హెలికాప్టర్‌ వద్దన్నందుకు.. ఎడ్లబండిలో వచ్చి నామినేషన్‌ | Independent Candidate Of Samstipur Filed Nomination Came On Bullock Cart | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌ వద్దన్నందుకు.. ఎడ్లబండిలో వచ్చి నామినేషన్‌ దాఖలు

Published Fri, Apr 26 2024 6:02 PM | Last Updated on Fri, Apr 26 2024 7:29 PM

Independent Candidate Of Samstipur Filed Nomination Came On Bullock Cart

పాట్నా:ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలడంతో పాటు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా నామినేషన్‌ పర్వంలోనైతే అభ్యర్థులు తమ బలాబలాలను ప్రదర్శిస్తుంటారు.

ఈ క్రమంలోనే ఆసక్తికర ఘటనలు, పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ఇదే తరహాలో బిహార్‌లోని సమస్తిపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఒకరు  నామినేషన్‌ వేసేందుకు హెలికాప్టర్‌లో వస్తానని అధికారులను అనుమతి అడిగారు. 

హెలికాప్టర్‌లో వచ్చి నామినేషన్‌ వేసేందుకు స్వతంత్ర అభ్యర్థి అమ్రేష్‌రాయ్‌కి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన హెలికాప్టర్‌  నుంచి ఏకంగా ఎడ్లబండి రేంజ్‌కు వచ్చేశారు.

ఎడ్లబండిలో ఊరేగింపుగా వచ్చి డ్యాన్సులతో హోరెత్తించి నామినేషన్‌ దాఖలు చేశారు. హెలికాప్టర్‌కు అనుమతివ్వనందుకే తాను ఎడ్లబండిలో వచ్చి నామినేషన్‌ వేశానని అమ్రేష్‌రాయ్‌ చెప్పారు.  

ఇదీ చదవండి.. పొలిటికల్‌ ఎంట్రీపై డీకే శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement