
చైనాను టార్గెట్ చేసిన అమెజాన్
బీజింగ్ : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇపుడు చైనాను టార్గెట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సర్వీసెస్ అందిస్తున్న అమెజాన్ చైనీస్ డిమాండ్ ను టార్గెట్ చేసింది. చైనాలో ఆపిల్ లాంటి అమెరికా ఉత్పత్తులు, విదేశీ మీడియా సేవలపై కఠినమైన నిబంధనలను ఉన్నప్పటికీ అమెరికా ఆన్లైన్ రీటైల్ సంస్థ అమెజాన్ .కాం తన ప్రైమ్ సర్వీసులను ప్రారంభించింది. చైనీయులనుంచి షాపింగ్ కోసం వస్తున్న డిమాండ్ను క్యాష్ చేసుకునే లక్ష్యంతో చైనీస్ మార్కెట్ పై కన్నేసింది. ముఖ్యంగా ఆలీబాబా గ్రూప్, జేడీ.కామ్ లాంటి స్తానిక ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ ప్రాథమిక సర్వీసులను ప్రారంభించింది. లగ్జరీ హ్యాండ్ బ్యాగులు, శిశువు ఉత్పత్తులకు తమకు అధిక డిమాండ్ ఉందని కంపెనీ చెబుతోంది. ఆలీబాబా తదతర షాపింగ్ ఏజెంట్ల ద్వారా ఇంటర్నేషనల్ సర్వీసులు అందిస్తున్నప్పటికీ తాజా నిర్ణయంతో ప్రధాన సేవల్ని ప్రారంభించినట్టు ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాణ్యత ఉత్పత్తులను చైనీయులకు సులువుగా అందించాలనే తమ లక్ష్యానికి ఇది నిదర్శనమని, తమ సేవలను సౌకర్యవంతంగా అందించడానికి మార్గం ఏర్పడిందని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ గ్రీలె శుక్రవారం రాయిటర్స్ కు అందించిన ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రైమ్ సర్వీస్ కింద వార్షిక చందాను 388 యెన్ లు, (57.23 డాలర్లు)గా అమెజాన్ నిర్ణించింది. దీని ప్రకారం 200 యెన్ల విలువచేసే కోనుగోలపై ఉచిత అన్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ ను ఆఫర్ చేస్తోంది.
కాగా అమెజాన్ అంచనా ప్రకారం 2015 లో చైనాలో కేవలం 1.1 మార్కెట్ వాటా శాతం ఉంది. తాజా నిర్ణయంతో తన మార్కెట్ వాటాను మరింత విస్తరిచే యోచనలో ఉంది. అమెరికాలో అందిస్తున్న ఇతర సర్వీసులు, ముఖ్యంగా ఆన్ లైన్ మ్యూజిక్, వీడియోల సేవలపై మాత్రం స్పదించలేదు. ఎందుకంటే చైనాలో విదేశీ మీడియా ఉత్పత్తులపై కఠిన నిబందనలు అమల్లో ఉన్నాయి. ఇందులో టెక్ దిగ్గజం ఆపిల్ కు కూడా మినహాయింపులేదు. ఇటీవల నెట్ ఫ్లిక్స్ కూడా తన మీడియా సేవలను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. మరి అమెరికాకే చెందిన అమెజాన్ ఎలా నిలదొక్కుకుంటుందో చూడాలి.