targets
-
కొత్త బడ్జెట్‌కు ముందు కీలక డాక్యుమెంట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman ) ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో 2025–26 వార్షిక బడ్జెట్‌ను (Budget 2025) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ (Finance Ministry) కీలక డాక్యుమెంటును ఆవిష్కరించింది. బడ్జెట్ లక్ష్యాలను ఈ డాక్యుమెంట్లో సూచించింది. 4.5 శాతం వద్ద ద్రవ్యలోటు ( fiscal deficit) కట్టడి, పేదల అవసరాలకు అనుగుణంగా సామాజిక భద్రతా చర్యలకు పెద్దపీట వేయడం.. ఇందులో కీలక అంశాలుగా ఉన్నాయి.వచ్చే రెండేళ్లు భారత్ వృద్ధి 6.5 శాతం భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత (2024–25) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని సేవల దిగ్గజ సంస్థ– ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) నివేదిక పేర్కొంది. ప్రైవేట్ వినియోగ వ్యయం, అలాగే మూలధన వ్యయాలు అంచనాలకన్నా తగ్గడం వృద్ధికి బ్రేకులు వేస్తున్న అంశంగా ఈవై వివరించింది. ఈ కారణంగానే సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయిలో 5.4 శాతంగా నమోదయ్యిందని విశ్లేషించింది.ప్రపంచ పరిస్థితులు అనిశ్చితంగా ఉండటం, ప్రపంచ వాణిజ్య పరిస్థితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయ డిమాండ్, సేవల ఎగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుందని ఈవై పేర్కొంది. రోడ్లు, స్మార్ట్ సిటీలు, రైల్వేలు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనంసహా ప్రాధాన్యతా రంగాల పురోగతికి 2030 వరకు వర్తించే తాజా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ఆవిష్కరణ అవసరమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతానికి మించకూడదని పేర్కొన్న ఈవై, ఈ 60 శాతం భారం కేంద్రం, రాష్ట్రాలపై సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
ఎన్టీపీసీ గ్రీన్ రూ. లక్ష కోట్ల పెట్టుబడి
ముంబై: ఐపీవో బాటలో ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 2026–27 నాటికి సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ.1 లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడిలో 20 శాతం ఈక్విటీ రూపంలో రావాలంటే.. విస్తరణ కోసం రూ.20,000 కోట్ల సొంత నిధులు అవసరమవుతాయని సంస్థ సీఎండీ గుర్దీప్ సింగ్ వెల్లడించారు.రాబోయే ఐపీవో ద్వారా రూ.10,000 కోట్ల నిధులు వస్తాయని అన్నారు. కంపెనీ అంతర్గత వనరుల ద్వారా మిగిలిన మొత్తాన్ని సేకరించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ఏజెన్సీల నుండి కంపెనీ మెరుగైన క్రెడిట్ రేటింగ్‌ను పొందుతోందని, ఇది పోటీ కంపెనీలతో పోల్చినప్పుడు తక్కువ రేట్లతో రుణాన్ని అందుకునేందుకు వీలు కల్పిస్తుందని సింగ్ చెప్పారు. ఇతర విభాగాల్లోకీ ఎంట్రీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకూడదని, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ పవర్, ఎనర్జీ స్టోరేజీ విభాగాల్లో ఎంట్రీపై కూడా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌ను నెలకొల్పడానికి విశాఖపట్నం సమీపంలోని 1,200 ఎకరాల భూమిని చాలా సంవత్సరాల క్రితం ఎన్టీపీసీ తీసుకుంది. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని సింగ్ వెల్లడించారు. 2027కల్లా 19,000 మెగావాట్లు.. ప్రస్తుతం 3,220 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ.. 2025 మార్చికి 6,000 మెగావాట్లకు, 2026 మార్చి నాటికి 11,000 మెగావాట్లకు, 2027 మార్చి కల్లా 19,000 మెగావాట్లకు సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 11,000 మెగావాట్లకు సమానమైన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని సింగ్ వెల్లడించారు.నవంబర్ 19 నుంచి ఐపీవో.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవో నవంబర్ 19న ప్రారంభమై 22న ముగుస్తుంది. ఒక్కొక్కటి రూ.102–108 ప్రైస్ బ్యాండ్‌తో రూ.10,000 కోట్ల వరకు విలువైన తాజా షేర్లను జారీ చేయడానికి కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఇన్వెస్టర్లు కనీసం 138 షేర్లతో కూడిన లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి వాటాలు కావాల్సినవారు మరిన్ని లాట్స్‌కు బిడ్లు వేసుకోవచ్చు.ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 75 శాతం, నాన్–ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటాలు కేటాయిస్తారు. అర్హత కలిగిన కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.5 డిస్కౌంట్‌ను ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆఫర్ చేస్తోంది. ఉద్యోగుల కోటాకై రూ.200 కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. హ్యుండై మోటార్ ఇండియా, స్విగ్గీ తర్వాత ఈ ఏడాది మూడవ అతిపెద్ద ఐపీవోగా ఇది నిలవనుంది. -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాల విధ్వంసం
జెరూసలేం: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మరోమారు భీకర దాడి చేసింది. డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వందకు మించిన హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ విమానాల నుంచి వస్తున్న శబ్ధాలు, దూసుకువస్తున్న బాంబులు, క్షిపణులకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు హిజ్బుల్లా రాకెట్ లాంచర్లతో సహా దక్షిణ లెబనాన్‌లోని దాదాపు 110 లక్ష్యాలపై భారీ దాడి చేశాయని ఐడీఎఫ్ తెలిపింది. ఈ దాడిలో లెక్కలేనందమంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. దీనికిముందు శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 37 మంది మృతి చెందారు. ఈ తాజా దాడి తర్వాత లెబనాన్‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. శనివారం లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై వరుస దాడుల ఘటన మరువక ముందే తాజా దాడులు జరిగాయి. తాజా దాడుల్లో వేలాది రాకెట్ లాంచర్ బారెల్స్ ధ్వంసమయ్యాయని ఐడీఎఫ్ పేర్కొంది. 🚨Update: IDF continues massive air strikes across Lebanon! One of the largest bombs ever dropped by Israel on southern Lebanon, very likely a US Moab! pic.twitter.com/D71TB3tPI3— US Civil Defense News (@CaptCoronado) September 21, 2024ఇది కూడా చదవండి: గాజాలో 22 మంది మృతి -
యూపీఐ పేమెంట్లే మోసగాళ్ల టార్గెట్
సాక్షి, అమరావతి: దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల్లో యూపీఐ మోసాలే అత్యధికంగా ఉంటున్నాయి. డిజిటలీకరణ పెరుగుతున్న కొద్దీ అధికమవుతున్న ఆర్థిక నేరాల్లో యూపీఐ మోసాలదే అగ్రస్థానం. ‘అనాటమీ ఆఫ్ ఫ్రాడ్స్–2023’ పేరిట కాన్పూర్ ఐఐటీ, డిజిటల్ బ్యూరో కన్సల్టెన్సీ ప్రక్సీస్ సంస్థ విడుదల చేసిన నివేదిక యూపీఐ మోసాల తీవ్రతను వెల్లడించింది. దేశంలో రోజుకు సగటున 23 వేల డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు పెరుగుతుండటాన్ని సైబర్ ముఠాలు అవకాశంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయని ఆ నివేదిక చెప్పింది. ప్రస్తుతం దేశంలో 90.50 కోట్ల మందిగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు 2027నాటికి 100.14 కోట్లకు చేరతారని అంచనా వేసింది. 2019లో దేశంలో డిజిటల్ చెల్లింపులు 36 శాతం ఉండగా 2023 ఏప్రిల్ నాటికి 57 శాతానికి పెరిగాయి. 2027నాటికి డిజిటల్ చెల్లింపులు 74 శాతానికి చేరుతాయని అంచనా. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు ప్రధానంగా యూపీఐ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన అవగాహన కల్పించాలని పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. అప్రమత్తతే రక్షా కవచం సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తతే రక్షా కవచం. వినియోగదారులు తగిన అవగాహన కలిగి ఉండాలని సీఐడీ ఎస్పీ (సైబర్ క్రైమ్ విభాగం) హర్షవర్ధన్ రాజు చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ఆయన చేసిన సూచనలు ఇవీ... ► డిజిటల్ చెల్లింపులు చేసే డివైజ్‌ల ‘పిన్’ నంబర్ల గోప్యత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పిన్ నంబర్లుగానీ ఓటీపీ నంబర్లుగానీ ఎవరికి తెలియజేయకూడదు. దీర్ఘకాలంగా ఒకే పాస్‌వర్డ్‌ను కొనసాగించకూడదు. పాస్‌వర్డ్‌ను నియమిత కాలంలో మారుస్తూ ఉండాలి. ► ఫేక్ యూపీఐ సోషల్ మీడియా హ్యాండిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చే అన్ని యూపీఐ హ్యాండిల్స్ విశ్వసనీయమైనవి కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ వినియోగదారుల యూపీఐ వివరాలను తెలపాలని ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోరవు. ఏదైనా ఆర్థిక సంస్థగానీ యాప్‌గానీ యూపీఐ వివరాలను కోరితే ఆ సంస్థ కచి్చతంగా మోసపూరితమైనదని గుర్తించి వెంటనే బ్లాక్ చేయాలి. ► పబ్లిక్ వైఫై, సురక్షితం కాని నెట్‌వర్క్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయకూడదు. ► మొబైల్ ఫోన్లలో ట్రాన్సాక్షన్ అలెర్ట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మీ బ్యాంకు చెల్లింపులకు సంబంధించిన సమాచారం వెంటనే మీకు ఎస్ఎంఎస్ ద్వారా తెలిసే సౌలభ్యం ఉండాలి. మీ అనుమతిలేకుండా ఏదైనా చెల్లింపు జరిగితే వెంటనే గుర్తించి బ్యాంకును సంప్రదించి తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ►సైబర్/యూపీఐ మోసానికి గురయ్యామని గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయించాలి. ఫిర్యాదు చేయాలి. సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ పోర్టల్ (నంబర్ 1930)కు గానీ ఏపీ సైబర్ మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100 )కుగానీ ఫిర్యాదు చేయాలి. భద్రతపై బ్యాంకుల దృష్టి సైబర్ మోసాలు పెరుగుతుండటంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైబర్ భద్రతపై దృష్టిసారించాయి. సైబర్ భద్రత మౌలిక వసతులను పెంచుకునేందుకు నిధులు వెచి్చస్తున్నాయి. దేశంలో 43 ఆర్థిక సంస్థలు సైబర్ భద్రత కోసం నిధుల వెచ్చింపును భారీగా పెంచగా.. 17 శాతం ఆర్థిక సంస్థలు స్వల్పంగా పెంచాయి. కాగా 35 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. 2 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను స్వల్పంగా తగ్గించగా 3 శాతం సంస్థలు బడ్జెట్‌ను భారీగా తగ్గించాయి. -
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
45 గిగావాట్లు లక్ష్యం! అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రణాళిక
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ పునరుత్పాదక ఇంధన సంస్థ 2030 నాటికి 45 గిగావాట్ల (జీడబ్ల్యూ)పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్గారాలను తగ్గించి, భారత్ తన కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాన్ని చేరుకోవడానికి తన వంతు సహాయ సహకారాలను అందించాలని సంస్థ భావిస్తున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వర్గాలు తెలిపాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 8,316 మెగావాట్ల (8.3 జీడబ్ల్యూ) పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రస్తుతం కలిగి ఉంది. మరో 12,118 మెగావాట్ల సామర్థ్యం నిర్మాణ దశలో ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇందు కోసం ప్రతి సంవత్సరం సౌర, పవన శక్తి నుంచి 3 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారయి. ఫ్రెంచ్ ఎనర్జీ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో 19.7 శాతం వాటాను కలిగి ఉంది. ఇటీవల యూఎస్ పెట్టుబడి సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ కంపెనీలో 6.8 శాతం వాటాను, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మరో 2.8 శాతం వాటాను కొలుగోలు చేశాయి. -
నిర్ధేశిత లక్ష్యాలను వేగంగా సాధించాలి - వివేక్ జోషి
న్యూఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయమైన ప్రభుత్వ లక్ష్యాలను వీలైనంత త్వరగా సాధించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) కృషి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వివేక్ జోషి కోరారు. పీఎస్‌బీల అధినేతలు, నాబార్డ్ చైర్మన్‌తో ఆర్థిక శాఖ సమీక్షా సమావేశం నిర్వహించింది. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకం కింద దరఖాస్తులను వేగంగా పరిష్కరించి, అవసరమైన మేర రుణాలను మంజూరు చేయాలని వివేక్ జోషి కోరారు. వీధి వర్తకులను డిజిటల్ చానళ్లపైకి వేగంగా తీసుకురావాలని, డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయాలని సూచించారు. జన్ సురక్షా, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమాయోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా పథకాల విషయమై బ్యాంకుల పనితీరును ఈ సమావేశంలో సమీక్షించినట్టు ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపులను పెంచే లక్ష్యంతో, డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన అంశాలపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిపింది. -
వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలన యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలను సత్వరంగా అమలు చేయడంలో భాగంగా జిల్లా కలెక్టర్లకు వారం వారం లక్ష్యాలను నిర్దేశించే కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శ్రీకారం చుట్టారు. ప్రతి ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్లకు వాట్సాప్ ద్వారా.. సోమవారం నుంచి వారం రోజుల పాటు దృష్టి సారించాల్సిన అంశాలు, సాధించాల్సిన పురోగతిపై స్పష్టమైన లక్ష్యాలను విధిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కుంటి నడకతో.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయికి వెళ్లే సరికి ముందుకు పురోగమించడం లేదు. క్షేత్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తతతో కొన్ని ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో తలెత్తుతున్న సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలపై విస్తృత రీతిలో సమీక్షలు జరుపుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో కొంతకాలం అధికార యంత్రాంగం హడావుడి చేసినా సమస్యలు కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సీఎస్ చర్యలు చేపట్టారు. ప్రాధాన్యత అంశాల అమలుపై ప్రతివారం లక్ష్యాలను నిర్దేశించి పురోగతిని సమీక్షించాలని నిర్ణయించారు. తాజాగా ఈ వారం ఐదు అంశాలపై దృష్టి సారించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలని సూచించారు. 1. పోడుపై సమన్వయ కమిటీ సమావేశాలు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల సమస్యకు పరిష్కారం కల్పించడంలో భాగంగా ఈ వారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలి. గ్రామ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి గడువు నిర్దేశించుకోవాలి. ఎప్పటిలోగా ఈ పనిని పూర్తి చేస్తారో తెలియజేయాలి. 2. పెన్షన్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలి ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ వారంలోగా పూర్తి చేయాలి. గ్రామ పంచాయతీ స్థాయిలో పంపిణీ చేపట్టాలి. ఒక్కో ఎమ్మెల్యే రోజుకు 8 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. కార్యక్రమం పూర్తికి లక్షిత తేదీని తెలియజేయాలి. 3. క్రమబద్ధీకరణ దరఖాస్తులు పరిశీలించాలి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదలు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించడానికి జారీ చేసిన జీవో 59 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలను ప్రారంభించి రెండు వారాల్లోగా పూర్తి చేయాలి. ఇందుకు సరిపడ సంఖ్యలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తుల పరిశీలన జరపాలి. 4. ధరణి సమస్యలకు సత్వర పరిష్కారం ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా టీఎం33 కింద ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పట్టాదారు పేరు, విస్తీర్ణం, భూమి స్వభావం, మిస్సింగ్ సర్వే నంబర్ల నమోదు గురించి వచ్చే దరఖాస్తులను పరిష్కరించాలి. ఎన్ని దరఖాస్తులు ఆమోదించారో, ఎన్ని తిరస్కరించాలో ఎప్పటికప్పుడు వివరాలు పంపాలి. ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి. 5. విషాహార ఘటనలు పునరావృతం కావొద్దు రాష్ట్రంలోని గురుకుల, కేజీబీవీ వసతి గృహాల్లో విషాహార ఘటనలు పునరావృతం కాకూడదు. ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యహరించాలి. పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఇదీ చదవండి: ఎన్ఐఏ పంజా.. నిజామాబాద్ కేంద్రంగా ఉగ్రవాద శిక్షణపై ఫోకస్ -
ఒలింపిక్ పతకమే మిగిలుంది
న్యూఢిల్లీ: నాలుగు పదుల వయసున్నా... ఏళ్ల తరబడి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నా... తనలో వన్నె తగ్గలేదని మాటల్లో కాదు... చేతల్లో నిరూపించాడు వెటరన్ స్టార్ శరత్ కమల్. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించాడు. అయితే తన కెరీర్లో 2006 నుంచి ఎన్నో కామన్వెల్త్ పతకాలున్నప్పటికీ ఒలింపిక్స్ పతకం మాత్రం లోటుగా ఉందని, అదే తన లక్ష్యమని శరత్ తెలిపాడు. 20 ఏళ్లుగా ఆడుతున్నప్పటికీ రిటైర్మెంట్ ఆలోచనే రావడం లేదని, ఆటపై తన ఉత్సాహాన్ని వెలిబుచ్చాడు. ‘ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ‘మూడు’గా ఉన్న అత్యధిక పతకాల సంఖ్య తాజా ఈవెంట్లో ‘నాలుగు’కు చేరింది. పూర్తి ఫిట్నెస్ ఉండటంతో ఇకమీదట ఆడాలనే తపనే నన్ను నడిపిస్తోంది. నేనెప్పుడు శారీరకంగానే కాదు మానసికంగాను దృఢంగా ఉండేందుకే ప్రయత్నిస్తా. కుర్రాళ్లతో సహ పోటీపడాలంటే వాళ్లంత చురుగ్గా ఉండాలి కదా! ఓవరాల్‌గా ఇన్నేళ్లలో కామన్వెల్త్ గేమ్స్‌లో 13 సాధించిన నా విజయవంతమైన కెరీర్లో ఒలింపిక్స్ పతకమే బాకీ ఉంది. దాని కోసం మరింత మెరుగయ్యేందుకు శ్రమిస్తున్నాను’ అని శరత్ కమల్ వివరించాడు. పారిస్ ఒలింపిక్స్‌కు రెండేళ్ల సమయం వుండటంతో ముందుగా టీమ్ ఈవెంట్లో అర్హత సాధించడంపై దృష్టి సారిస్తాననని చెప్పాడు. తన తొలి కామన్వెల్త్ (2006)లో సాధించిన స్వర్ణంతో బర్మింగ్‌హామ్ స్వర్ణాన్ని పోల్చకూడదని అన్నాడు. యువ రక్తంతో ఉన్న తనపై అప్పుడు ఎలాంటి అంచనాల్లేవని, కానీ ఇప్పుడు సీనియర్‌గా తనపై గురుతర బాధ్యత ఉండిందని శరత్ వివరించాడు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిందని, పోటీతత్వం అంతకంతకు పెరిగిందని అవన్నీ దాటుకొని ఈ వయసులో బంగారం గెలవడం ఎనలేని సంతోషాన్నిస్తోందని చెప్పాడు. -
400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యానికి చేరువ
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్–2022 మార్చి) 400 బిలియన్ డాలర్ల తన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించనుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మార్చి 14వ తేదీ నాటికి భారత్ ఎగుమతుల విలువ 390 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపారు. ఆటో విడిభాగాల పరిశ్రమ మొట్టమొదటిసారి 600 మిలియన్ డాలర్ల మిగులు రికార్డును సాధించినట్లు వెల్లడించారు. ఆటో తయారీదారులు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, దిగుమతుల ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ఆటోమోటివ్ కాంపోనెంట్ రంగానికి సంబంధించి జరిగిన ఒక కార్యక్రమంలో కోరారు. అలాగే పరిశోధనా అభివృద్దిపై (ఆర్అండ్డీ) దృష్టి సారించాలని ఈ రంగానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి ఇందుకు సంబంధించి ఈ–మొబిలిటీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జీఐ ట్యాగ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగాలి... కాగా, స్థానికంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) ట్యాగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరగాల్సిన అవసరం ఉందని వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దిశలో ప్రభుత్వం కొన్ని కొత్త ఉత్పత్తులను, వాటిని ఎగుమతి చేయాల్సిన దేశాలను గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో జీఐ ట్యాగ్ ఉన్న పలు ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, ఆయా ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో ‘ఉత్సుకత’ ఉన్న కొనుగోలుదారులను చేరలేకపోతున్నాయని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) ద్వారా ప్రభుత్వం పలు చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించింది. జీఐ ఉత్పత్తులంటే... జీఐ ట్యాగ్ ఉత్పత్తుల్లో తిరుపతి లడ్డూసహా కాలా నమక్ బియ్యం, నాగా మిర్చా, బెంగళూరు రోజ్ ఆనియన్, షాహి లిచ్చి, భలియా గోధుమలు, దహ ను ఘోల్వాడ్ సపోటా, జల్గావ్ అరటి, వజ కులం పైనాపిల్, మరయూర్ బెల్లం, డార్జిలింగ్ టీ, బాస్మ తీ రైస్. మహాబలేశ్వర్ స్ట్రాబెర్రీ, బ్లూ పాటరీ ఆఫ్ జైపూర్, బనారసి చీర వంటివి ఉన్నాయి. ఇప్ప టివరకు 417 నమోదిత జీఐ ఉత్పత్తులు ఉన్నాయి. అందులో దాదాపు 150 వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు. 2021లో జీఐ ఉత్పత్తులు భారీగా ఎగుమతులు జరిగిన విభాగాలను పరిశీలిస్తే.. నాగాలాండ్ నుండి బ్రిటన్‌కు నాగా మిర్చా (కింగ్ చిల్లీ) ఒకటి. మణిపూర్, అస్సాం నుండి బ్రిటన్‌కు బ్లాక్‌రైస్ ఎగుమతులు జరిగాయి. అస్సాం నుంచి బ్రిటన్, ఇటలీలకు నిమ్మకాయల ఎగుమతులు జరిగాయి. జీఐ అనేది నిర్దిష్ట భౌగోళిక మూలాన్ని కలిగి ఉన్న ఉత్పత్తులపై వినియోగించే ఒక బ్రాండ్ సంకేతం. ఆ మూలం కారణంగా ఉన్న నిర్దిష్ట లక్షణాలను లేదా ఖ్యాతిని సంబంధిత ఉత్పత్తి కలిగి ఉంటుంది. అటువంటి పేరు ప్రఖ్యాతలు ఉత్పత్తి నాణ్యత, విశిష్టతలకు సంబంధించిన హామీని వినియోగదారులకు అందిస్తుంది. -
2021లో ప్రముఖుల లక్ష్యాలేంటో ఓ లుక్కేద్దాం..
కొత్త సంవత్సరం వస్తుందనగానే.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మనలో చాలా మంది లక్ష్యం పెట్టుకుంటారు.. చేస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. న్యూఇయర్ రిజల్యూషన్ పెట్టుకోవడం అన్నది పరిపాటి. వీటిని కచ్చితంగా పాటించేవాళ్లు కొందరైతే.. 31న ఒట్టు పెట్టుకుని.. ఒకటో తేదీ సరికి దాన్ని గట్టు మీద పెట్టేసేవాళ్లు మరికొందరు.. మన సంగతి అలా ఉంచితే.. నిత్యం బిజీబిజీగా గడిపే ప్రముఖులు ఈసారి ఏమనుకుంటున్నారు? ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారు? అసలు 2021లో స్వదేశీ వస్తువులకే ‘సై’ అన్న ప్రముఖ వ్యక్తి ఎవరు? సొంతూళ్లో ఇల్లు కట్టుకోవడమే ఈ ఏడాది టార్గెట్ అన్న కామ్రేడ్ ఎవరు? హరీశ్‌రావు ఏం చేస్తానన్నారు? సీఎస్ ఏం రాస్తారన్నారు? ఇంతకీ కొత్త ఏడాదిలో డీజీపీ మహేందర్‌రెడ్డి టార్గెట్ ఏమిటి? లోకల్కేవోకల్.. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ లోకల్–వోకల్ నినాదం ఇచ్చారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని 2021లో పూర్తిగా స్వదేశీ వస్తువులనే వాడాలని నిర్ణయించా. రోజూ ఉదయం గంటసేపు యోగ, వ్యాయామం చేస్తాను. సమతుల ఆహారం నేను తీసుకుంటుంటాను. కొత్త ఏడాదిలో ఈ విషయాల్లో శ్రద్ధ పెట్టాలని భావిస్తున్నాను. ఆరోగ్య పరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. – రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటిదాక చదివా.. ఇక రాస్తా కొత్త సంవత్సరంలో బాగా పుస్తకాలు చదవడంతో పాటు పుస్తకాలు రాయడాన్ని మళ్లీ ప్రారంభించాలని ఆలోచిస్తున్న. మెథడ్స్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ పేరుతో ఇప్పటికే రాసినా.. వాటిని గూగుల్‌లో ఎవరైనా చూడవచ్చు. ఈ ఏడాది అభివృద్ధి అనే అంశంపై పుస్తకాలు రాయాలనుకుంటున్నా. అంతేకాదు.. ఆరోగ్యంపై మరింత ఫోకస్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ ఏడాది వ్యాయామం చేయడం ప్రారంభిస్తా. – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌పైనే.. శరీరం ఫిట్‌గా ఉంటే ఎలాంటి వ్యాధినైనా, విపత్తునైనా ఎదుర్కోగలుగుతాం. మానవాళిపై కరోనా వైరస్ విసిరిన పంజా మన ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పింది. అందుకే, కొత్త సంవత్సరంలో హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నాను. నాతోపాటు కుటుంబసభ్యుల ఆరోగ్యంపైనా శ్రద్ధ పెడతా. – డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి రెండు మూడు ఉన్నాయి.. నాకు రెండు, మూడు లక్ష్యాలు ఉన్నాయి. సహజసిద్ధమైన అడవులు, సుందర ప్రదేశాలతోపాటు నదుల వెంట పయనిస్తూ చేసే ప్రయాణం నాకెంతో ఇష్టం. అందుకే ప్రత్యేకమైన అటవీ, వృక్ష సంపదకు, సముద్ర జీవనానికి కేరాఫ్ అయిన అండమాన్, నికోబార్ దీవులను ఈ కొత్త సంవత్సరంలో తప్పక విజిట్ చేస్తాను. ఈ ఏడాది చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, కల్పిత సాహిత్యం మరింత ఎక్కువ చదవాలనుకుంటున్నాను. – ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.శోభ సిక్స్ డేస్ ఏ వీక్.. ఈ ఏడాది తప్పనిసరిగా వారంలో ఆరు రోజులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నది నా లక్ష్యం. గతేడాది అనుకున్నా.. సాధ్యమవలేదు.. ఈసారి మాత్రం పక్కా.. శారీరక దృఢత్వంతోనే మానసిక సంకల్పం కూడా బలంగా ఉంటుందని నేను నమ్ముతాను. అంతేకాదు.. ఆత్మవిశ్వాసంతోపాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.. – స్వాతి లక్రా, ఏడీజీ, విమెన్ సేఫ్టీ వింగ్ నేను.. నా రెహాన్.. ఈ బిజీబిజీ పనుల్లో నేను గ్రహించనే లేదు.. నా కొడుకు రెహాన్ పెద్దవాడు అయిపోతున్నాడు. వాడికిప్పుడు 12 ఏళ్లు. ఈ కొత్త ఏడాది వాడికి బెస్ట్ ఫ్రెండ్‌గా మారాలని నిర్ణయించుకున్నా.. ఈ సంవత్సరం ఎలా ఉందో చూశాం. అందుకే 2021లో ఫిట్నెస్ మీద ఫోకస్ పెడతా. వ్యాయామానికి మరింత టైం కేటాయిస్తాను. – సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ ఎల్ఎల్ఎం పూర్తి చేయాలి 2015లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత ఎల్ఎల్ఎం కోసం అడ్మిషన్ తీసుకున్నా. అయితే పని ఒత్తిడి నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయా. 2021లో అది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు ఇచ్చే తర్ఫీదును మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాను. – రాచకొండ సీపీ మహేష్ భగవత్ బోలెడు పుస్తకాలు చదవాలి ఇప్పటివరకు వీకెండ్లో ఒక పుస్తకం మాత్రమే చదివేవాడిని. 2021లో మాత్రం ప్రతీ వీకెండ్లో బోలెడన్ని పుస్తకాలు చదవాలని డిసైడ్ అయ్యా. బోలెడన్ని అంటే కనీసం మూడు నాలుగు పుస్తకాలైనా చదవాలి. గతంలో మూడు నెలలకోసారి సెలవులపై దేశ విదేశాలకు టూర్ వెళ్లేవాడిని. కొత్త సంవత్సరంలో మాత్రం కనీసం రెండు నెలలకోసారి వారం రోజులపాటు సెలవులపై వెళ్లాల్సిందే. – సన్‌షైన్ ఎండీ డా. గురువారెడ్డి లాస్ట్ ఇయర్‌లా చేయను.. అందరూ తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని కోవిడ్ పరిస్థితులు నొక్కి చెప్పాయి. నేను చాలా కాలంగా యోగా చేస్తున్నా.. అయితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వల్ల నాలుగు నెలల నుంచి చేయడం లేదు. ఈమారు గత ఏడాదిలా కాదు.. యోగాపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా.. అలాగే ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలని నిర్ణయం తీసుకున్నా. – మంత్రి టి.హరీశ్‌రావు ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజా జీవితంలో ఉండేవాళ్లు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ ఉంటారు. అందుకేవ్యక్తిగత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని అనుకుంటున్నా. అలాగే నా జీవితంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఇన్నాళ్లూ రాజకీయాల్లో లెఫ్టిజమ్, రైటిజం అంటూ అనేక ఇజాలు వింటూ వచ్చాం. కానీ రాబోయే రోజుల్లో అంతా గ్రీనిజమే. – ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ 5 కి.మీ. వాకింగ్ మస్ట్.. నాకు వాకింగ్ చేసే అలవాటు ఉంది. అయితే.. రెగ్యులర్‌గా చేయలేకపోతున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మాత్రం అలా చేయను. 2021లో శరీర దారుఢ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక నడక మానే ప్రసక్తే లేదు. రోజూ ఉదయం, సాయంత్రం కనీసం 5 కిలోమీటర్లు తగ్గకుండా నడుస్తా.. వ్యక్తిగతంగా కొత్త సంవత్సరంలో నేను నిర్దేశించుకుంటున్న లక్ష్యం ఇదే.. – టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ఊర్లో ఓ ఇల్లు ఈ మధ్య చలో సొంతూరు నినాదం పెరుగుతోంది. నాక్కూడా సొంతూళ్లో ఇల్లుండాలనే కోర్కె బలంగా ఉంది. అమెరికాలో వున్న పిల్లలు అప్పుడప్పుడు వచ్చి.. మన పద్ధతులు చూడకుంటే.. మనతో మమేకం కాలేరు.. అందుకే మేం కూడా ఊర్లో ఇల్లు కట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఇక అభ్యుదయ సంగీతం , అన్నమయ్య కీర్తనలు , ఫ్లూట్ మ్యూజిక్ నాకిష్టం.. అవి వింటూ.. అలా మనవళ్లతో కాలక్షేపం చేయాలని ఉంది. – సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ -
టార్గెట్ బెంగాల్..?
-
టార్గెట్ చైనా.!
-
చిన్న లక్ష్యాలు పెట్టుకోను
న్యూఢిల్లీ: అనూహ్య పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటం కారణంగా మేలు పొందిన వారిలో భారత దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ ఒకడు. వ్యక్తిగత విభాగంలో రెండు ఒలింపిక్ పతకాలు గెలుపొందిన ఏకైక భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించిన సుశీల్... ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాడు. తాను బరిలో దిగే 74 కేజీల వెయిట్ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్ కోసం తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, తన పనైపోయిందంటూ పలువురు విమర్శలు చేస్తున్నప్పటికీ అవేమీ తనను ప్రభావితం చేయలేవంటున్నాడు. టోక్యో పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నానన్న సుశీల్ మనోగతం అతని మాటల్లోనే... వారికి అలవాటే... చాలా కాలం నుంచి నా గురించి ఎవరికి తోచింది వారు రాయడం అందరికి అలవాటైపోయింది. కానీ వారి రాతలు, అభిప్రాయాలు నాపై ప్రభావం చూపలేవు. 2011లోనే సుశీల్ పనైపోయిందని అన్నారు. కానీ 2008 బీజింగ్‌లో గెల్చిన కాంస్య పతకాన్ని లండన్ 2012 ఒలింపిక్స్‌లో రజతంగా మార్చాను. ఈ వ్యాఖ్యల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. ఇది నాకు రోజువారీ కార్యక్రమం అయిపోయింది. సన్నద్ధతకు ఇదే సమయం... మరో నెల రోజుల్లో నేను 37వ పడిలో అడుగుపెడతా. అయితేనేం... నేను రెజ్లింగ్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. ఒలింపిక్ బెర్తు సంపాదించేందుకు ప్రస్తుతం నాకు మంచి సమయం లభించింది. దీన్ని నేను టోక్యో సన్నద్ధత కోసం వినియోగించుకుంటా. గాయాల బారిన పడకూడదు... రెజ్లింగ్ క్రీడలో గాయాల బారిన పడకుండా, మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలు. మనం అనుకున్నది సాధించవచ్చు. నేను ఇప్పటికీ రోజులో రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తున్నా. మ్యాచ్ ఫిట్నెస్తో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. దేవుని దయతో టోక్యో ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధిస్తాననే నమ్మకముంది. నర్సింగ్కు అభినందనలు... డోపింగ్‌లో పట్టుబడి నాలుగేళ్ల నిషేధం తర్వాత తిరిగి జూలైలో బరిలో దిగనున్న నర్సింగ్ యాదవ్‌కు అభినందనలు. పునరాగమనం అతనికి అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటున్నా. నర్సింగ్‌తో పోటీ గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేను. సమయం వచ్చినప్పుడు దాని గురించి చూద్దాం. రియో ఒలింపిక్స్‌కు నర్సింగ్ కారణంగానే సుశీల్ దూరమైన సంగతి తెలిసిందే. విదేశీ రెజ్లర్లే నా ప్రత్యర్థులు... చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే మనం ఏదీ సాధించలేం. జితేందర్ కుమార్, నర్సింగ్ యాదవ్‌లు కాదు... ఉజ్బెకిస్తాన్ రెజ్లర్, ఆసియా క్రీడల స్వర్ణపతక విజేత బెక్జోడ్ అబ్దురఖ్మోనోవ్లాంటి ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపై దృష్టి సారించా. నా సన్నాహాలు మేటి రెజ్లర్లను ఎదుర్కొనేలా సాగుతున్నాయి. -
చేయగలిగిన వాటినే లక్ష్యంగా పెట్టుకోండి...
అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకుని సాధించలేకపోయామని బాధపడేకంటే జీవితంలో వాస్తవికతకు దగ్గరగా ఉండే లక్ష్యాలను ఏర్పర్చుకోవడమే చీకూ చింతాలేని, ఆరోగ్యకరమైన ఆనందమయమైన జీవితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలా ఆచరణయోగ్యమైన లక్ష్యాలను ఏర్పర్చుకున్న వారే ఆనందంగా ఉండగలుగుతున్నారని యూనివర్సిటీ ఆఫ్ బేసెల్ మానసిక శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనం వెల్లడించింది. సంపద, ఆరోగ్యం, అర్థవంతమైన పని, కమ్యూనిటీ, జీవిత లక్ష్యాలు, ఆవ్యక్తిని నడిపించేవారిని బట్టి ఆ వ్యక్తి స్వభావం ఆధారపడి ఉంటుందని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బేసెల్ శాస్త్రవేత్తల అధ్యయనం తేల్చి చెప్పింది. ప్రజలు ఎంత సంతృప్తికరంగా ఉన్నారు? లేదా అనుకున్నవి సాధించలేనప్పుడు ఎంత అసంతృప్తితో ఉన్నారు అనే విషయాలు వారు పెట్టుకున్న లక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని ఈ సర్వే వెల్లడించింది. స్విట్జర్లాండ్‌లోని జెర్మన్ భాష మాట్లాడే ప్రాంతాల్లోని 18 ఏళ్ళ నుంచి 92 ఏళ్ళ మధ్య వయస్సులో ఉన్న 973 మందిపై చేసిన ఈ సర్వే వివరాలను యూరోపియన్ జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ లో ప్రచురించారు. అధ్యయనంలో పాల్గొన్న సగానికిపైగా మందిని రెండు, మూడేళ్ళ తరువాత కూడా మళ్ళీ సర్వే చేసారు. ఆరోగ్యం, కమ్యూనిటీ, వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక సంబంధాలూ, సంపద, కీర్తి ప్రతిష్ట, కుటుంబమూ, భవిష్యత్ తరాల పట్ల బాధ్యత, అర్థవంతమైన పని తదితర పది అంశాలపై ఈ అధ్యయనం జరిపారు. ఒక వ్యక్తి ఏర్పర్చుకున్న సాధించగలిగే వ్యక్తిగత లక్ష్యాలు ఆ వ్యక్తి శ్రేయస్సుపైనా, భవిష్యత్ ఆరోగ్యంపైన ఆధారపడి ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. మనుషులు దేనిమీదైనా నియంత్రణ కలిగి ఉన్నప్పుడు, దేన్నైనా సాధించినప్పుడు ఎక్కువ సంతృప్తికరంగా ఉన్నట్టు, వాళ్ళు ఊహించిన దానికన్నా మంచి జీవితాన్ని అనుభవించినట్టు తేలింది. సామాజిక సంబంధాలకు సంబంధించిన లక్ష్యాలూ, ఆరోగ్యానికి సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించుకున్న వారు వారి వ్యక్తిగత ఆరోగ్యం విషయంలోనూ, సామాజిక సంబంధాల విషయంలోనూ సంతృప్తికరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీవిత లక్ష్యాలూ, వ్యక్తి శ్రేయస్సూ వారి వారి వయస్సుని బట్టి ఆధారపడి ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఆయా సందర్భాన్నీ, పరిస్థితిని బట్టీ ప్రజలు తాము సాధించాలనుకునే లక్ష్యాలు ఆధారపడి ఉంటాయి. యువతరం తమ వ్యక్తిగత అభివృద్ధీ, హోదా, ఉద్యోగం, సామాజిక సంబంధాలను ప్రథమ లక్ష్యాలుగా భావిస్తుంటే, వయోజనులు మాత్రం సామాజిక సంబంధాలూ, ఆరోగ్యం తమకు ప్రథమ ప్రాధాన్యత అని అభిప్రాయపడుతున్నారు. -
మహిళల భద్రత : రాహుల్ విమర్శలు
సాక్షి,న్యూఢిల్లీ: మహిళల భద్రత విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశంగా తయారైందన్న రాయిటర్స్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో మహిళలకు భద్రత పూర్తిగా కరువైందనీ, హింసాకాండలో అఫ్గనిస్తాన్, సిరియా, సౌదీ అరేబియాలను మించి మరింత ప్రమాదకరంగా మారిందన్న రాయిటర్స్ నివేదికపై ఆయన స్పందించారు. ఈ సందర్బంగా మోదీ ఫిట్నెస్ వీడియోను టార్గెట్ చేసిన రాహుల్ ఈ మేరకు ట్విటర్లో ఒక పోస్ట్ పెట్టారు. మహిళలపై హింస, అత్యాచారాల విషయంలో దేశం ప్రథమస్థానంలో నిలవడం సిగ్గు చేటైన విషయంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తన దాడిని ఎక్కుపెట్టారు. ప్రధాని అందమైన, సురక్షితమైన పచ్చటి మైదానాల్లో ప్రధాని యోగా వీడియోలను తీసుకుంటోంటే, మహిళలపై అత్యాచారాలు, హింసాకాండలో దేశం ఇతర దేశాలను అధిగమించి పోతోందంటూ మండిపడ్డారు. ఇది దేశానికి ఎంత అవమానకరమంటూ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా భారతదేశంలోలోని మహిళలు ఎక్కువగా లైంగిక హింసకు గురవుతున్నట్టు, మహిళలకు భద్రత లేకుండా పోతోందని థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. అమ్మాయిలను కిడ్నాప్ అయ్యే అవకాశాలు ఎక్కువని తేల్చింది.అంతేకాదు వీటిని నిరోధించడంలో చట్టాలు, న్యాయ వ్యవస్థ విఫలం అయ్యాయని కూడా పేర్కొంది. ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం, సెక్స్ బానిసలుగా మార్చేయడం, వ్యభిచార కూపంలోకి దింపడం లాంటి కార్యకలాపాలు ఎక్కువని సర్వే తేల్చింది. దేశంలో స్త్రీల భద్రత గతంలో ఎన్నడూ లేని రీతిలో అట్టడుగు స్థాయికి చేరిందని రాయిటర్స్ తెలిపింది. ఏడేళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో (2011) భారత్ నాలుగో స్థానంలో ఉంది. 2030 నాటికి మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న హింసను పూర్తిగా అరికట్టాలని స్వేచ్ఛగా బతికేలా వారికి అవకాశం కల్పించాలని మూడేళ్ల క్రితం ప్రపంచ దేశాల నేతలు ప్రతిన బూనారు. కానీ ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారని రాయిటర్స్ అధ్యయనం తేల్చింది. మహిళల భద్రతపై సర్వే తేల్చిన అంశాలపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
అంతా నా ఇష్టం
అధికార పార్టీకి చెందిన కీలక నేత సిఫారసుతో నియామకం.. మరో వివాదాస్పద ప్రజాప్రతినిధి ప్రోత్సాహం.. ఇక తిరుగేం ఉంటుంది. అందుకే ఆ పోలీస్ అధికారి అన్నింటికీ అతీతుడు. నిబంధనలు పట్టించుకోరు. సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోకూడదన్నా అసలే పట్టదు. అధికార పార్టీ నేతల దందాలకు ఏకపక్షంగా వత్తాసు పలుకుతారు. కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ వేధిస్తారు. ఆయన బదిలీలకూ అతీతమే. కొన్నేళ్లుగా ఎంతోమంది అధికారులు బదిలీ అవుతున్నా.. బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఆయన మాత్రం జిల్లాలోనే కొనసాగుతూ వివాదాస్పదంగా మారారు. సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ పోలీస్ కమిషరేట్‌లో ఓ మధ్యస్థాయి పోలీస్ అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. జిల్లాలో కీలక టీడీపీ నేత అండదండలతో ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నారు. దీంతో ఆయనంటే ఉన్నతాధికారులు హడలిపోతారు. ఇక విజయవాడలో దందాలతో బెంబేలెత్తిస్తున్న ఓ ప్రజాప్రతినిధి అండదండలూ ఆయనకు ఉన్నాయి. కొన్నేళ్లుగా ఆయన వివాదాస్పదంగా మారుతున్నా అడ్డుకునే వారే లేరు. రెండుసార్లు అధికారులను బదిలీచేసినా ఆయనకు మాత్రం స్థానచలనం లేదు. అసలు ఆయనను బదిలీ చేయాలన్న యోచనకే ఉన్నతాధికారులు సాహసించలేకపోతున్నారని పోలీస్ వర్గాలే చెబుతున్నాయి. వివాదాస్పదంగా మారిన ఆ అధికారి వ్యవహారాల్లో కొన్ని ఉదాహరణలు.. - ఇటీవల విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో 20 సెంట్ల ప్రైవేట్ భూమిని టీడీపీ నేతలు ఆక్రమించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం ఖరీదు దాదాపు రూ.2కోట్లు. ఆ స్థల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజక్షన్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ, ఆ ఉత్తర్వులను అమలు చేయడానికి ఈ పోలీస్ అధికారి ససేమిరా అన్నారు. అప్పటికే అక్కడ తాత్కాలిక గుడారాలు వేసుకుని ఉన్న అధికార పార్టీ నేతలకు వత్తాసు పలికారు. తమకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కదా అని బాధితులు అనడంతో పోలీస్ అధికారి శివాలెత్తిపోయారు. ఎక్కువగా మాట్లాడితే అంతు చూస్తానని బెదిరించారు. అధికార పార్టీ నేతలు రూ.50 లక్షల వరకు ఇస్తారు. అవి తీసుకుని స్థలాన్ని వదిలేయాలని కూడా అధికారి వారికి చెప్పడంతో బాధితులకు నోట మాట రాలేదు. రూ.2 కోట్ల స్థలాన్ని కేవలం రూ.50 లక్షలకు విక్రయించాలని ఆ అధికారి సెటిల్మెంట్ పేరుతో దందా చేయడం విస్మయపరిచింది. - ఆ పోలీసు అధికారి తన పరిధిలోని కిందిస్థాయి అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లపర్వం కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కిందిస్థాయి సిబ్బంది ప్రధానంగా బంగారు వర్తకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. తరచూ చిన్న బంగారు వర్తకులను అదుపులోకి తీసుకుని రికవరీల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏ దొంగతనం కేసు అన్నది కూడా చెప్పకుండా ఏకపక్షంగా రికవరీలంటూ వసూళ్లకు పాల్పడుతుండటంతో చిరు వర్తకులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతోపాటు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, ఇతర చిన్నచిన్న వ్యాపారులను పెట్టీ కేసుల పేరుతో వేధిస్తున్నారు. - విజయవాడ శివారులోని గొల్లపూడి– ఇబ్రహీంపట్నం మధ్యలో చాలా ఏళ్ల క్రితం రిటైర్డ్ ఉద్యోగులు, వన్‌టౌన్‌కు చెందిన చిన్న వ్యాపారులు ప్లాట్లు కొన్నారు. కానీ, రాష్ట్ర విభజన తరువాత ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో జిల్లా కీలక నేత అనుచరులు ఆ ప్రాంతంలో ఉన్న అసైన్డ్ భూములతోపాటు ఈ ప్లాట్లను కూడా చదును చేసి లే అవుట్ వేశారు. దాదాపు 30 ప్లాట్ల వరకు అలా కలిపేసుకున్నారు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు అభ్యంతరం తెలిపారు. పోలీసులను ఆశ్రయించారు. కానీ, ఆ పోలీస్ అధికారి కబ్జాదారులకు అనుకూల వాదన వినిపించారు. ‘వాళ్లంతా పెద్ద వాళ్ల మనుషులు. వారితో గొడవ ఎందుకు..? ఎంతో కొంత తీసుకుని ఆ ప్లాట్లు వదిలేయండి’ అని చెప్పడం గమనార్హం. అందుకు వ్యాపారులు ససేమిరా అనడంతో వారిపై ఆ పోలీస్ అధికారి ఆగ్రహించారు. మాట వినకపోతే వన్‌టౌన్‌లో వ్యాపారాలు చేసుకోలేరని పరోక్షంగా హెచ్చరించారు. -
వీసీగా నాలుగు లక్ష్యాలను ఎంచుకున్నా
మూడు పూర్తయ్యాయి అనూర్ వార్షికోత్సవ సభలో వీసీ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన నాడే నాలుగు లక్ష్యాలను ఎంచుకున్నట్టు ఆచార్య ఎం. ముత్యాలునాయుడు తెలిపారు. వాటిని సాధించడంలో నన్నయ యూనివర్సిటీ సిబ్బంది అంతా ఒకే కుటుంబంలా త్రికరణశుద్ధితో పనిచేశారంటూ అభినందించారు. యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నాలుగు లక్ష్యాలలో మొదటిది తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద యూనివర్సిటీగా అనూర్ అందరికీ తెలిసేలా చేయడం, రెండోది యూనివర్సిటీకి నిధులు సమీకరించడం, మూడోది అనూర్ పరిధిలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ కళాశాలలను బదిలీ చేయడం అని తెలిపారు. ఈ మూడు లక్షా ్యలు పూర్తయ్యాయన్నారు. నాల్గో లక్ష్యంగా ఎంచుకున్న 12 బీ గుర్తింపు కోసం ప్రయత్నించామని, గురు, శుక్రవారాలలో యూజీసీ కమిటీ సభ్యులు కూడా ఇక్కడకు వచ్చి, యూనివర్సిటీ పరిస్థితులను, సాధించిన ప్రగతిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. శ్రీకృష్ణదేవరాయులు యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య పీఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ సమష్టి కృషితో ఏదైనా సాధించవచ్చని నన్నయ యూనివర్సిటీ సిబ్బంది నిరూపించారన్నారు. 2006 ఏప్రిల్‌లో ప్రారంభమైన నన్నయ యూనివర్సిటీ నేటి వరకు ఎదుర్కొన్న వివిధ సమస్యలు, సాధించిన విజయాలను పలువురు వక్తలు ప్రస్తావించారు. మొక్కలు నాటారు.. అనూర్ ఆవిర్భావ దినోత్సవంతోపాటు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం కూడా కావడంతో ఉపకులపతి ఆచార్య ముత్యాలునాయుడు యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్. లింగారెడ్డి, డీన్ ఆచార్య ఎస్. టేకి, ప్రిన్సిపాల్స్ ఆచార్య కేఎస్ రమేష్, ఆచార్య పి. సురేష్‌వర్మ, డాక్టర్ ఎ. మట్టారెడ్డి, డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
లవర్స్ టార్గెట్‌గా దోపిడీ చేస్తున్న హోంగార్డు
-
మరీ ఒత్తిడికి లోనుకావద్దు...
ఫ్యామిలీ డాక్టర్ నా వయసు 35 ఏళ్లు. ఒక ప్రైవేటు కంపెనీలో ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాను. మాకు ఎప్పటికప్పుడు టార్గెట్స్ ఉంటాయి. ఇతర కంపెనీల నుంచి పోటీ వల్ల పని ఒత్తిడి కూడా ఎక్కువైంది. అయితే కొంత కాలం నుంచి నేను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాను. గుండె బరువుగా ఉండటం, ఛాతీలో నొప్పి రావడంతో పాటు ఒక్కోసారి గుండె అతి వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాను. డాక్టర్‌ను కలిస్తే బీపీ ఉందని చెప్పారు. మందులు రాసిచ్చారు. వాడుతున్నాను. ఉద్యోగపరమైన ఒత్తిడి తగ్గించుకోవాలన్నారు. కానీ టార్గెట్ పూర్తి చేస్తేనే జీతం వస్తుంది. ఈ వయసులో ఉద్యోగం మారలేను. పని ఒత్తిడి వల్ల నాకు భవిష్యత్తులో ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి చెప్పండి. - శ్రీధర్, నిడదవోలు సాధారణంగా బీపీ లేదా గుండెజబ్బులు అప్పట్లో వయసు రీత్యా మాత్రమే వచ్చేవి. కానీ గత దశాబ్దకాలం నుంచి పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. ఉద్యోగం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి లేదా ఇతరత్రా కారణాల వల్ల నిండా పాతికేళ్లు నిండని వయసు వాళ్లలో కూడా గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. ఒక్కోసారి తీవ్రమైన అనర్థాలు కూడా జరుగుతున్నాయి. బీపీతో మొదలైన సమస్య తీవ్రమైన గుండెపోటుకు దారితీస్తుంది. చికిత్స అందించి ప్రాణాలను కాపాడే సమయం కూడా ఒక్కోసారి ఉండకపోవచ్చు. గుండె సమస్యలనేవి ఆ స్థాయిలో లోలోపలే చేయాల్సిన చేటును చేసేస్తాయి. ఇక మీ విషయానికి వస్తే... మీరు చెబుతున్న లక్షణాలు గుండెకు సంబంధించిన సమస్యలేనని కచ్చితంగా చెప్పవచ్చు. పని ఒత్తిడి వల్ల ఇప్పటికే మీరు బ్లడ్ ప్రెషర్ బారిన పడ్డారు. అలాగే మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి కావడం వల్ల గుండె లయలోనూ మార్పులు సంభవిస్తున్నట్లు కనిపిస్తోంది. మీరు ఎక్కువగా మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తుండటంతో అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమస్య ఇప్పుడు చిన్నదిగా కనిపించినా, ఆ తర్వాత బీపీ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. మీ కుటుంబలోగానీ, మీ వంశంలో గానీ ఎవరికైనా గుండెజబ్బులు లాంటివి ఉంటే త్వరగా అవి మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్‌ను కలిసి వీలైనంత త్వరగా సరైన పరీక్షలు చేయించి, గుండె పనితీరును తెలుసుకొని తగిన మందులు వాడాల్సిన అవసరం ఉంది. మీరు సాధ్యమైనంతవరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త వహించండి. రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయాయం, లేదా వాకింగ్ చేయండి. మంచి జీవనశైలి నియమాలు పాటించండి. పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మానసికంగానూ ప్రశాంతత చేకూరుతుంది. ఆరోగ్యమూ కుదుట పడుతుంది. డాక్టర్ ఎ. రవికాంత్ సీనియర్ కార్డియాలజిస్ట్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ తలనొప్పి తగ్గేదెలా? నాకు 26 సంవత్సరాలు. గత మూడు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. తల చుట్టూ తాడు బిగించినట్లుగా నొప్పి వస్తోంది. ఒక్కోసారి రోజంతా కూడా వస్తోంది. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - నీరజ్, వరంగల్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు టెన్షన్ తలనొప్పితో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఆలోచనలు ఎక్కువ కావడం, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి ఎక్కువ కావడం, మానవసంబంధాలలో మార్పులు రావడం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనం ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగపడే రిలాక్సేషన్ థెరపీ, కౌన్సెలింగ్‌తో తగిన ఉపశమనం పొందవచ్చు. అప్పటికీ తగ్గకపోతే మందులు వాడటంతో కూడా యాభై శాతం కేసుల్లో తలనొప్పిని తగ్గించవచ్చు. దాదాపు మూడు నుంచి ఆరు నెలల పాటు ఈ మందులు వాడాల్సి ఉంటుంది. అయితే ముందుగా మీ సమస్యకు ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, సమస్యను నిర్ధారణ చేసుకున్న తర్వాతే మందులు వాడాలి. నా వయసు 30 ఏళ్లు. గత పదేళ్లుగా తలనొప్పితో బాధపడుతున్నాను. తలనొప్పి వచ్చే ముందు చూపు సరిగా కనిపించదు. తర్వాత భరించలేనంత నొప్పి వస్తోంది. ఆ తర్వాత ఏ మాత్రం శబ్దం విన్నా, ఎండ చూసినా తట్టుకోలేకపోతున్నాను. నొప్పి వచ్చిన రెండు రోజుల వరకు నీరసించిపోతున్నాను. మా అమ్మగారికి కూడా తలనొప్పి వస్తోంది. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి. - శైలజ, విజయవాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న యువతుల్లో ఎక్కువ. వేళకి భోజనం చేయడం, ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం, కంటి నిండా నిద్రపోవడం వంటివి చేయడం ద్వారా దీన్ని చాలావరకు నివారించవచ్చు. అయితే బాగా ఎండలోగానీ, చలిలోగానీ బయటకు వెళ్లకపోవడం మేలు. పని ఒత్తిడి ఎక్కువైనా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పనిచేసే చోట సరైన పొజిషన్లో కూర్చుని పనిచేయడం కూడా ముఖ్యమే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చేయడం అవసరం. పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటిస్తూ, ఈ మైగ్రేన్ తలనొప్పి మళ్లీ రాకుండా మందులు వాడాల్సి ఉంటుంది. మీరు ముందుగా మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి, సమస్య నిర్ధారణ జరిగాక, తగిన మందులు వాడితే మీ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళీధర్‌రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ -
అన్నకు మసక.. చెల్లెళ్లకు మస్కా
పేదలకు చౌక ధరలకు ఔషధాలు అందించేందుకు నెలకొల్పిన అన్నసంజీవని పథకం నిర్వహణ గాడి తప్పింది. జిల్లావ్యాప్తంగా 37 దుకాణాలను ఏర్పాటు చేసిన అధికారులు అరకొరగానే ఔషధాలను సరఫరా చేస్తున్నారు. అమ్మకాలు పడిపోవడంతో ఐకేపీ సిబ్బందికి, డ్వాక్రా మహిళలకు టార్గెట్లు పెడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆచంట : పేదలకు చౌక ధరలకే ఔషధాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నసంజీవని దుకాణాలు డ్వాక్రా మహిళల పాలిట శాపంగా మారాయి. ఒక పక్క పెద్ద నోట్ల రద్దుతో చిల్లరనోట్ల కోసం నానాఇబ్బం దులు పడుతుంటే.. మరోపక్క మందులు కొనాల్సిందేనంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచి అమ్మకాలు పెంచుకోవాల్సిందిపోయి అడ్డదారుల్లో అమ్మకాలకు ప్రభుత్వం వెంపర్లాడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 38 దుకాణాల ఏర్పాటు జిల్లాలోని పట్టణాలు, వివిధ మండలాల్లో మొత్తం 38 అన్న సంజీవని దుకాణాలు ఏర్పాటు చేశారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రులు, నరసాపురం, భీమవరం, నిడదవోలులోని ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్‌సీలతోపాటు ఆచంట, పోలవరం, బుట్టాయగూడెం తదితర మండలాల్లో ఈ దుకాణాలు ఏర్పాట య్యాయి. వీటి నిర్వహణ బాధ్యతను ఐకేపీ అధికారులకు అప్పగించారు. షాపుల నిర్వహణ మొక్కుబడిగా సాగడం.. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో అమ్మకాలు పడిపోయాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అధికారులు అది విస్మరించి డ్వాక్రా సంఘాలకు మందులు అంటగడుతున్నారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల్లో నెలకు రూ.2 లక్షల వరకూ అమ్మకాలు సాగించాలంటూ ఐకేపీ సిబ్బందికి లక్ష్యాలు విధించారు. ఏం చేయాలో పాలుపోని ఐకేపీ సిబ్బంది మందులు కొనుగోలు చేయాలంటూ గ్రామాల్లోని డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి పెంచుతున్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులు రోగం లేకున్నా మందులు కొనాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఔషధాలు కొంటేనే రుణం ఒక్కో డ్వాక్రా సంఘంలో కనీసం పది మందికి తగ్గకుండా సభ్యులు ఉంటారు. ఒక్కొక్కరూ ప్రతి నెలా రూ.200 విలువైన మందులు కొనుగోలు చేయాలని ఐకేపీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అంటే ఒక్కో గ్రూపులో పదిమంది సభ్యులు ఉంటే కనీసం రూ.2 వేల విలువైన మందులు కొనుగోలు చేయాలి. ఈ విధంగా రోజుకు ఒకటి లేదా రెండు గ్రూపుల చేత మందులు కొనుగోలు చేయిస్తూ కొంతకాలంగా టార్గెట్లు చేరుకుంటున్నారు. మందులు కొంటున్నారో లేదో తెలసుకునేందుకు మరో మెలిక పెడుతున్నారు. మందులు కొన్నట్టు సంబంధిత దుకాణం నుంచి రశీదులు తెచ్చి కార్యాలయాల్లో చూపించాలని షరతు పెడుతున్నారు. ఈ విధమైన బలవంతపు కొనుగోళ్ల వ్యవహారం జిల్లాలోని అన్ని మండలాల్లో చడీచప్పుడు కాకుండా కొంతకాలం నుంచి సాగిపోతోంది. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే.. పైఅధికారులు నెలవారీ టార్గెట్లు పెడుతున్నారని నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు. సబ్బులు.. పేస్టులు.. టానిక్లూ అధికారుల ఒత్తిడితో ఔషధ దుకాణం వద్దకు వెళుతున్న డ్వాక్రా సంఘాల మహిళలకు దిక్కుతోచడం లేదు. రోగం లేకుండా ఏం మందులు కొనాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణానికి వెళ్లి తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని చెబితే.. మీకోసం ప్రత్యేకంగా మెడికేటెడ్ టూత్‌పేస్టులు, సబ్బులు, బలానికి టానిక్‌లు, మల్టీవిటమి¯ŒS టాబ్లెట్లు అందుబాటులో ఉంచామంటూ రూ.200కు సరిపడా సరుకులు అంటగడుతున్నారని మహిళలు వాపోతున్నారు. ఈ వ్యవహారాన్ని ఎవరికైనా చెప్పుకుంటే వారికి రుణం నఇవ్వరేమోన భయపడిపోతున్నారు. ఒక పక్క డ్వాక్రా సంఘాలకు ఆర్థిక పరిపుష్టినిచ్చి వారి కాళ్లమీద వారిని నిలబెడతామని చెబుతున్న పాలకులు.. ప్రభుత్వ పథకాన్ని మనుగడలో ఉంచడం కోసం చిరుద్యోగుల చేతి చమురు వదిలిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలవంతపు కొనుగోళ్ల వ్యవహారానికి స్వస్తి చెప్పాలని డ్వాక్రా మహిళలు జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై సంబంధిత శాఖ ఉన్నతాధికారిని ‘సాక్షి’ సంప్రదించగా టార్గెట్లు నిర్ణయించడం నిజమేననిన చెబుతూ.. తన పేరు మాత్రం రాయవద్దని కోరారు. -
చైనాను టార్గెట్ చేసిన అమెజాన్
బీజింగ్ : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇపుడు చైనాను టార్గెట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సర్వీసెస్ అందిస్తున్న అమెజాన్ చైనీస్ డిమాండ్ ను టార్గెట్ చేసింది. చైనాలో ఆపిల్ లాంటి అమెరికా ఉత్పత్తులు, విదేశీ మీడియా సేవలపై కఠినమైన నిబంధనలను ఉన్నప్పటికీ అమెరికా ఆన్లైన్ రీటైల్ సంస్థ అమెజాన్ .కాం తన ప్రైమ్ సర్వీసులను ప్రారంభించింది. చైనీయులనుంచి షాపింగ్ కోసం వస్తున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునే లక్ష్యంతో చైనీస్ మార్కెట్ పై కన్నేసింది. ముఖ్యంగా ఆలీబాబా గ్రూప్, జేడీ.కామ్ లాంటి స్తానిక ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ ప్రాథమిక సర్వీసులను ప్రారంభించింది. లగ్జరీ హ్యాండ్ బ్యాగులు, శిశువు ఉత్పత్తులకు తమకు అధిక డిమాండ్ ఉందని కంపెనీ చెబుతోంది. ఆలీబాబా తదతర షాపింగ్ ఏజెంట్ల ద్వారా ఇంటర్నేషనల్ సర్వీసులు అందిస్తున్నప్పటికీ తాజా నిర్ణయంతో ప్రధాన సేవల్ని ప్రారంభించినట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాణ్యత ఉత్పత్తులను చైనీయులకు సులువుగా అందించాలనే తమ లక్ష్యానికి ఇది నిదర్శనమని, తమ సేవలను సౌకర్యవంతంగా అందించడానికి మార్గం ఏర్పడిందని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ గ్రీలె శుక్రవారం రాయిటర్స్ కు అందించిన ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రైమ్ సర్వీస్ కింద వార్షిక చందాను 388 యెన్ లు, (57.23 డాలర్లు)గా అమెజాన్ నిర్ణించింది. దీని ప్రకారం 200 యెన్ల విలువచేసే కోనుగోలపై ఉచిత అన్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ ను ఆఫర్ చేస్తోంది. కాగా అమెజాన్ అంచనా ప్రకారం 2015 లో చైనాలో కేవలం 1.1 మార్కెట్ వాటా శాతం ఉంది. తాజా నిర్ణయంతో తన మార్కెట్ వాటాను మరింత విస్తరిచే యోచనలో ఉంది. అమెరికాలో అందిస్తున్న ఇతర సర్వీసులు, ముఖ్యంగా ఆన్ లైన్ మ్యూజిక్, వీడియోల సేవలపై మాత్రం స్పదించలేదు. ఎందుకంటే చైనాలో విదేశీ మీడియా ఉత్పత్తులపై కఠిన నిబందనలు అమల్లో ఉన్నాయి. ఇందులో టెక్ దిగ్గజం ఆపిల్ కు కూడా మినహాయింపులేదు. ఇటీవల నెట్ ఫ్లిక్స్ కూడా తన మీడియా సేవలను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. మరి అమెరికాకే చెందిన అమెజాన్ ఎలా నిలదొక్కుకుంటుందో చూడాలి. -
40వేలమంది డ్రైవర్ పార్టనర్స్ కావాలట!
దేశీయఎస్యూవీ మేకర్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ అటు వ్యాపార వృద్ధి,ఇటుతన వాహన విక్రయాల కోసం భారీ ప్రణాళికలే రచిస్తోంది. ముఖ్యంగా టాక్సీ ఎగ్రిగేటర్ ఓలాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం మేరకు వేల డ్రైవర్ పార్టనర్లపై దృష్టిపెట్టింది. సుమారు 40,000 డ్రైవర్ భాగస్వాముల లక్ష్యంగా ముందుకెళుతున్నట్టు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది. అలాగే ఈ టై అప్ ద్వారా రూ.2,660 కోట్లకు పైగా విలువైన వాహనాల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. 'మహీంద్రా-ఓల' ప్యాకేజీ గా చెబుతున్న దీని ప్రకారం డ్రైవర్ భాగస్వాములకు ప్రత్యేక ధరల్లో మహేంద్ర కార్లను విక్రయిస్తుంది. ప్రత్యేక ప్రయోజనాలు పాటు, జీరో డౌన్ పేమెంట్ లాంటి సదుపాయాలు పొందాలంటే ఆకర్షణీయమైన మహీంద్రా ఫైనాన్సింగ్ వద్ద కార్లు కొనుగోలు చేయాలి. అలాగే వీరికి సమగ్ర నిర్వహణ ప్యాకేజీలను అందిస్తున్న ఆ ప్రకటన తెలిపింది. దీంతోపాటు ఇలా కార్లను కొనుగోలు చేసిన డ్రైవర్లకు ప్రమాద భీమా, వారి పిల్లలకు స్కాలర్షిప్లను అందించనున్నట్టు పేర్కొంది. భారతదేశపు వినియోగదారుల ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను, ముఖ్యంగా యువకులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే డ్రైవర్లు, వారి కుటుంబాల మీద సానుకూల సామాజిక ప్రభావం ఉంటుందని మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఇలా చాలా ముఖ్యమైన వ్యూహాత్మక ఒప్పందమని తెలిపారు. మహీంద్ర తో ఒప్పందం తమ వ్యాపారంలోగణనీయైన వృద్ధి ఉండనుందని ఓల సహ వ్యవస్థాపకుడు, సీఈవో భావిష్ అగర్వాల్ అభిప్రాపడ్డారు. -
టార్గెట్లకు నోటీసులు
ఏటూరునాగారం : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్న టార్గెట్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు నిర ్వహిస్తున్న నేపథ్యంలో ఏ అఘాయిత్యానికైనా పాల్పడవచ్చనే అనుమానంతో ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లోని కాంట్రాక్టర్లు, నకిలీ రుణాల దళారులు, రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి నుంచి వారిని జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. -
ఉద్యోగులకు 'చేదు' పనిష్మెంట్..!
చైనాః ఉద్యోగులకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయడంకోసం కొన్ని కంపెనీలు షరతులు విధిస్తుంటాయి. అలవెన్సులు కట్ చేయడం, ఎక్కువ సమయం పనిచేయించడం ఇదేదీ కుదరకపోతే సస్సెండ్ చేయడం కూడా చూస్తుంటాం. కానీ ఓ చైనా కంపెనీ తమ ఉద్యోగులు టార్గెట్ ను చేరుకోలేకపోతే వింత శిక్ష విధిస్తోంది. అమ్మకాల్లో అనుకున్న గమ్యాన్ని చేరుకోలేనివారికి సహోద్యోగుల ముందు 'చేదు' అనుభవాన్ని చవి చూపిస్తోంది. ఆధునిక నాగరికతను, అత్యాధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న దేశంలో.. ఉద్యోగులకు ఇస్తున్న అనాగరిక శిక్షకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఇప్పటిదాకా చరిత్రలో కనీ వినీ ఎరుగని శిక్షను ఛొన్క్గింన్గ్ ఆధారిత లెషాంగ్ డెకరేషన్స్ కార్పొరేషన్ కంపెనీ.. తమ ఉద్యోగులకు విధిస్తోంది. టార్గెట్స్ చేరుకోలేకపోయిన వారితో బలవంతంగా కాకరకాయలు తినిపించే పనిష్మెంట్ ఇస్తోంది. ఉన్నతాధికారుల అంచనాల ప్రకారం వారాంతపు టార్గెట్లు చేరుకోలేకపోయిన వారితో బలవంతంగా సహచరుల ముందు కాకరకాయలు తినిపించి తీవ్రంగా అవమాన పరుస్తోంది. ఒకవేళ తినేప్పుడు ఏమాత్రం కింద పడినా, చేదు భరించలేక ఉమ్మేసినా.. మరింత ఎక్కువగా తినాలన్న రూలు పెట్టింది. సరైన ఫలితాలను ఇవ్వలేని కార్మికులకు ఇటువంటి అవమానకర పనిష్మెంట్ ఇస్తోంది. ఈ చేదును భరించలేక ఉద్యోగులు ఎప్పటికప్పుడు అంచనాలను చేరుకుంటారన్న ఆలోచనతో కంపెనీ ఈ క్రూరమైన శిక్షను విధిస్తోంది. ఇంటర్నెట్ లో పోస్టు చేసిన ఫోటోలను బట్టి.. సుమారు 40 మంది ఉద్యోగులు బలవంతంగా ఈ కాకరకాయ శిక్షను అనుభవించినట్లు తెలుస్తోంది. ఆ చేదు కాకరకాయలను తినండం.. ముఖ్యంగా మింగడం ఎంతో కష్టంగా ఉందని శిక్షను అనుభవించినవారిలో ఓ యువతి స్థానిక విలేకరులకు ఫిర్యాదు చేసింది. తినేప్పుడు ఎక్కిళ్ళు, వాంతు వచ్చినా సరే ఉమ్మకుండా తినాల్సి వచ్చిందని మరో యువతి చెప్పింది. లెషాంగ్ డెకరేషన్స్ కార్పొరేషన్ కంపెనీకి చెందిన ఓ మహిళా ఉద్యోగి.. తమ సంస్థలో ఉద్యోగులపట్ల యాజమాన్యం, ఉన్నతాధికారులు చూపిస్తున్నదురాగతాలను వెలుగులోకి తెచ్చింది. ఇంతకు ముందు కూడా సంస్థ అధికారులు ఉద్యోగులతో గుంజీలు తీయించడం, కార్యాలయం చుట్టూ రెండుమూడుసార్లు పరిగెట్టించడం వంటివి చేసినట్లు తెలిపింది. తాజాగా వారాంతపు పనిష్మెంట్ లో భాగంగా కిలో 2.5 యువాన్లకు కొని మరీ చేదు కాకరకాయలను తినిపిస్తోందని పేర్కొంది. చేదు సమస్యను ఎదుర్కొంటున్న ఉద్యోగులు.. ఆ వివరాలను తెలుపుతూ ఫోటోలు ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ అసాధారణ శిక్ష... అధికారులు ఆశించిన దానికి భిన్నంగా కూడా ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా బలవంతంగా సహచరుల ముందు కాకరకాయలు తినిపించడంతో 50 శాతం ఉద్యోగులు సంస్థను విడిచి వెళ్ళిపోతున్నారు. ఉద్యోగులకు సంస్థ ఇచ్చే చాలీచాలని జీతాలకు తోడు, అధికారులు పెట్టే అధిక ఒత్తిడి, ముఖ్యంగా సహోద్యోగుల ముందు అవమానించడాన్ని భరించలేకే సంస్థను విడిచి వెళ్ళేందుకు సిద్ధమౌతున్నట్లు సదరు మహిళా ఉద్యోగి స్థానిక విలేకర్లకు ఫిర్యాదు చేసింది. చైనా శ్రామిక చట్టం ఆర్టికల్ 88 ప్రకారం.. ఉద్యోగికి ఎటువంటి నష్టం సంభవించినా యాజమాన్యం అందుకు బాధ్యత వహించి, పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే కంపెనీలు ఈ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది. కార్మికుల కాళ్ళు, చేతులు కట్టి వీధుల్లో అందరి ముందూ నడిపించడం, సరస్సులచుట్టూ మోకాళ్ళపై నడిపించడం వంటి ఎన్నో అమానవీయ శిక్షలను కొన్ని సంవత్సరాలుగా కంపెనీల్లోని అధికారులు ఉద్యోగులకు విధిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారంటూ కార్మికులు వాపోతున్నారు. -
మన లక్ష్యం 1
వినూత్నంగా ఐటీ విధానం సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే తెలంగాణను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం కొత్త ఐటీ విధానాన్ని ఆవిష్కరించింది. ఐటీలో నూతన సాంకేతిక విజ్ఞానానికి ప్రధాన చిరునామాగా, దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణను నిలపాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పౌర సేవల వినియోగం, వినిమయంలో ఐటీని గణనీయంగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ప్రధానంగా పది అంశాల ఎజెండాను ప్రకటించింది. ఐటీ కంపెనీల విస్తరణ, ఎలక్ట్రానిక్స్, కొత్త పరిశ్రమల స్థాపన (ఎంటర్ ప్రెన్యూర్షిప్), శిక్షణ నైపుణ్యం (స్కిల్లింగ్), ప్రభుత్వపరంగా ఐటీ సేవలు (ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఐటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బై గవర్నమెంట్), కొత్త ఆవిష్కరణలు (న్యూ ఇనీషియేటివ్స్), ఈ-గవర్నెన్స్, ఎం-గవర్నెన్స్, డిజిటల్ తెలంగాణ, ఉత్పత్తుల ప్రాచుర్యం(ప్రమోషన్స్), జీవన ప్రమాణాల పెంపు అంశాలను ఇందులో పొందుపరిచింది. ప్రధాన అంశాలివీ.. ► కొత్త ఐటీ క్లస్టర్ల ఏర్పాటు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలు, బీపీవోల ఏర్పాటుకు ప్రోత్సాహం. చిన్న, సూక్ష్మ కంపెనీలకు కొత్త టవర్స్ నిర్మాణంతో పాటు ఆర్థిక చేయూతనివ్వడం. ► ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు 15 రోజుల్లో అనుమతులు. రెండు ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటు. 600 ఎకరాల్లో ఈ-సిటీ, 310 ఎకరాల్లో సైన్స్ పార్కు. ► స్టార్టప్‌లకు వేదికగా టీ-హబ్ విస్తరణ. ఐఐఐటీ, ఐఎస్బీ, నల్సార్, ఐఐటీ, బిట్స్‌తో ప్రభుత్వం భాగస్వామ్య పద్ధతిలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, మేనేజ్మెంట్, లా వివిధ విభాగాల్లో ఔత్సాహికులకు ప్రోత్సాహం. ఇంక్యుబేటర్స్, యాక్సిలేటర్స్, సీడ్ ఫండ్స్ ఏర్పాటుకు అండ. ► తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ. ఉపాధి కల్పన ► ప్రభుత్వ విభాగాల్లో ఐటీ సేవల విస్తరణ. ప్రభుత్వ రంగ సంస్థల ఆవిష్కరణలను ఆధునికీకరించేందుకు ఐటీ కంపెనీలతో అనుబంధం. ► గేమింగ్, యానిమేషన్, డేటా ఎనలిటిక్స్ కంపెనీలకు వీలుగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు. సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి,కొత్త పరిజ్ఞానం రూపకల్పనకు చేయూత. ► పౌర సేవలను మరింత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ అప్లికేషన్ల వినియోగం. టెలికం ప్రొవైడర్లు, మొబైల్ స్టోర్స్ ద్వారా సర్కారు సేవలు. ► తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం. ప్రధాన పట్టణాలు, నగరాల్లో వైఫై సదుపాయం. రాబోయే ఐదేళ్లలో ప్రతి కుటుంబంలో కనీసం ఒకరిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం. ప్రతి పాఠశాలలో ఆరో తరగతి నుంచి విద్యార్థులకు కంప్యూటర్ విద్య. ► రాష్ట్రంలో పెట్టుబడులకు ఐటీ కంపెనీలకున్న అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం. అంతర్జాతీయ, జాతీయ ప్రదర్శనలు, ట్రేడ్ షోలు, సదస్సులు, సెమినార్లలో పాల్గొనడం. ► జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా ‘బ్రాండ్ హైదరాబాద్’ను నిలబెట్టడం. ఐటీ/ఐటీఈఎస్ విస్తరణకు ప్రోత్సాహకాలు మెగా కంపెనీలు, ఐటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో నెలకొల్పే ఐటీ కంపెనీలు, ఇంజనీరింగ్ సేవలందించే కంపెనీలు, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ కంపెనీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు నెలకొల్పే కంపెనీలుగా వర్గీకరించింది. భూముల కేటాయింపు, విద్యుత్ చార్జీల రాయితీ, రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ, పేటెంట్ చార్జీల్లో రాయితీ, నాణ్యత సర్టిఫికెట్లలో రాయితీలను అన్ని కంపెనీలకు వర్తింపజేసింది. ► మెగా కంపెనీలకు స్వీయ అవసరాలకు సరిపడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు లెసైన్స్ ఇస్తారు. వంద కిలోవాట్లకు మించిన సౌర విద్యుత్ యూనిట్ నెలకొల్పుకునేందుకు రూ.20 లక్షలు లేదా మూలధనంలో పది శాతం.. ఏది తక్కువైతే అంత మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఏటా వంద మంది విద్యార్థులను క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకుంటే రూ.10 వేల చొప్పున నియామక సాయం అందిస్తారు. ► రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీల్లో పరిశోధనకయ్యే ఖర్చులో పది శాతం గ్రాంటుగా చెల్లిస్తారు. ప్రతిభ ఆధారంగా 25 శాతం పీహెచ్డీ విద్యార్థులకు ప్రతి నెలా రూ.25 వేలు స్టైఫండ్ ఇస్తారు. క్యాంపస్ రిక్రూట్మెంట్కు రూ.20 వేల చొప్పున సాయం. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో.. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో ఐటీ కంపెనీలు నెలకొల్పితే మొదటి మూడేళ్లు మున్సిపల్ ట్యాక్స్ రీయింబర్స్ చేస్తారు. రూ.20 వేల చొప్పున రిక్రూట్మెంట్ సాయం. బీపీవోలు నెలకొల్పితే 50 శాతం లేదా గరిష్టంగా రూ.20 లక్షలకు మించి పెట్టుబడి రాయితీ. అభ్యర్థులకు శిక్షణ భృతి ఇస్తారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకం.. రూ.5లక్షలలోపు టర్మ్, పెట్టుబడి రుణాల్లో ఐదేళ్లపాటు మహిళలకు 5 శాతం వడ్డీ రాయితీ, ఎస్సీ ఎస్టీలకు 8.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు రూపాయిన్నర చొప్పున రీయింబర్స్మెంట్. మూలధనంలో 25 శాతం ( మహిళలకు రూ.20 లక్షలకు మించకుండా, ఎస్సీ ఎస్టీలకు రూ.25 లక్షలకు మించకుండా) సబ్సిడీ అందిస్తారు. ఏడాదికి 50 మంది ఐటీ నిపుణులను రిక్రూట్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున నియామక సాయం అందిస్తారు. -
లాలూతోనే అసలు ఫైట్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనున్న జనతాదళ్ (యు) నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను వదిలేసి ఆర్జేడి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌నే ఎందుకు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ? జైలు పక్షి నీతులు వల్లిస్తున్నారని, బీహార్‌నే జైలుగా మార్చాలని చూస్తున్నారంటూ ఆయనపైనే తన విమర్శనాస్త్రాలను ఎందుకు గుప్పిస్తున్నారు ? జేడీయు కన్నా బీజేపీ విజయావకాశాలను దెబ్బతీసే శక్తి లాలూ పార్టీయేనని ఆయన గ్రహించడం, గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ కూడా ఈ విషయాన్నే సూచించడమే అందుకు కారణం. 2010లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 91 సీట్లు గెలుచుకోగా, అందులో 29 సీట్లను వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కైవసం చేసుకుంది. మరో 13 సీట్లలో వరుసగా రెండోసారి (2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో) విజయం సాధించింది. ఈ మొత్తం 42 సీట్లలో మెజారిటీ స్థానాల్లో బీజేపీ 15 వేలలోపు ఓట్ల మెజారిటీతోనే గెలిచింది. ఇందులో మెజారిటీ స్థానాల్లో లాలూ నాయకత్వంలోని ఆర్జేడీ పార్టీ గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలవగా, మిగతా స్థానాల్లో అప్పడు ఆర్జేడీ మిత్ర పక్షంగా పోటీ చేసిన రాంవిలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ గట్టి పోటీతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ వరుసగా మూడుసార్లు విజయం సాధించిన 29 సీట్లలో 2010 ఎన్నికల్లో 13 సీట్లలో ఆర్జేడీ రెండోస్థానంలో గట్టి పోటీ ఇచ్చింది. వీటిలో 9 స్థానాల్లో బీజేపీ 15 వేలలోపు ఓట్ల తేడాతోనే గెలిచింది. మిగతా 16 స్థానాల్లో లోక్ జనశక్తి పార్టీ రెండో స్థానంలో నిలిచింది. బీజేవీ వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 13 సీట్ల విషయంలోకూడా ఫలితాల తీరు ఇలాగే కొనసాగింది. పది సీట్లలో ఆర్జేడీ రెండో స్థానంలో నిలిచింది. వీటిలో ఐదు స్థానాల్లో పదివేలకు తక్కువ ఓట్ల తేడాతోనే బీజేపీ విజయం సాధించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆర్జేడీ బలానికి, జేడీయూ, కాంగ్రెస్ బలాలు కూడా తోడవ్వడంతో లాలూ పార్టీ నుంచే బీజేపీకి పోటీ ఎక్కువగా ఉంటుందని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ, లాలూను టార్గెట్ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చూసిన మోదీ, తన వ్యక్తిగత ఇమేజ్‌ని పణంగా పెట్టి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలన్న తాపత్రయంతో లక్షా పాతిక వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సృష్టించుకున్న లాలూకు కూడా బీహార్‌లో ఫాలోయింగ్ ఎక్కువే. బీహార్ రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను ఆర్జేడీ వంద స్థానాలకు, జేడీయూ మరో వంద స్థానాలకు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలకు పోటీ చేస్తోంది. బీజేపీ 160 స్థానాలకు పోటీ చేయాలనుకుంటోంది. మిగతా స్థానాలను లోక్ జనశక్తి లాంటి ఎన్డీయే మిత్ర పక్షాలకు వదిలేయాలనుకుంటోంది. -
సల్మాన్ సెంటిమెంట్‌కి బ్రేక్వేస్తున్న బాద్షా
-
తెలుగు రాష్ట్రాల్లో సీబిడిటి పన్నుల టార్గెట్
-
మరో ట్వీట్ బాంబ్ పేల్చిన మోదీ..
న్యూఢిల్లీ : ట్వీట్ల మీద ట్వీట్లతో రాజకీయ నేతలకు గుబులు పుట్టిస్తున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ...తన ఖాతాలోంచి మరో వికెట్ బయటకు తీశారు. మోదీ గేట్లో రోజుకొక పేరు బయటపెడుతూ గందరగోళం సృష్టిస్తున్న మోదీ మరో ట్వీట్ బాంబ్ పేల్చారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోని అగ్ర నాయకులపై ట్విట్టర్ అస్త్రాలు సంధించిన లలిత్ తాజాగా బీజేపీ యువ నాయకుడు వరుణ్ గాంధీని టార్గెట్ చేశారు. వరుసగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ శుక్లా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఎక్కుపెట్టిన ట్వీట్ల బాణాన్ని ఇపుడు వరుణ్ పై గురిపెట్టారు. కొన్ని సంవత్సరాల క్రితం తనను వరుణ్ లండన్‌లో కలిశారని...మొత్తం వ్యవహారాన్ని సెటిల్చేయడానికి 60 మిలియన్ డాలర్లు డిమాండ్ చేశాడని తెలిపారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, తన ఆంటీ సోనియాగాంధీతో మాట్లాడతానన్నారంటూ ట్వీట్ చేశారు. సినిమా చాలా ఉంది. మెల్లమెల్లగా బయటపెడతా అని హెచ్చరిస్తూ వస్తున్న లలిత్ మోదీ నిన్నగాక మొన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలను గత ఏడాది లండన్‌లో కలిశానంటూ వివాదాన్ని రాజేశారు. గాంధీ కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశారు. అనేక నర్మగర్భ వ్యాఖ్యలు, పరోక్ష హెచ్చరికలతో లలిత్ మోదీ వరుస ట్వీట్లు సంధిస్తున్న సంగతి తెలిసిందే. -
అన్ని వర్గాలకు కళ్యాణలక్ష్మే లక్ష్యం
హైదరాబాద్: తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా గురజాల రవీందర్ ఎన్నికయ్యారు. ఈ వేదికలో15 అంశాలపై తీర్మాణాలు చేశారు. వీటిలో మిషన్ కాకతీయను అభినందిస్తూ, ఫిలింసిటీని ఏర్పాటు చేయడం, కళ్యాణ లక్ష్మి పథకం ప్రముఖమైనవి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "కళ్యాణలక్ష్మి'' పథకాన్ని అన్ని వర్గాల పేదలకు వర్తింపజేయాలని తీర్మానించారు. -
ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ ఇప్పుడు రాహుల్ గాంధీ