
వంతెనపై ఎడ్లబండితో వెళ్తున్న రైతు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచకు వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్లబండిపై సవారి చేస్తూ అంతర్రాష్ట్ర వంతెనపై ఓ రైతు కనిపించాడు. వంతెన పై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రయ్..రయ్ మంటు తిరుగుతుంటాయి.
ఇలా ఎడ్లబండిపై రైతు ప్రత్యక్షమవడంతో పలువురు ఆశ్చర్యంగా తిలకించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వంతెన పై మధ్యలో ఎడ్లబండితో రైతు పలువురిని ఆకట్టుకున్నాడు.