మరో ట్వీట్ బాంబ్ పేల్చిన మోదీ.. | Now, Lalit Modi targets Varun Gandhi, | Sakshi
Sakshi News home page

మరో ట్వీట్ బాంబ్ పేల్చిన మోదీ..

Published Wed, Jul 1 2015 1:17 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

మరో ట్వీట్ బాంబ్ పేల్చిన మోదీ..

మరో ట్వీట్ బాంబ్ పేల్చిన మోదీ..

న్యూఢిల్లీ : ట్వీట్ల మీద ట్వీట్లతో రాజకీయ నేతలకు గుబులు పుట్టిస్తున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ...తన ఖాతాలోంచి మరో వికెట్ బయటకు తీశారు. మోదీ గేట్లో రోజుకొక పేరు బయటపెడుతూ గందరగోళం సృష్టిస్తున్న మోదీ మరో ట్వీట్‌ బాంబ్ పేల్చారు.   ఇప్పటికే  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోని అగ్ర నాయకులపై ట్విట్టర్ అస్త్రాలు సంధించిన లలిత్  తాజాగా బీజేపీ యువ నాయకుడు వరుణ్ గాంధీని టార్గెట్ చేశారు.  

వరుసగా  కాంగ్రెస్ నాయకులు రాజీవ్ శుక్లా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఎక్కుపెట్టిన ట్వీట్ల బాణాన్ని ఇపుడు వరుణ్ పై గురిపెట్టారు.  కొన్ని సంవత్సరాల క్రితం తనను వరుణ్ లండన్లో కలిశారని...మొత్తం వ్యవహారాన్ని సెటిల్చేయడానికి 60 మిలియన్ డాలర్లు డిమాండ్ చేశాడని తెలిపారు. అప్పట్లో అధికారంలో ఉన్న  కాంగ్రెస్  పార్టీ అధ్యక్షురాలు, తన  ఆంటీ  సోనియాగాంధీతో మాట్లాడతానన్నారంటూ ట్వీట్ చేశారు.

సినిమా చాలా ఉంది. మెల్లమెల్లగా బయటపెడతా అని హెచ్చరిస్తూ  వస్తున్న లలిత్ మోదీ నిన్నగాక మొన్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్‌ వాద్రాలను గత ఏడాది లండన్‌లో కలిశానంటూ వివాదాన్ని రాజేశారు. గాంధీ కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశారు.  అనేక నర్మగర్భ వ్యాఖ్యలు, పరోక్ష హెచ్చరికలతో లలిత్‌ మోదీ వరుస ట్వీట్‌లు సంధిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement