జన్నారం : ఉద్యోగులకు నష్టం కలిగించే కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు కోరుతూ ఆ విధానం అమలు చేసిన రోజు సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమైనట్లు సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు తెలిపారు.
సీపీఎస్ విధానంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
Published Fri, Aug 26 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
జన్నారం : ఉద్యోగులకు నష్టం కలిగించే కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు కోరుతూ ఆ విధానం అమలు చేసిన రోజు సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమైనట్లు సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ విధానం వల్ల ఉద్యోగ విరమణ అనంతరం, ఉద్యోగి మరణించినా వారి కుటుంబాలకు పెన్షన్ లేకపోవడం, సీపీఎస్ విధానం షేర్ మార్కెట్‌తో ముడిపడి ఉండటం వల్ల ఈ సంక్లిష్టమైన సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు తీసి తహసీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడం, డివిజన్ కేంద్రాల్లో ఆర్డీవోలకు, జిల్లా కేంద్రంలో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సమావేశానికి అన్ని జిల్లాల బాధ్యులు హాజరు కావాలని కోరారు.
Advertisement
Advertisement