
40వేలమంది డ్రైవర్ పార్టనర్స్ కావాలట!
ఎస్యూవీ మేకర్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ అటు వ్యాపార వృద్ధి,ఇటుతన వాహన విక్రయాల కోసం భారీ ప్రణాళికలే రచిస్తోంది. సుమారు 40,000 డ్రైవర్ భాగస్వాముల లక్ష్యంగా ముందుకెళుతున్నట్టు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.
దేశీయఎస్యూవీ మేకర్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ అటు వ్యాపార వృద్ధి,ఇటుతన వాహన విక్రయాల కోసం భారీ ప్రణాళికలే రచిస్తోంది. ముఖ్యంగా టాక్సీ ఎగ్రిగేటర్ ఓలాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం మేరకు వేల డ్రైవర్ పార్టనర్లపై దృష్టిపెట్టింది. సుమారు 40,000 డ్రైవర్ భాగస్వాముల లక్ష్యంగా ముందుకెళుతున్నట్టు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది. అలాగే ఈ టై అప్ ద్వారా రూ.2,660 కోట్లకు పైగా విలువైన వాహనాల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది.
'మహీంద్రా-ఓల' ప్యాకేజీ గా చెబుతున్న దీని ప్రకారం డ్రైవర్ భాగస్వాములకు ప్రత్యేక ధరల్లో మహేంద్ర కార్లను విక్రయిస్తుంది. ప్రత్యేక ప్రయోజనాలు పాటు, జీరో డౌన్ పేమెంట్ లాంటి సదుపాయాలు పొందాలంటే ఆకర్షణీయమైన మహీంద్రా ఫైనాన్సింగ్ వద్ద కార్లు కొనుగోలు చేయాలి. అలాగే వీరికి సమగ్ర నిర్వహణ ప్యాకేజీలను అందిస్తున్న ఆ ప్రకటన తెలిపింది. దీంతోపాటు ఇలా కార్లను కొనుగోలు చేసిన డ్రైవర్లకు ప్రమాద భీమా, వారి పిల్లలకు స్కాలర్షిప్లను అందించనున్నట్టు పేర్కొంది.
భారతదేశపు వినియోగదారుల ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను, ముఖ్యంగా యువకులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే డ్రైవర్లు, వారి కుటుంబాల మీద సానుకూల సామాజిక ప్రభావం ఉంటుందని మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఇలా చాలా ముఖ్యమైన వ్యూహాత్మక ఒప్పందమని తెలిపారు. మహీంద్ర తో ఒప్పందం తమ వ్యాపారంలోగణనీయైన వృద్ధి ఉండనుందని ఓల సహ వ్యవస్థాపకుడు, సీఈవో భావిష్ అగర్వాల్ అభిప్రాపడ్డారు.