క్యారమ్‌లో మెరిసిన వరుణ్
అండర్-19 కాలేజీల టోర్నీ
సాక్షి, హైదరాబాద్: జూనియర్ కాలేజీల అండర్-19 చెస్, క్యారమ్ పోటీల్లో భవాన్స్ జూనియర్ కాలేజి కుర్రాడు బి.జె.వరుణ్ కుమార్ మెరిశాడు. హైదరాబాద్ స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో బద్రుకా బాలికల జూనియర్ కాలేజిలో జరిగిన ఈ గేమ్స్‌లో వరుణ్ క్యారమ్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచాడు. సింగిల్స్‌లో ఎండీ ఫరూఖ్ (భవాన్స్), మణిభూషణ్ చారి (ప్రభుత్వ జూనియర్ కాలేజి, మలక్‌పేట్) వరుసగా రెండు, మూడు స్థానాలు పొందారు. డబుల్స్‌లో దీపక్‌తో కలిసి వరుణ్ టైటిల్ గెలుపొందగా, ముస్తఫా-రవీందర్ జోడి (సీబీఎస్‌ఆర్‌వీ నాయుడు కాలేజి) రన్నరప్‌గా నిలిచింది. పోటీలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇంటర్మీడియట్ బోర్డు ఆర్.ఐ.ఓ రవి కుమార్ విజేతలకు పతకాలు అందజేశారు.
చెస్ ఫలితాలు: బాలురు: 1. సాయిరాం (భవాన్స్), 2. రాజా యాదవ్ (భవాన్స్), 3. లక్ష్మణ్ రెడ్డి (భవాన్స్), 4. మల్లిఖార్జున్ (భవాన్స్), 5. ప్రశాంత్ (సీబీఎస్‌ఆర్‌వీ కాలేజి); బాలికలు: 1. హషిత (భవాన్స్), 2. నేహా (భవాన్స్), 3. ఉజాలా దాస్ (భవాన్స్), 4. మనీషా (భవాన్స్)
క్యారమ్ ఫలితాలు: బాలికల సింగిల్స్: 1. స్వాతి (కస్తూర్బా కాలేజి), 2. నాగమణి (భవాన్స్), 3. చంద్రిక (భవాన్స్), 4. లహరి (సెయింట్ ఆన్స్)
బాలికల డబుల్స్: 1. శివాని-సైదా బేగం (సెయింట్ ఆన్స్), 2. శైలజ-కళ్యాణి (కీస్ కాలేజి), 3. స్వప్న-స్వాతి (కస్తూర్బా కాలేజి), 4. సంయుక్త-నేహ (మహర్షి కాలేజి).