Samastipur
-
సమస్తిపూర్ కుస్తీ.. మంత్రుల వారసుల ఫైట్
పాట్నా: బిహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది. రాష్ట్రంలోని నితీష్ కుమార్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల వారసులు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.సమస్తిపూర్ ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఈ నియోజకవర్గం దివంగత సోషలిస్ట్ నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ జన్మస్థలం. సోషల్ ఇంజనీరింగ్ మాస్టర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కర్పూరి ఠాకూర్‌కు భారత ప్రభుత్వం ఇటీవలే భారతరత్న అవార్డును ప్రకటించింది. ఠాకూర్ 1977లో సమస్తిపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.బీహార్ గ్రామీణ పనుల శాఖ మంత్రి అశోక్ చౌదరి కుమార్తె 25 ఏళ్ల శాంభవి చౌదరి లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) -LJP (RV) నామినేషన్‌పై ఎన్డీఏ అభ్యర్థిగా సమస్తిపూర్ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి సోషియాలజీలో ఎంఏ పట్టా పొందిన శాంభవి.. ఈసారి పోటీ చేస్తున్న పార్లమెంటు అభ్యర్థుల్లో ఈమే అత్యంత పిన్న వయస్కురాలు.ఇక ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా 33 ఏళ్ల సన్నీ హజారీ పోటీ చేస్తున్నారు. ఈయన కూడా నితీష్ కుమార్ ప్రభుత్వంలో సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా ఉన్న మహేశ్వర్ హజారీ కుమారుడు. ఎన్ఐటీ పాట్నా నుంచి బీటెక్ పూర్తి చేసిన సన్నీ సమస్తిపూర్‌లో సొంత వ్యాపారాన్ని నడుపుతున్నారు.అభ్యర్థులిద్దరూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోడ్‌షోలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తన కూతురి గెలుపు కోసం శాంభవి తండ్రి, రాష్ట్ర మంత్రి అశోక్ చౌదరి శ్రమిస్తుండగా సన్నీ తండ్రి, బీహార్ మంత్రి మహేశ్వర్ హజారీ ఇంకా తన కుమారుడికి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. సమస్తీపూర్ నియోజకవర్గంలో మే 13న పోలింగ్ జరగనుంది. -
Lok Sabha Election 2024: జేడీయూ వర్సెస్ జేడీయూ!
సమస్తిపూర్. బిహార్ దివంగత సీఎం, భారతరత్న కర్పూరీ ఠాకూర్ జన్మస్థలం. ఈ నెల 13న నాలుగో విడతలో పోలింగ్ జరగనున్న ఎస్సీ రిజర్వుడ్ లోక్‌సభ స్థానం. కాంగ్రెస్ నుంచి సన్నీ హజారీ, లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) తరఫున శాంభవి కునాల్ చౌదరి తలపడుతున్నారు. ఇందులో విశేషం ఏముందంటారా? వీరి తండ్రులిద్దరూ అధికార పక్షమైన జేడీ(యూ) నేతలు! పైగా రాష్ట్ర మంత్రులు!! జేడీ(యూ) చీఫ్, సీఎం నితీశ్‌కుమార్ శాంభవికి మద్దతుగా నిలుస్తుంటే మంత్రి అయిన సన్నీ తండ్రి మాత్రం కుమారుని కోసం ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు...! బిహార్‌లో ఇటీవలి దాకా కాంగ్రెస్, ఆర్జేడీ దన్నుతో సీఎంగా కొనసాగిన నీతిశ్ ఎన్నికల ముందు వాటికి గుడ్‌బై చెప్పడం, ఎన్డీఏ గూటికి చేరి కురీ్చని కాపాడుకోవడం తెలిసిందే. బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష ఇండియా కూటములు ఈ లోక్‌సభ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడుతున్నాయి. కానీ జేడీ(యూ) నేత, రాష్ట్ర మం్రత్రి మహేశ్వర్ హజారీ మాత్రం తన కుమారుని కోసం కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ ప్రచారం చేస్తుండటం విశేషం. ఆయన లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు దివంగత రాం విలాస్ పాశ్వాన్‌కు బంధువు కూడా! సమస్తిపూర్‌లో దాపు 17.5 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 20 శాతం ఎస్సీలే. కుశ్వాహ, యాదవుల వంటి ఓబీసీలూ ఎక్కువే. ముస్లిం ఓటర్లు 13 శాతమున్నారు. ఇక్కడ గ్రామీణ ఓటర్లే 95 శాతం. 2014, 2019ల్లో ఎల్జేపీ తరఫున రామ్ విలాస్ పాశ్వాన్ తమ్ముడు రామచంద్ర పాశ్వాన్ గెలుపొందారు. ఆయన హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కుమారుడు ప్రిన్స్ రాజ్ విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం పశుపతి పార్టీ ఆర్ఎల్జేపీలో ఉన్నారు.శాంభవి.. మరో మంత్రి గారమ్మాయి!ఇక ఎల్జేపీ (రాం విలాస్) అభ్యర్థి శాంభవి తండ్రి అశోక్ చౌదరి కూడా మంత్రిగా జేడీ(యూ) సర్కారులో కీలక శాఖలు చూస్తున్నారు. 25 ఏళ్ల శాంభవి ఈ సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉన్న అత్యంత పిన్న వయసు్కరాలు. అయితే ఆమెకు టికెటివ్వడంతో పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్‌పై నేతల్లో అసంతృప్తి భగ్గుమంది. నిరసనగా పలువురు రాజీనామా కూడా చేశారు! పైగా ఆమె నాన్‌లోకల్ అంటూ కాంగ్రెస్ ప్రచారం హోరెత్తిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ)కు దెబ్బ తీసి 48 స్థానాలకు పరిమితం చేయడంలో చిరాగ్ది కీలక పాత్ర. ఎందుకంటే పాశ్వాన్ మరణానంతరం ఆయన సోదరుడు పశుపతి పరాస్, కుమారుడు చిరాగ్ మధ్య నితీశ్ చిచ్చురేపారు. ఎల్జేపీ పశుపతి పరమయ్యేలా చేశారు. ఈ ఎపిసోడ్లో మహేశ్వర్ హజారేది కూడా కీలక పాత్రే. కాంగ్రెస్ సన్నీకి టికెట్ ప్రకటించగానే, తమ కుటుంబంలో చిచ్చు పెట్టింది హజారీయేనంటూ చిరాగ్ మండిపడ్డారు కూడా!నితీశ్ దన్ను! సమస్తిపూర్ తన మెట్టినిల్లంటూ నాన్‌లోకల్ ప్రచారాన్ని శాంభవి తిప్పికొడుతున్నారు. మోదీ ఫ్యాక్టర్ కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. నితీశ్ కూడా ఆమెకు మద్దతిస్తున్నారు! పోల్ మేనేజ్మెంట్లో ఆరితేరిన పార్టీ ఎంపీ, కర్పూరీ ఠాకూర్ కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్‌ను శాంభవికి దన్నుగా రంగంలోకి దించారాయన. సమస్తిపూర్‌లో మెజారిటీ ప్రజలు పాశ్వాన్ నిజమైన రాజకీయ వారసునిగా చిరాగ్‌నే చూస్తుండటం శాంభవికి కలిసొచ్చే అంశం. మొత్తానికి సమస్తిపూర్ లోక్‌సభ ఎన్నిక జేడీ(యూ) మంత్రుల మధ్య పోరాటానికి వేదికగా మారిందని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
హెలికాప్టర్ వద్దన్నందుకు.. ఎడ్లబండిలో వచ్చి నామినేషన్
పాట్నా:ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలడంతో పాటు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా నామినేషన్ పర్వంలోనైతే అభ్యర్థులు తమ బలాబలాలను ప్రదర్శిస్తుంటారు.ఈ క్రమంలోనే ఆసక్తికర ఘటనలు, పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ఇదే తరహాలో బిహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన్ వేసేందుకు హెలికాప్టర్లో వస్తానని అధికారులను అనుమతి అడిగారు. హెలికాప్టర్లో వచ్చి నామినేషన్ వేసేందుకు స్వతంత్ర అభ్యర్థి అమ్రేష్రాయ్కి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన హెలికాప్టర్ నుంచి ఏకంగా ఎడ్లబండి రేంజ్‌కు వచ్చేశారు.ఎడ్లబండిలో ఊరేగింపుగా వచ్చి డ్యాన్సులతో హోరెత్తించి నామినేషన్ దాఖలు చేశారు. హెలికాప్టర్‌కు అనుమతివ్వనందుకే తాను ఎడ్లబండిలో వచ్చి నామినేషన్ వేశానని అమ్రేష్రాయ్ చెప్పారు. ఇదీ చదవండి.. పొలిటికల్ ఎంట్రీపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు -
Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిహార్ నుంచి 25 ఏళ్ల శాంభవి చౌదరి ఎన్నికల్లో పోటీ చేయనుంది. దేశంలో అతి చిన్నవయసు మహిళా దళిత అభ్యర్థిగా శాంభవి వార్తల్లో నిలిచింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా తాను వేయదగ్గ ముద్ర... తనదైన దృష్టికోణం ఉన్నాయంటున్నది శాంభవి. ‘నేను పనిచేసే చోట స్త్రీలు, యువతే నా లక్ష్యం. వీరికి ఆర్థిక స్వావలంబన, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తే అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది’ అంటోంది శాంభవి చౌదరి. 25 ఏళ్ల 9 నెలల వయసు వున్న ఈ డాక్టరెట్ స్టూడెంట్ బిహార్‌లోని ‘సమస్తిపూర్’ పార్లమెంట్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తరఫున పోటీ చేయనుంది. ఇది రిజర్వ్డ్ స్థానం. బహుశా శాంభవి దేశంలోనే అత్యంత చిన్న వయసు కలిగిన దళిత మహిళా అభ్యర్థి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. అందుకే అందరూ ఆమెవైపు ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎం.ఏ. సోషియాలజీ చేసి ఇప్పుడు ‘బిహార్ రాజకీయాల్లో కులం, జెండర్ ప్రాధాన్యత’ అనే అంశం మీద పీహెచ్డీ చేస్తున్న శాంభవి రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి అశోక్ కుమార్ చౌదరి జెడి (యు)లో మంత్రి. తాత మహదేవ్ చౌదరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేశారు. శాంభవి భర్త సాయన్ కునాల్ సామాజిక రంగంలో ఉన్నాడు. ఈమె మామగారు మాజీ ఐ.పి.ఎస్ అధికారి ఆచార్య కిశోర్ కునాల్ దళితుల కోసం చాలా పోరాటాలే చేశాడు. చాలా గుడులలో దళిత పురోహితులను ఆయన నియమించాడు. వీరందరి మధ్యలో చదువు మీద దృష్టి పెట్టి, పరిశోధన కొనసాగిస్తున్న శాంభవి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో దిగింది. నాకంటూ వ్యక్తిత్వం ఉంది శాంభవి పోటీ చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఎన్డిఏ కూటమిలో ఉంది. బిజెపి కుటుంబ వారసత్వం గురించి అభ్యంతరం చెప్పడం తెలిసిందే. ‘మీ నాన్నగారు మంత్రి. మరి మీకు సీటిచ్చారు’ అనే ప్రశ్నకు ‘నిజమే. కాని నాకు సీటు రావడంలో ఆయన ప్రమేయం మాత్రం లేదు. చిన్నప్పటి నుంచి నేను మా తాత, నాన్న పేదవాళ్ల సమస్యలు వింటూ వారి కోసం పనిచేయడం చూస్తూ పెరిగాను. అది నామీద ఎక్కడో ప్రభావం చూపింది. దళితుల్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా, చదువుకున్న మహిళగా దళితుల పట్ల నాకు అవగాహన ఉంది. రాజకీయ కుటుంబం నుంచి రావడం వల్ల ప్రజలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు. ఎలక్షన్లు సమీపించేవరకూ నేను నిలబడాలని అనుకోలేదు. కాని సమీపించాక లోక్ జనశక్తి చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌తో చెప్పాను. ఆయన నా భర్తను సొంత తమ్ముడిలా చూస్తారు. అంతేకాదు, బిహార్ రాజకీయాలలో యువత రాణించాలని భావిస్తారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయన్న కారణం రీత్యానే సీట్ ఇచ్చారు’ అని తెలిపిందామె. అత్తగారి ఊరు పట్నాలో పుట్టి పెరిగిన శాంభవి తన అత్తగారి ఊరైన సమస్తిపూర్‌లో గెలవడానికి సిద్ధమవుతోంది. ‘ఆ ఊరి గురించి నిజం చెప్పాలంటే నాకేమీ తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మొదట అక్కడ ఒక ఇల్లు కొని అక్కడే ఉంటానన్న భరోసా కల్పించాలి. ఆ ఊరి యువతతో ఇప్పటికే కాంటాక్ట్‌లోకి వెళ్లాను. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపిస్తారు. అవి వమ్ము చేయకుండా ఉండటమే నా ప్రథమ లక్ష్యం’ అంటున్న శాంభవి రాజకీయ జీవితాన్ని త్వరలో ఓటర్లు నిర్ణయిస్తారు. -
దారుణం: కళ్లలోకి యాసిడ్ ఇంజెక్ట్ చేసి..
బెగుసరాయ్: యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని కర్కశంగా గుడ్డివాడిగా మార్చిన దారుణ ఘటన బిహార్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. బెగుసరాయ్ జిల్లా పిప్రా చౌక్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని డీఎస్పీ బీకే సింగ్ తెలిపారు. సమశక్తిపూర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి తెఘ్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బరౌనీ గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఫ్రిబవరి 6న ఆమెను తీసుకుని పారిపోయాడు. తన భార్యను డ్రైవర్ కిడ్నాప్ చేశాడని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 16న తెఘ్రాకు తిరిగి వచ్చి స్థానిక కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత భర్తతో కలిసి ఆమె ఇంటికి వెళ్లిపోయింది. డ్రైవర్‌తో వెళ్లిపోయిన ఆమె ఎందుకు తిరిగొచ్చిందనేది వెల్లడికాలేదు. శుక్రవారం సాయంత్రం డ్రైవర్‌కు ఆమె మరిది ఫోన్ చేశాడు. తన వదిన తమ వద్ద ఉండేందుకు ఇష్టపడటం లేదని, తెఘ్రా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆమెను తీసుకెళ్లాలని చెప్పాడు. నిజమని నమ్మి బయలుదేరిన డ్రైవర్‌ను దారి మధ్యలోనే దాదాపు 20 మంది అడ్డగించారు. రోడ్డున పక్కనున్న హోటల్లోకి తీసుకెళ్లి బాగా కొట్టారు. తర్వాత సిరంజీతో అతడి కళ్లలోకి యాసిడ్‌ను ఇంజెక్ట్ చేశారు. అతడిని హనుమాన్ చౌక్ సమీపంలో పడేసి పారిపోయారు. దారినపోయే వ్యక్తి చూసి అతడిని బెగుసరాయ్ ఆస్పత్రిలో చేర్చాడని, బాధితుడి చూపుపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారని డీఎస్పీ సింగ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
చావుతప్పి మంత్రి కన్ను లొట్టపోయేదే..
సమస్తిపూర్: రాజకీయ నాయకులకు ప్రజల మద్దతే కొండంత అండ. అదే ప్రజలు ఎదుతిరిగితే ఎలా ఉంటుందో బీహార్ లోని పశుసంవర్ధక శాఖామంత్రి బైద్యనాథ్ సాహ్ని అడిగితే సరిగ్గా తెలుస్తుంది. బీహార్ లోని సమస్తిపూర్ లోని నికాశ్ పూర్ లో ఓ పెట్రోల్ పంప్ ఆరంభించడానికి ఓ శిలాఫలకం వేయడానికి వెళ్లిన బైద్యనాథ్ కు ఊహించని రీతిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. కాలేజీకి సంబంధించిన భూమిలో పెట్రోల్ పంప్ ను ఏర్పాటు వ్యతిరేకిస్తున్న మంత్రిపై ప్రజలు కర్రలు, ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. కాలేజి క్యాంపస్ లో ఉన్న కొన్ని ట్రాక్టర్లను గ్రామస్థులు తగలపెట్టారు. ప్రజల దాడి నుంచి తప్పించుకోవడానికి కళాశాలలోని ఓ గదిలోకి వెళ్లి బిక్కుబిక్కుమంటూ దాచుకున్నారు. ఆతర్వాత జిల్లా ఎస్పీ, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయడంతో అక్కడ నుంచి జారుకున్నారు. ఇదంతా బీజేపీ, అసాంఘీక శక్తుల పనే అని బైద్యనాథ్ ఆరోపించారు.