Classrooms
-
పరదా కడితే.. పడదా?
కేసముద్రం: తరగతి గదుల్లో స్లా్లబ్ పెచ్చులు ఊడిపడుతున్న ఓ బడిలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువు నెట్టుకొచ్చేస్తున్నారు. తాత్కాలికంగా పరదాలు కట్టి అడ్డు పెట్టినా ఒక్కోసారి పెద్ద పెద్ద పెచ్చులను పరదాలు కూడా ఆపలేకపోతున్నాయి. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పిల్లల దుస్థితి మాత్రం మారలేదు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ జెడ్పీ హైస్కూల్లో 165 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 9 గదులకు గాను ఒక గది స్టోర్ రూం, మరో గది స్టాఫ్‌కు కేటాయించారు. పాఠశాలలో స్లాబ్ శిథిలావస్థకు చేరుకోవడంతో పెచ్చులు ఊడిపడుతూ, ఇనుప సలాక్‌లు కిందకు వేలాడుతున్నాయి. ఇలా నాలుగు తరగతి గదుల్లో పై పెచ్చులు పడుతుండటంతో వాటిని తప్పించుకునేందుకు పిల్లలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. ఇక వర్షం పడినప్పుడల్లా స్లాబ్ కురుస్తుండటం, దాంతో పాటు పెచ్చులు పడుతుండటంతో పిల్లలను పక్కనే ఉన్న డైనింగ్ హాల్లో కూర్చోబెడుతున్నారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్‌ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్‌రూమ్‌లు సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్‌ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
రాస్తర్ మాస్టర్: వీధినే బడిగా మార్చేశాడు
కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులతో విద్య, వ్యాపారం, వాణిజ్యం స్తంభించాయి. అయినా మనిషిలోని చిన్న ఆలోచన ఒక ఉపద్రవం నుంచి వ్యవస్థను బయటకు తేవచ్చని నిరూపించాడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆ టీచర్. గత ఏడాదిన్నర కాలంగా దేశంలోని పాఠశాలలన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ తెరుచుకుంటున్నాయి. అదీ చాలా తక్కువ ప్రాంతాల్లో. ఈ లాక్‌డౌన నుంచి పిల్లలను బయటకు తెచ్చి, మళ్లీ చదువు వైపు మళ్లించాలని ఆ ఉపాధ్యాయుడు భావించాడు. కానీ ఎలా? క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్పలేడు. తాను పని చేస్తున్నది మారుమూల ప్రాంతమైన జబా గ్రామం. అక్కడ ఇంటర్నెట్, కంప్యూటర్లు వంటివేమీ ఉండవు. నిరుపేదలే నివాసితులు. చదవండి: లడ్డూలాంటి ఐడియా ఆన్లైన్ క్లాసులకు అవకాశం లేదు. బాగా ఆలోచించాడు. గ్రామాన్నే తరగతి గదిగా మర్చేస్తే!!.. ఐడియా బాగుంది. వెంటనే ఆచరణలో పెట్టాడు. వీధి గోడలన్నింటినీ బ్లాక్ బోర్డులుగా మార్చాడు. వివిధ సబ్జెక్టుల పాఠాలు వాటిపై రాశాడు. పిల్లల్ని రోడ్డు పక్కన దూరదూరంగా కూర్చొబెట్టాడు. వాళ్లకి మాస్కులిచ్చాడు. చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేయించాడు. పాఠాలు బోధించాడు. రాయడం, చదవడం దగ్గర నుంచి ఎవరి తరగతికి అవసరమైన పాఠాలు వారికి బోధిస్తున్నాడు. చదవండి: Susmita Basak: వారి కోసం ప్రత్యేకంగా లోదుస్తులు, అవయవాలు.. ఊర్లో పిల్లలందరూ చదువుకుంటున్నారు. పెద్దలు సంతోషిస్తున్నారు. ఊరినే బడిగా మార్చేసిన నాయక్‌ని అందరూ ‘రాస్తర్ మాస్టర్’ అని పిలుచుకుంటున్నారు. ‘ఈ గ్రామంలో పిల్లలకు చదువు చెప్పడానికి ఎటువంటి సౌకర్యాలు లేవు. అలా అని పిల్లల్ని వదిలేయలేము. అందుకే వీధి గోడలనే బ్లాక్‌బోర్డులుగా మార్చి పాఠాలు బోధిస్తున్నాను. కరోనా కాలంలో ఎలా జీవించాలో కూడా బోధిస్తున్నా. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్ ఉపయోగం వంటివి కూడా చెబుతున్నాను. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు’ అని నాయక్ చెప్పారు. -
కీచక టీచర్, విద్యార్థులకు అశ్లీల దృశ్యాలు..
సాక్షి, ఆదిలాబాద్: పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో ఉంచాల్సిన టీచర్.. కామ పాఠాలు బోధిస్తున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఘోట్కూరీ లో జరిగింది. విద్యార్థులకు అశ్లీల దృశ్యాలు చూపిస్తోన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖాదీర్ను తరగతి గదిలో బంధించారు. కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేశారు. గతంలో కూడా ఇదే విధంగా ఈ ఉపాధ్యాయుడు వ్యవహరించారని, తీరు మార్చుకోని టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: ప్రియుడిని హత్య చేస్తే.. ఓ రాత్రి నీతో గడిపేందుకు ఓకే పక్క తడిపాడని కన్నతండ్రే.. -
జెడ్పీ హైస్కూల్ X జూనియర్ కళాశాల
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే అందుకు తగ్గ తరగతి గదులు లేక అవస్థలు పడుతున్నారు. కళాశాల ప్రారంభించినప్పటి నుంచి తరగతి గదులు లేక అవస్థలు పడుతున్నామని కళాశాల ప్రిన్సిపల్ ఎస్. రమ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతు ఈ కళాశాలలో 450 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అందుకు సరిపడు గదులు లేవని చెప్పారు. ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయని అందుకే మధ్యాహ్న సమయంలో ఇంటర్ కళాశాల నడుస్తోందన్నారు. గదులు ఇవ్వమంటే ఇక్కడ జెడ్పీ పాఠశాల హెచ్ఎం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కళాశాలకు క్రీడా మైదానంలోనే చివర ఎకరా స్థలంను కేటాయిస్తే నాబార్డు నిధులతో సొంత భవనాలు నిర్మించుకుంటామని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని కూడా కలిసినట్లు తెలిపారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ ముసలయ్యను కూడా లెక్చరర్లు కలిసినట్లు తెలిపారు. ఈ విషయంపై జెడ్పీ బాలుర పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు కళాశాల విద్యార్థులకు తమ గదులు ఇస్తే తమ విద్యార్థులను ఎక్కడ కూర్చోపెట్టుకోవాలని ప్రశ్నించారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకుంటేనే విద్యార్థులకు ఇబ్బందులు ఉండవని పలువురు పేర్కొంటున్నారు. -
టీచర్లూ...స్కూళ్లో సెల్ఫోన్లు వాడొద్దు
ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ టీనగర్: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్లు ఉపయోగించరాదని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కన్నప్పన్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సర్క్యులర్ పంపారు. పాఠశాల వాతావరణం విద్యార్థులకు ఆహ్లాదకరంగా, గాలి, వెలుతురుతో కూడిన తరగతి గదులు, పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు ఉండేలా టీచర్లు చూడాలని నివేదికలో పేర్కొన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలను గురించి వివరిస్తూ టీచర్, పేరెంట్స్ ఆసోసియేషన్ సహకారంతో ప్రధానోపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల అడ్మిషన్లు చేపట్టాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజునే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేయడంతో పాటు టైం టేబుల్ రూపొందించి క్లాసులు నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ పాఠశాలలు తెరవడానికి అరగంట మునుపే చేరుకుని తరగతి గదులు, ప్రాంగణం శుభ్రంగా ఉన్నాయా లేదో పరిశీలించాలన్నారు. ఉపాధ్యాయులు తరగతి గదుల నుంచి బయటకు వెళ్లకూడదని, వెళ్లాల్సి వస్తే రిజిస్టర్లో సంతకం చేయాలని తెలిపారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్లు ఉపయోగించరాదని, ఎవరైనా వాడితే ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
హైటెక్ నగరిలో లోటెక్ బడులు
- శిథిలావస్థలో తరగతి గదులు - వే ధిస్తున్న తాగునీటి కొరత - డంపింగ్ యార్డుల్లా పరిసరాలు - విద్యార్థులకు తప్పని అవస్థలు సాక్షి, సిటీబ్యూరో: తలుపులు లేని తరగతి గదులు... పెచ్చులూడుతున్న పైకప్పులు.. డంపింగ్ యార్డుల కంటే దారుణమైన పరిసరాలు.. నిర్వహణ కొరవడిన మరుగుదొడ్లు... నేలమీదే పాఠాలు.. ఉపాధ్యాయులు, పిల్లలే అటెండర్లు... అలంకారప్రాయంగా బోర్లు... దొరకని మంచినీళ్లు... కనిపించని ప్రహరీలు.. ఇవీ మన సర్కారు బడులలోని సమస్యలకు సాక్ష్యాలు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని సోమవారం ‘సాక్షి’ పరిశీలిస్తే... అక్కడి పరిస్థితులు దుర్భరంగా కనిపించాయి. కనిపించని వసతులు హైదరాబాద్ జిల్లాలో 712, రంగారెడ్డి జిల్లాలో రెండు వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో చదువుకోవడమే శాపమేమో అన్నట్లుగా పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో అధికారుల పనితీరు ఏ స్థాయిలో ఉందో ఈ పాఠశాలలే చెబుతాయి. వేసవి సెలవుల్లో పాఠశాలల్లో వసతులు కల్పించి ఆధునికీకరించాల్సి ఉండగా.. ఎక్కడా ఆ ఆచూకీ కానరాదు. గతేడాది 23 మరుగుదొడ్ల యూనిట్లు మంజూరుకాగా.. అందులో ఇప్పటికి ఒక్కటీ పూర్తి కాలేదు. అసలు 9 యూనిట్ల నిర్మాణానికి స్థలాలే కరువయ్యాయి. మరో 14 నిర్మాణ దశలో ఉన్నాయి. దీనికితోడు 40 యూనిట్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఇదంతా పాఠశాలల పున ఃప్రారంభం నాటికే ముగియాలి. కానీ ఇంకా కొనసాగుతుండడం.. అధికారుల పనితీరుకు తార్కాణం. చాలా స్కూళ్లలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు పేరుకుపోయి పాఠశాలల పరిసరాలు దుర్గంధభరితంగా తయారయ్యాయి. దీంతో ఇవి వినియోగానికి దూరమయ్యాయి. ఫలితంగా బాలికల కష్టాలు వర్ణణాతీతంగాా ఉన్నాయి. వెంటాడుతున్న నీటి కష్టాలు వందలాది బడుల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా చాంద్రాయణగుట్ట ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని స్కూళ్లకు నీటి కనెక్షన్ లేకపోవడం గమనార్హం. కొన్ని చోట్ల ఉన్నా నీరు రావడం లేదు. గత్యంతరం లేక పిల్లలు ఇంటి నుంచే నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. మరికొన్ని చోట్ల వాటర్ ఫిల్టర్లు ఉన్నా అలంకార ప్రాయంగా మారాయి. నీటి కొరత ప్రభావం మురుగుదొడ్ల నిర్వహణపై పడుతోంది. ఇరుకు గదులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇరుకు గదుల్లోనే నెట్టుకొస్తున్నారు. ఏడాది క్రితం దాదాపు 60 అదనపు గదులు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపితే... సర్కారు పెడచెవిన పెట్టింది. చాలా ప్రాంతాల్లో గదుల పైకప్పు పెచ్చులూడుతున్నాయి. దీంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ‘చెత్త’గా పరిసరాలు... చాలా పాఠశాలల పరిసరాలు డంపింగ్ యార్డుల్లా దర్శనమిస్తున్నాయి. వీధుల్లో చెత్తంతా తీసుకొచ్చి బడుల వద్దే పోగేస్తున్నారు. దీంతో అపరిశుభ్రత నెలకొంటోంది. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో.. రోగాలు ప్రబలే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల ప్రహరీలు కూలిపోగా... ఇంకొన్నింటికీ అసలే లేవు. దీంతో పాఠశాలలు అసాంఘిక కార్యక్రమాలకు నెలవవుతున్నాయి. తలుపులు, కిటికీలు సరిగా లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. దీనికితోడు నైట్ వాచ్మెన్ల కొరత తీవ్రంగా ఉంది. అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. అటెండర్ల పోస్టులు భర్తీ కాకపోవంతో ఆ బాధ్యతలను ఉపాధ్యాయులు, విద్యార్థులే నిర్వర్తిస్తున్నారు. పిల్లలే చీపుర్లు పట్టి గదులు, పరిసరాలు శుభ్రం చేసుకుంటున్నారు. అక్కడే కల్లు కాంపౌండ్.. గౌలిపురా లలితాబాగ్ బ్రిడ్జి రోడ్డులోని శాలిబండ ప్రభుత్వ బాలికల పాఠశాల సమీపంలో కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం బడులు, ప్రార్థనా మందిరాల సమీపంలో కల్లు కాంపౌండ్ ఉండకూడదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ప్రహరీ ఎత్తు తక్కువగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు బడి అడ్డాగా మారింది. ఉపాధ్యాయులకే అటెండర్ విధులు లాలపేట్: లాలపేట్ ప్రభుత్వ పాఠశాలలో (గడి హైస్కూల్) కొన్నేళ్లుగా అటెండర్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఉపాధ్యాయులే గంట కొడుతున్నారు. ఈ పాఠశాలలో 359 మంది విద్యార్థులుండగా 18 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. సాంఘికశాస్త్రం, సామాన్యశాస్త్రం టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లాలాపేట్ ప్రాంతంలో ఉన్న మరో మూడు పాఠశాలల పరిస్థితీ ఇలాగే ఉంది. కొన్ని పాఠశాలలను విద్యార్థులే శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
