నీటి కోసం వెళ్లి..
Published Sat, May 6 2017 12:36 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
చిప్పగిరి: దౌల్తాపురం గ్రామంలో ఏర్పడిన నీటి ఎద్దడితో ప్రజల కష్టాలు పడుతుండటంతో పాటు ప్రమాదానికి గురవుతున్నారు. గ్రామానికి చెందిన రామగోవిందు గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో నీటికోసం ఓ వ్యవసాయ బోరు వద్దకు ఎద్దులబండిని కట్టుకొని ఖాళీ డుమ్ములతో వ్యవసాయ తోట వద్దకు వెళ్లాడు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో ఒక్కసారిగా ఎద్దులబండి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎద్దులబండి చక్రాలు రామగోవిందు వీపుపై వెళ్లడంతో స్పృహ తప్పిపడిపోయాడు. గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాయపడిన రామగోవిందును అక్కడి నుంచి చికిత్స కోసం గుంతకల్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement