట్నెస్ను చెక్ చేస్తుందట. అందులో ఇలాంటి విన్యాసాలు బోలెడు. ప్రభుత్వ అగ్నిమాపక శాఖ, ఎడో ఫైర్‌మెన్‌షిప్ అసోషియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సిబ్బంది చేసిన విన్యాసాల నుంచి తీసిన ఓ దృశ్యం ఇది. -
తిరగబడిన ఎడ్ల బండి; భార్యాభర్తల మృతి
వరంగల్ జిల్లాలో జరిగిన ఓ దుర్ఘటనలో భార్యాభర్తలు ఇద్దరూ మరణించారు. శ్యాంపేట మండలం సాధన పల్లిలో ఎడ్లబండి చెరువులో తిరగబడింది. ఎడ్లబండిలో వెళ్తున్న భార్యాభర్తలు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. భార్యాభర్తలు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.