
స్నేహమంటే ఇదేరా..
స్నేహితుల కోసం త్యాగాలు, గొప్ప పనులు కేవలం మానవులు మాత్రమే కాదు తామూ చేయగలమని నిరూపించింది ఓ శునకం. ఈ చిత్రంలో చూస్తున్న శునకాలు రెండు స్నేహితులు. అయితే ఇందులో ఆడ శునకం ఓ రోజు గాయపడి రైలు పట్టాలపై పడిపోయింది. గమనించిన మరో మగ కుక్క దానికి కాపలాగా ఉంది. అచేతన స్థితిలో ఉన్న మరో శునకాన్ని వదలి వెళ్లలేక ఏకంగా రెండు రోజులపాటు దట్టమైన మంచులోనే రాత్రింబవళ్లు తోడుగా ఉంది.
ఆ మార్గంలో రైళ్లు వెళ్తున్నా లెక్కచేయకుండా పట్టాలపైనే రెండు శునకాలు బిక్కుబిక్కుమంటూ నక్కి కూర్చున్నాయి. ఈ హృదయవిదారక సన్నివేశాన్ని చూసిన స్థానికులు వాటి పరిస్థితిని గమనించి గాయపడిన శునకాన్ని రక్షించారు. ఈ రెండు శునకాలు ఒకే కుటుంబానికి చెందినవట. కాగా, ట్రాక్‌పైన కుక్కల పరిస్థితిని డెనీస్ అనే వ్యక్తి వీడియో తీసి నెట్‌లో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్ అయింది.