
ఆ బ్యాంకుల్లో వంద నోట్లే రూ.2 కోట్లు
వంద నోట్ల కొరత రాకుండా ఆర్‌బీఐ ఏర్పాటు
ఒక్క రోజులోనే కొత్త అకౌంట్ల యాక్టివేషన్
ఆంధ్రాబ్యాంక్ జోనల్ మేనేజర్ విజయలక్ష్మి
సీతమ్మధార: బ్యాంకుల్లో వంద నోట్ల కొరత లేకుండా ఆర్‌బీఐ ఆదేశాలను అనుసరించి నగరంలోని ఏడు బ్యాంకుల్లో 14 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసినట్లు ఆంధ్రాబ్యాంక్ జోనల్ మేనేజర్ విజయలక్ష్మి తెలిపారు. ఆమె మంగళవారం సాక్షితో మాట్లాడారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్, ఐవోబీ, ఎస్‌బీహెచ్, యూనియన్ బ్యాంక్, యూకే బ్యాంక్, కెనరా బ్యాంకుల్లో ఒక్కో బ్యాంకుకు రూ.2 కోట్ల చొప్పున వంద రూపాయల నోట్లు డిపాజిట్ చేశామన్నారు. తమ జోన్ పరిధిలోని 76 బ్రాంచ్‌లలో రూ.వంద రూపాయలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.
ఖాతాదారుల డిపాజిట్లు రూ.250 కోట్లు :తమ జోన్ పరిధిలో ఖాతాదారులు ఇప్పటివరకు రూ.250 కోట్లు డిపాజిట్ చేసినట్లు విజయలక్ష్మి చెప్పారు. ఆంధ్రాబ్యాంకులన్నీ బుధవారం నుంచి ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తాయని చెప్పారు. కొత్త అకౌంట్లు తెరిచేవారి కోసం హెల్పింగ్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఓపెన్ చేసిన మర్నాడే పాస్‌బుక్‌తో పాటు సీక్రెట్ కోడ్ , కిట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఖాతాదారులంతా డిపాజిట్లు, లావాదేవీలు చేసుకోవచ్చని చెప్పారు. చాలా రోజులుగా అకౌంట్లు వాడని వారు ఆధార్‌కార్డు తీసుకువస్తే వెంటనే యాక్టివేట్ చేస్తామని చెప్పారు. ఏటీఎంలలో రోజుకు రూ.10 లక్షలు వేస్తున్నామని, అరుునా అరుుపోతున్నాయని చెప్పారు. షాపింగ్‌మాల్స్‌తో పాటు అవకాశమున్న చోట డెబిట్‌కార్డు ఉపయోగించాలని సూచించారు.