![Supreme Court Denies Relief To TMC Abhishek Banerjee - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/21/supreme-court-denies-relief-tmc-abhishek-banerjee.jpg.webp?itok=AfN25F86)
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో సీబీఐ, ఈడీ విచారణలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి మధ్యంతర ఉపశమనం కల్పించకూడదన్న కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
టీఎంసీ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మానసం.. టీచర్ రిక్రూట్‌మెంట్, మున్సిపల్ రిక్రూట్‌మెంట్ స్కాంలు లింక్ అయి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు స్కాంలలో అభ్యర్థుల ఓఎమ్‌ఆర్‌లు తయారు చేసిన వ్యక్తి ఒకరేనని గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో సీబీఐ దర్యాప్తు పూర్తి అయినందున, హైకోర్టు వద్ద సమాచారం తక్కువ ఉందని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. ఈ మేరకు తీర్పును వెల్లడించారు.
వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు.. అర్హత లేని వ్యక్తులకు టీచర్ పోస్టులను ఇచ్చినట్లు గుర్తించిన వ్యవహారంలో రూ.350 కోట్లు చేతులు మారినట్లు ధర్మాసనానికి చెప్పారు. చాలా ఓఎమ్‌ఆర్ పత్రాలు ధ్వంసమైనట్లు వెల్లడించారు. రూ.5 కోట్ల డబ్బు, నగలు గుర్తించినట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిని కూడా అరెస్టు చేసినట్లు ధర్మాసనానికి చెప్పారు. ప్రతిపవాదనలు వినిపించిన సీనియర్ లాయర్ కపిల్ సిబల్.. ఇక్కడ ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరగలేదని న్యాయమూర్తికి విన్నవించారు.
ఇదీ చదవండి: పార్కుకు 'వాజ్‌పేయీ' పేరు మార్పు.. బీజేపీ ఆందోళనలు..
Comments
Please login to add a commentAdd a comment