కస్తూర్బా విద్యార్థుల ‘కన్నీటి’ బాధలు
- ఊరుస్తున్న తరగతి గదులు -పనిచేయని సోలార్ లైట్లు - ఆందోళనలో విద్యార్థినులు - పట్టించుకోని అధికారులు నార్నూర్ : బాలికలకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను ఏర్పాటు చేసింది. అందులో వారికి ఉచిత వసతి, భోజనం, యూనిఫామ్స్ తదితర సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంది. నార్నూర్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ విద్యార్థులకు నూతన భవనం నిర్మించారు. కానీ, సౌకర్యాలు కల్పించడంలో మాత్రం అధికారులు దృష్టి సారించడం లేదు. పాఠశాల ప్రారంభం నుంచి ఆశ్రమ బాలికల పాఠశాల పురాతన భవనంలో కొనసాగుతోంది. అక్కడ విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో నెల రోజుల క్రితం దాదాపు రూ.33 లక్షలతో నిర్మించిన నూతన భవనంలో పాఠశాలను మార్చారు. మొత్తం 200 మంది విద్యార్థినులు ఉన్న ఈ పాఠశాలల్లో భవనంలో విద్యార్థినులకు కనీస సౌకర్యాలు కల్పించక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు లేక, చిన్న పాటి వర్షం పడిన తరగతి గదులల్లో కురుస్తుండడంతో రాత్రంతా జాగారం చేయాల్సి వస్తోందని పాఠశాల విద్యార్థినులు వాపోతున్నారు. నూతన భవనంలో తీరని కష్టాలు అసంపూర్తిగా నిర్మించిన కొత్త భవనంలో పాత భవనంలో కంటే ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయి. ప్రహరీ నిర్మాణం చేపట్టక పోవడంతో తడకలు కట్టి ఉంచారు. గేటు లేదు. పట్టణానికి దూరంగా నిర్మించిన ఈ భవనానికి ప్రహరీ లేకపోవడం వల్ల రాత్రివేళల్లో విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాల ఆవరణంలో వేసిన చేతిపంపుకు చిలుము రావడంతో ఆ నీరు తాగిన విద్యార్థులు రోగాల భారీన పడుతున్నారు. సరిపడా స్నానపు గదులు, మరుగుదొడ్లు లేకపోవడంతో భవనంపై కెక్కి స్నానం చేయాల్సి వస్తుంది. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సోలార్లైట్లు పని చేయకపోవడంతో రాత్రంతా చీకట్లోనే ఉంటున్నారు. మరుగుదొడ్ల కోసం నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. అధికారులు స్పందించి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థినులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
‘బడి’ దుడుకులు
పుస్తకాల సంచి తగిలించుకొని బడిబాట పట్టిన విద్యార్థులకు గురువారం మొదటి రోజే కఠిన పరీక్ష ఎదురైంది. వేసవి సెలవుల్లో దుమ్ముపట్టిన తరగతి గదులను శుభ్రం చేసే బాధ్యత వారిపై పడింది. బల్లలు సర్దుతూ.. బండలు తుడుస్తూ పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. ఓ వైపు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు వ్యతిరేకంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు పిల్లలతో టీచర్లు దగ్గరుండి పనులు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. బడి గంట మోగింది. 50 రోజుల పాటు వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు మొదటిరోజు అయిష్టంగానే పాఠశాల గడప తొక్కారు. శుక్రవారం ఏరువాక పౌర్ణమి కావడం, ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం ఉండటంతో తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. మరోవైపు వచ్చిన విద్యార్థులతోనే ఉపాధ్యాయులు పాఠశాలలను శుభ్రం చేయించారు. కొన్ని పాఠశాలల్లో మద్యం బాటిళ్లు కనిపించాయి. వాటిని సైతం విద్యార్థులచే తీసి వేయించారు. మొదటిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని అధికారులు చెప్పినా ఎక్కడా అమలు కాలేదు. పాఠశాలకు హాజరైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల్లో చాలామంది ముచ్చట్లకే పరిమితమయ్యారు. ఇదే రోజు అధికారులు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ర్యాలీలు నిర్వహించారు. పిల్లలతో పనిచేయించవద్దని ఉపన్యాసాలు దంచారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించేవిధానాన్ని అడ్డుకోలేకపోతున్నారు. - కర్నూలు(విద్య)