న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ పునరుత్పాదక ఇంధన సంస్థ 2030 నాటికి 45 గిగావాట్ల (జీడబ్ల్యూ)పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్గారాలను తగ్గించి, భారత్ తన కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాన్ని చేరుకోవడానికి తన వంతు సహాయ సహకారాలను అందించాలని సంస్థ భావిస్తున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వర్గాలు తెలిపాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ 8,316 మెగావాట్ల (8.3 జీడబ్ల్యూ) పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రస్తుతం కలిగి ఉంది. మరో 12,118 మెగావాట్ల సామర్థ్యం నిర్మాణ దశలో ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇందు కోసం ప్రతి సంవత్సరం సౌర, పవన శక్తి నుంచి 3 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారయి.
ఫ్రెంచ్ ఎనర్జీ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో 19.7 శాతం వాటాను కలిగి ఉంది. ఇటీవల యూఎస్ పెట్టుబడి సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్ కంపెనీలో 6.8 శాతం వాటాను, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ మరో 2.8 శాతం వాటాను కొలుగోలు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment