జెరూసలేం: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మరోమారు భీకర దాడి చేసింది. డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వందకు మించిన హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ విమానాల నుంచి వస్తున్న శబ్ధాలు, దూసుకువస్తున్న బాంబులు, క్షిపణులకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు హిజ్బుల్లా రాకెట్ లాంచర్లతో సహా దక్షిణ లెబనాన్‌లోని దాదాపు 110 లక్ష్యాలపై భారీ దాడి చేశాయని ఐడీఎఫ్ తెలిపింది. ఈ దాడిలో లెక్కలేనందమంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. దీనికిముందు శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 37 మంది మృతి చెందారు. ఈ తాజా దాడి తర్వాత లెబనాన్‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. శనివారం లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై వరుస దాడుల ఘటన మరువక ముందే తాజా దాడులు జరిగాయి. తాజా దాడుల్లో వేలాది రాకెట్ లాంచర్ బారెల్స్ ధ్వంసమయ్యాయని ఐడీఎఫ్ పేర్కొంది.
🚨Update: IDF continues massive air strikes across Lebanon! One of the largest bombs ever dropped by Israel on southern Lebanon, very likely a US Moab! pic.twitter.com/D71TB3tPI3
— US Civil Defense News (@CaptCoronado) September 21, 2024
ఇది కూడా చదవండి: గాజాలో 22 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment