సిద్దిపేట కలెక్టర్‌కు జైలు శిక్ష | Kaleshwaram Project: HC Orders Imprisonment Of Two Siddipet Collectors And RDO | Sakshi
Sakshi News home page

సిద్దిపేట కలెక్టర్‌కు జైలు శిక్ష

Published Tue, Mar 9 2021 8:30 PM | Last Updated on Wed, Mar 10 2021 12:12 AM

Kaleshwaram Project: HC Orders Imprisonment Of Two Siddipet Collectors And RDO - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఇద్దరు కలెక్టర్లు, ఆర్డీవోకు కోర్టు ధిక్కరణ నేరం కింద జైలు శిక్ష విధించింది. ఈ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో కోర్టు ఆదేశాలు పాటించలేదని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సిద్ధిపేట కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డికి 3 నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అలానే పిటిషనర్‌కు 25వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.

సిద్దిపేట కలెక్టర్‌తో పాటు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు రెండు వేల రూపాయల జరిమానా.. ఆర్డీఓ జయచంద్రారెడ్డికి 4 నెలల జైలు, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ అధికారులు ముగ్గురు ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులు ధిక్కరించారని అభిప్రాయపడింది. అప్పీలుకు వెళ్లేందుకు 6 వారాల పాటు తీర్పు నిలిపివేస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి:
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టులో పిల్‌ దాఖలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement