
లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అతనిపై నడిగర్ సంఘం నిషేధం విధించింది. హీరోయిన్ త్రిషపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వివాదానికి దారితీయడంతో.. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వ్యక్తిగతంగా హజరై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేశారు.
దీంతో అతను ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్ విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. అయితే పిటిషన్‌లో ఉన్న తప్పుల కారణంగా బెయిల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విషయంలో కోర్టు సమయం వృథా చేశారని మన్సూర్ అలీ ఖాన్‌ను హెచ్చరించినట్లు సమాచారం. కాగా.. ఈ కేసులో చెన్నైలోని థౌజండ్ ఐలాండ్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఇవాళ విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యాడు.
ఖండించిన అగ్రతారలు
త్రిషపై అతను చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ అగ్రతారలు ఖండించారు. టాలీవుడ్ నటులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, నటి ఖుష్బూ సుందర్ త్రిషకు మద్దతుగా పోస్టులు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే లియో డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ సైతం ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment